పర్యావరణే పరిరక్షణగా సాగిన పద్మశ్రీ వనజీవి రామయ్య గుండెపోటుతో మృత్యువాత పడ్డారు. నిత్యం పచ్చదనంతో సాగిన రామయ్యకు ఓ వ్యక్తిగానే కాకుండా సమాజాన్ని పర్యావరణం వైపు అడుగులు వేయించిన ఓ గొప్ప మనీషిగా గుర్తింపు ఉంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏకంగా కోటికి పైగా మొక్కకలు నాటి రామయ్య వనజీవిగా జనానికి చిరపరచితులు. పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనను 2017లోనే పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా రెడ్డిపల్లిలో జన్మించిన రామయ్య… తన పర్యావరణ హితాన్నే రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావత్తు భారతావనికి చాటి చెప్పారు.
శనివారం తెల్లవారుజామున తన స్వగ్రామంలోనే గుండెపోటుకు గురైన రామయ్య అక్కడికక్కడే తుది శ్వాస విడిచారు. వనాల్లో పెరుగుతూ… పచ్చదనమే ప్రాణంగా జీవన ప్రయాణం సాగించిన రామయ్య.. గుండెపోటుకు గురి కావడం గమనార్హం. 85 ఏళ్ల పాటు జీవన ప్రస్థానాన్ని సాగించిన రామయ్య పర్యావరణ పరిరక్షణలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని చెప్పక తప్పదు. తన జీవితాంతం మొక్కలను నాటుతూ వాటిని సంరక్షిస్తూ సాగిన రామయ్యకు వనజీవిగా పేరు పడిపోయింది. వయసు ఉడిగిన సమయంలోనూ ఏ ఒక్కరి తోడ్పాటు లేకుండానే రామయ్య తన జీవితాన్ని సాగించిన వైనం కూడా ఆసక్తిదాయకమేనని చెప్పాలి.
రామయ్య మృతి వార్త తెలిసినంతనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు షాక్ గురయ్యారు. రామయ్య మృతికి సంతాపం తెలుపుతూ ప్రకటనలు విడుదల చేశారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ రామయ్య మృతి తనను తీవ్ర విచారానికి గురి చేసిందని పేర్కొన్నారున. ఓ వ్యక్తిగా పర్యావరణ పరిరక్షణకు కోటి మొక్కలు నాటిక రామయ్య కృషి స్ఫూర్తిదాయకమని ఆయన కీర్తించారు. నేటి తరాకిని రామయ్య ఆదర్శప్రాయుడని, ఆయన మరణం పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి తీరని టెలు అని బాబు పేర్కొన్నారు. రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన చంద్రబాబు… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిలషించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates