చైనా ప్రభుత్వంతో పెట్టుకొని బతికి బట్టకట్టటం అంత తేలికైన విషయం కాదు. చైనా ఈ-కామర్స్ లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించే అలీబాబాకు కొంత కాలం క్రితం నుంచి బ్యాడ్ టైం షురూ కావటం తెలిసిందే. ప్రభుత్వం కన్నెర్ర చేసిన నేపథ్యంలో అలీబాబా అధినేత జాక్ మాకు కొత్త కష్టాలు పిడుగుల మాదిరి ఒకటి తర్వాత ఒకటి చొప్పున పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కంపెనీ మరో షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. …
Read More »ఈ దేశంలో ఉద్యోగాలే ఉద్యోగాలు
ప్రపంచంలోని చాలా దేశాల్లో ఉద్యోగాలకు ఎసరొచ్చేస్తుంటే కెనడాలో మాత్రం ఉద్యోగులకు కొరత వచ్చేసింది. వివిధ రంగాల్లో అన్ని రకాల ఉద్యోగాలు కలిపి సుమారు 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కెనడా లేబర్ ఫోర్స్ డిపార్టమెంట్ ప్రకటించింది. ఎప్పటినుండో 7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి మొన్నటి మే నెలలో 3 లక్షల ఉద్యోగాలు యాడ్ అయ్యాయి. దాంతో 10 లక్షల ఉద్యోగాలు ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నాయి. …
Read More »గూగుల్ స్ట్రీట్ వ్యూ.. మంచి-చెడులు ఇవే!
కేంద్ర ప్రభుత్వం అనుమతితో.. భారత్ లో గూగుల్ స్ట్రీట్ వ్యూ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. దీంతో చిన్న చిన్న గల్లీలు కూడా స్పష్టంగా 360 డిగ్రీల కోణంలో చూడొచ్చు. 2011లోనే గూగుల్ స్ట్రీట్ వ్యూ సేవలు భారత్లోకి వచ్చినప్పటికీ.. భద్రతాపరంగా ముప్పు పొంచి ఉందన్న కారణంతో 2016లో దీనిపై నిషేధం విధించింది. ఈ సేవల వల్ల ఉగ్రమూకలు సులువుగా రక్షణ శాఖకు చెందిన వివరాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తుందన్న భావన …
Read More »కరణ్.. ఈ సెక్స్ పిచ్చి ఏందయ్యా సామీ?
రణవీర్ సింగ్ మరియు ఆలియ భట్ తో మొదలు పెట్టి, ఝాన్వి కపూర్, సారా ఆలీ ఖాన్ తో దానిని తారా స్థాయికి తీసుకెళ్ళి, విజయ్ దేవరకండి, అనన్య పాండేలతో చాలా మాట్లాడించి.. చివరకు ఓల్డ్ ఏజ్ క్యాటగిరీలోకి స్లిప్ప అవుతున్న కరీనా కపూర్ మరియు ఆల్రెడీ ఐదు పదులు దాటిన ఆమీర్ ఖాన్ తో కూడా సేమ్ ”సెక్స్” పాటే పాడించేశాడు కరణ్ జోహార్. ఇతగాడు నిర్వహించే ”కాఫీ …
Read More »దక్షిణాదిపై డ్రాగన్ ప్రత్యేక నిఘా
డ్రాగన్ దేశం కొత్తం కంపు మొదలుపెట్టింది. ఇండియాలోని దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకమైన నిఘా ఉంచేందుకు రెడీ అయిపోయింది. తన దేశం నుండి ఏమి చేసుకున్నా ఎవరికీ అభ్యంతరాలు ఉండకపోను. కానీ పొరుగునే ఉన్న శ్రీలంకను తన నిఘాకు అనువుగా మార్చుకుంటోంది. దీనిపైనే కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన అభ్యంతరాలు చెబుతోంది. శ్రీలంకలోని హంబన్ టొట నౌకాశ్రయం నుండి డ్రాగన్ దేశం నిఘా వేసేందుకు ‘యువాన్ వాంగ్ 5’ అనే నిఘా నౌకను పంపింది. చైనా …
Read More »డెడ్ లైన్: కాసులే కాసులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చిట్టాపద్దులు అప్పుడే మొదలయిపోయాయి. ఇదే సమయాన గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చిట్టా పద్దులు అనగా ఐటీ రిటర్న్స్ లెక్క తేలాల్సి ఉంది. ఆఖరికి నిన్నటి వేళ గడువు ముగిసే సమయానికి చాలా ఎక్కువ మందే స్పందించారు. దేశ రాజధానిలో ఆదాయపు పన్ను చెల్లించేందుకు అర్హత ఉన్న వారంతా అనూహ్య స్థాయిలో ఆఖరి ఆదివారం అనగా జూలై 31న స్పందించారు. ఒక్క నిన్నటి రోజునే 68 – 75 లక్షల …
Read More »రూటు మార్చిన లోన్ యాప్ నిర్వాహకులు
ఇచ్చిన అప్పును తిరిగి వసూలు చేసుకునే విషయంలో లోన్ యాప్ నిర్వాహకులు రూటు మార్చినట్లు అనుమానంగా ఉంది. లోన్ యాప్ అనేది ఇపుడు సమాజానికి పట్టిన పెద్ద చీడగా కనిపిస్తోంది. ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోయినా, గ్యారంటార్లు లేకపోయినా, సంతకాలు లేకపోయినా యాప్ నిర్వాహకులు వేల రూపాయలు అప్పులిచ్చేస్తున్నారు. అప్పు ఇచ్చేటపుడు అప్పు తీసుకుంటున్న వ్యక్తి ఫొటో, భార్య, తల్లిదండ్రుల ఫోటోలు, ఆధార్ కార్డు నెంబర్లతో పాటు మొబైల్ కాంటాక్టు చొరబడేందుకు …
Read More »జెలెన్ స్కీ పై మండిపోతున్న నెటిజన్లు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై నెటిజన్లు మండిపోతున్నారు. ఒకవైపు దేశంపై రష్యా బాంబులు కురిపించి నాశనంచేసేస్తోంది. మరోవైపు ఇప్పటికే మామూలుజనాలతో పాటు సైనికులు కూడా వేలాదిమంది చనిపోయిరు. దేశంలో చాలాభాగం సర్వనాశనమైపోయింది. ఇలాంటి సమయంలోనే జెలెన్ స్కీ తన భార్యతో కలిసి ఫొటో షూట్ కి దిగారు. అంతర్జాతీయ మ్యాగజైన్ వోగ్ కు ఇంటర్వ్యూ కోసమని తన భార్యతో కలిసి ఫొటో షూట్ దిగటం ఇపుడు ప్రపంచదేశాల్లో సంచలనంగా మారింది. …
Read More »పిల్లల్ని కనడంపై నియంత్రణ.. కేంద్రం కొత్త చట్టం
దేశంలో జనాభా పెరిగిపోతోంది. వచ్చే ఏడాది నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనా ను దాటి భారత్ నిలవనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘2022 ప్రపంచ జనాభా అంచనాల’ నివేదికను విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే దేశంలో జనాభా నియంత్రణకు మోడీ సర్కారు నడుం బిగించింది. దేశంలో ఒకరు లేదా.. ఇద్దరు మాత్రమే పిల్లల్ని కనేలా.. చట్టం తీసుకువస్తున్నారు. …
Read More »పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోతున్నారా ?
దేశంలోని యువత అంటే అబ్బాయిలు, అమ్మాయిలు కూడా పెళ్ళి చేసుకునే విషయంలో పెద్ద ఆసక్తి చూపటం లేదట. చదవు, ఉద్యోగాలు, వృత్తులు లాంటి వ్యాపకాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్న కారణంగా పెళ్ళికాని ప్రసాదుల సంఖ్య బాగా పెరిగిపోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజా గణాంకాలు చెబుతున్నాయి. పెళ్ళికాని ప్రసాదులు పెరిగిపోతున్నారంటే అర్ధం పెళ్ళికాని అమ్మాయిల సంఖ్య కూడా పెరిగిపోతున్నట్లే అర్ధం. జాతీయ యువజన పాలసీ 2014 ప్రకారం 15-29 మధ్య వయసు …
Read More »కోహ్లీపై దారుణమైన ట్రోలింగ్
భారత క్రికెట్ అనే కాక ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాట్స్మెన్లో ఒకడైన విరాట్ కోహ్లికి ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. ఒకప్పుడు అలవోకగా సెంచరీల మీద సెంచరీలు కొట్టేసిన అతను.. రెండున్నరేళ్లకు పైగా ఏ ఫార్మాట్లోనూ ఒక్కసారి కూడా మూడంకెల స్కోరు చేయలేదు. ఇటు అంతర్జాతీయ క్రికెట్లో, అటు ఐపీఎల్లో అతను విఫలమయ్యాడు. అందులోనూ ఈ మధ్య అతడి ప్రదర్శన మరీ తీసికట్టుగా తయారైంది. ఇంగ్లాండ్తో చివరి టెస్టులో, …
Read More »తానా ఫౌండేషన్ కు చైర్మన్ గా శశికాంత్ వల్లేపల్లి
తానా ఫౌండేషన్ ట్రస్టీలు గురువారం జున్ 30వ తేదీ జరిగిన సమావేశంలో నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్ గా శశికాంత్ వల్లేపల్లి, కార్యదర్శిగా విద్యాధర్ గారపాటి, కోశాధికారి గా వినయ్ మద్దినేని ఎన్నికయ్యారు. తానా ఫౌండేషన్ చైర్మన్ గా ఎన్నికైన శశికాంత్ వల్లేపల్లి సుదీర్ఘకాలంగా తానాలో తానా ఫౌండేషన్ లో సేవలందిస్తూ, కాంత్ ఫౌండేషన్ స్థాపించి ద్వారా కోట్లాది రూపాయలు విరాళాలుగా అందించారు. కోవిడ్ మహమ్మారి తీవ్రతతో ఇబ్బందులు పడిన …
Read More »