ఐపీఎల్ 2025 సీజన్లో ఆటకు మించిన డ్రామాలు ఎక్కువైపోతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ యువ బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ పేరు ఇందుకు ఉదాహరణగా నిలిచింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై లక్నో ఓటమిపాలవగా, మ్యాచ్‌లో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య వికెట్ తీసిన తరువాత దిగ్వేశ్ సింగ్ చేసిన హావభావాలు వివాదాస్పదంగా మారాయి. అతని నేరుగా ప్రియాన్ష్ దగ్గరకు వెళ్లి లెటర్ రాస్తున్నట్టు హావభావాలు …
Read More »కోటీశ్వరుడి కాలినడక.. ద్వారకకు అంబానీ తనయుడు!
ఆయన కోటీశ్వరుడి కుమారుడు. ఎండకన్నెరుగని ఫ్యామిలీ. అయితే.. ఇప్పుడు కారణాలు ఏవైనా.. కాలినడక పట్టారు. ఏకంగా.. 140 కిలో మీటర్ల దూరాన్ని పాదయాత్రగా చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనే భారత దేశ వ్యాపార దిగ్గజం ముఖేష్ కుమార్ అంబానీ తనయుడు.. అనంత్ అంబానీ. ప్రస్తుతం ఆయన గుజరాత్‌లోని జామ్ నగర్ నుంచి ప్రఖ్యాత కృష్ణ క్షేత్రం ద్వారకకు పాదయాత్ర చేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 140 కిలో …
Read More »మోనాలిసాకు ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు అరెస్టు
మహా కుంభమేళా సందర్భంగా యావత్ దేశాన్ని ఆకర్షించిన ఒక అంశం పూసలు అమ్ముకునే మోనాలిసా భోంస్లే. పదహారేళ్ల ఈ నిరేపేద టీనేజర్ జీవితాన్నే మార్చేసింది కుంభమేళా. దీంతో ఆమె జాతీయ సెలబ్రిటీగా మారటమే కాదు.. ఒక బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా.. తన సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చారు. త్వరలో తీసే ‘ది డైరీ ఆఫ్ మణిపుర్’ మూవీలో ఒక పాత్రకు ఆమెను ఎంపిక చేసుకోవటం తెలిసిందే. ఇందుకోసం మోనాలిసా …
Read More »మొన్న రణవీర్, నిన్న కునాల్.. నేడు స్వాతి
స్టాండప్ కామెడీ నవ్వు తెప్పించడం సంగతేమో గానీ… కట్టుబాట్లను మాత్రం చాలా సునాయసంగా దాటేస్తోంది. భారత సమాజం గుట్టుగా ఉంచే కార్యకలాపాలను స్టాండప్ కమెడియన్ల పేరిట బయటకు వస్తున్న కొందరు వ్యక్తులు వాటిని బహిరంగ చర్చకు పెట్టేసి కంపు చేసేస్తున్నారు. మొన్నటికి మొన్న రణవీర్ అహ్లాబాదియా వ్యవహారం దేశవ్యాప్తంగా పెను విమర్శలకు కారణమైంది. కేసులనూ, కోర్టు అక్షింతనూ ఎదుర్కొన్నాడు. అతడి ఉదంతాన్ని మరువక ముందే కునాల్ కామ్రా పాలకులనే విమర్శించి బుక్కయ్యాడు. ఇప్పుడు లేడీ స్టాండప్ కమెడియన్ స్వాతి …
Read More »ఇలాగైతే సన్‌రైజర్స్ మ్యాచ్ లు హైదరాబాద్ లో ఉండవట
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) – సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మధ్య తాజా వివాదం తీవ్రంగా మారేలా కనిపిస్తోంది. ఉచిత పాస్‌లను పెంచాలని హెచ్‌సీఏ చేస్తున్న ఒత్తిడి నేపథ్యంలో సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ బలమైన హెచ్చరికను జారీ చేసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు తీరుతో సహనానికి అతీతంగా మారిన సన్‌రైజర్స్ యాజమాన్యం, పరిస్థితి ఇలానే కొనసాగితే నగరాన్ని వదిలి మరొక వేదికపై ఆడతామని వెల్లడించింది. స్టేడియంపై అద్దె చెల్లిస్తున్న SRH యాజమాన్యం …
Read More »ముకేశ్ అంబానీ రూ.వెయ్యి కోట్ల విమానం వచ్చేసింది
ఖరీదైన వస్తువుల్ని కొనుగోలు చేసే విషయంలో భారత కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఎప్పుడూ ముందుంటారు. ఆయన కొనుగోలు చేసిన ఖరీదైన బోయింగ్ ప్రైవేట్ జెట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రూ.వెయ్యి కోట్లు విలువైన ఈ విలాసవంతమైన జెట్ కలిగి ఉన్న మొదటి పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీనే. ఇప్పటికే ఆయన కలెక్షన్ లో పలు ప్రైవేట్ జెట్ లు ఉన్నాయి. అయితే.. మిగిలిన వాటితో పోలిస్తే …
Read More »‘ఎక్స్’ను అమ్మేసిన ఎలాన్ మస్క్.. ట్విస్టు మామూలుగా ఉండదు
వ్యాపారం అందరూ చేస్తారు. కొందరు కష్టాన్ని నమ్ముకుంటే.. మరికొందరు తెలివిని నమ్ముకుంటారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మాత్రం ఈ రెండింటిని జోడించి బిజినెస్ చేస్తాడు. రిస్క్ తీసుకునే విషయంలో అతగాడికి మించినోడు మరొకడు ఉండడన్నట్లుగా వ్యవహరిస్తాడు. సాధారణంగా ప్రపంచ కుబేరుడు హోదాలో ఉన్నోడు ఎవరూ కూడా రాజకీయాల్లో వేలు పెట్టేందుకు.. ప్రభుత్వంలో భాగస్వామి కావటానికి అస్సలు ఇష్టపడరు. అందరిలా అలా చేస్తే అతడు మస్క్ ఎందుకు అవుతాడు?మిగిలిన పారిశ్రామికవేత్తలకు …
Read More »బాబు, లోకేశ్ గిబ్లీ ట్రెండ్స్ అదిరిపోయాయబ్బా!
సోషల్ మీడియాలో ఇప్పుడంతా గిబ్బీ ట్రెండ్స్ నడుస్తోంది కదా. జపాన్ కు చెందిన యానిమేషన్ స్టూడియో ఒరవడిని అందిపుచ్చుకుని… ఆ స్టూడియో చిత్రాల మాదిరిగానే యానిమేషన్ చిత్రాలను పోస్ట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ గా మారిపోయింది. దాదాపుగా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులంతా ఈ గిబ్లీ ట్రెండ్స్ న ఫాలో అవుతూ గిబ్లీఫైడ్ ప్రపంచంలో ఎంట్రీ ఇస్తూ తమదైన శైలిలో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ చిత్రాలు …
Read More »భూకంప విలయం… బ్యాంకాక్, మయన్మార్ లలో భారీ నష్టం
ఆసియాలో ప్రముఖ పర్యాటక దేశంగా పేరుగాంచిన థాయ్ ల్యాండ్ తో పాటు నిత్యం అంతర్యుద్ధంతో సతమతం అవుతున్న మయన్మార్ లను శుక్రవారం భూకంపం వణికించింది. వరుసగా రెండు భారీ భూకంపాలు చోటుచేసుకోగా.. ఈ రెండు దేశాల్లో భారీ నష్టమే చోటుచేసుకుంది. తొలి భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు కాగా…రెండో భూకంపం 6.4 తీవ్రతో చోటుచేసుకుంది. వరుసగా రెండు భూకంపాలు నిమిషాల వ్యవధిలో చోటుచేసుకోవడంతో నష్టం భారీగా జరిగింది. …
Read More »SRH ఊచకోతను అడ్డుకోవడానికి కీలక మార్గం ఇదే..
ఐపీఎల్ 2025 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటతీరే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ లో అలౌకికంగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లను గాలిలో కలిపేస్తున్నారు. మొదటి 4 ఓవర్లలోనే మ్యాచ్ SRH గెలిచేసినట్లే అవుతోంది. హైదరాబాద్ ఇప్పటి వరకు చేసిన అత్యధిక స్కోర్లలో నాలుగు ఈ జట్టే నమోదు చేయడంతో వారి దూకుడు ఎలా ఉందో చెప్పే ఉదాహరణ. కానీ గత సీజన్లో SRH …
Read More »46 ఏళ్లు జైలులోనే.. చివరికి రూ.20 కోట్ల నష్టపరిహారం!
ఎవరూ ఊహించని విధంగా న్యాయవ్యవస్థలో తలెత్తే తప్పులు ఒక్కోసారి మనిషి జీవితాన్నే చీల్చివేస్తాయి. జపాన్‌లో ఓ నిర్దోషి ఖైదీకి జరిగింది ఇదే. 1966లో జరిగిన నాలుగు హత్యల కేసులో దోషిగా తేల్చబడిన ఇవావో హకమడ (ఇప్పుడు వయసు 89) నేరమే లేని విషయంలో ఏకంగా 46 ఏళ్లు జైల్లో గడిపారు. కానీ దశాబ్దాల పోరాటం తర్వాత అతను నిర్దోషిగా బయటికి రావడంతో కోర్టు ఆయనకు రూ.20 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలంటూ …
Read More »బ్రతికుండగానే ఏడడుగుల గోతిలో పాతిపెట్టాడు..
హర్యానాలోని రోహ్తక్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధంపై కలిగిన కోపంతో ఓ వ్యక్తి యోగా టీచర్‌ను ఏడడుగుల గోతిలో సజీవంగా పాతిపెట్టిన దారుణం చోటుచేసుకుంది. మూడు నెలలుగా అదృశ్యంగా ఉన్న జగదీప్ అనే యోగా టీచర్ మృతదేహాన్ని తాజాగా పోలీసులు వెలికితీశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం, జగదీప్ డిసెంబర్ 24న రోహ్తక్లోని తన ఇంటికి వెళ్లే సమయంలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates