ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రుతురాజ్ గైక్వాడ్‌కు గాయమవడంతో సీజన్ మొత్తానికి తప్పుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన షార్ట్ బాల్ గాయపరిచిందని, దాంతో ఎల్బోలో హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ వచ్చిందని చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో ఐదు ట్రోఫీలు అందించిన మహేంద్ర సింగ్ ధోనికి మళ్లీ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.
ధోని శుక్రవారం నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌తో మళ్లీ కెప్టెన్‌గా తలపడనున్నారు. ఇప్పటికే ఐపీఎల్ 2025లో చెన్నై ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లలో నాలుగు ఓటములు చవిచూసిన సీఎస్‌కే.. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. జట్టు పతనాన్ని తడిపేందుకు మళ్లీ ధోని నాయకత్వం కీలకం కానుంది.
ఇక పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని తన మార్క్ షాట్లతో అభిమానులను ఉర్రూతలూగించారు. కేవలం 12 బంతుల్లో 27 పరుగులు చేసిన మహీ.. చివరి ఓవర్లో అవుట్ కావడంతో మ్యాచ్ చేజారిపోయింది. కానీ ఆయన ఆటతీరు, బాడీ లాంగ్వేజ్ చూస్తే ఇంకా జోష్‌లో ఉన్నట్టు అర్థమవుతోంది. ధోనికి బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్స్ కూడా వ్యాఖ్యానించారు.
ధోని ఆఖర్లో వచ్చే బదులు 4 లేదా 5వ స్థానాల్లో వస్తే సీఎస్‌కే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే, మళ్లీ కెప్టెన్‌గా ధోని మైదానంలో అడుగుపెడుతున్న తరుణంలో, ఈ కంబాక్‌ను టీమ్ సానుకూలంగా మలచుకుంటే ప్లే ఆఫ్స్ రేసులో నిలవవచ్చు. ధోని ఆటతీరు కంటే ఇప్పట్లో అభిమానులకు ఎంతో ముఖ్యమైన విషయం.. అతను మళ్లీ కెప్టెన్‌గా మైదానంలో కనిపించడమే అసలైన కిక్కు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి మిస్టర్ కూల్ ఈ కఠిన సమయంలో ఎలాంటి విజయాలు అందిస్తాడో చూడాలి.