అమెరికాలో భారత సంతతి సీఈఓ అరెస్ట్‌… వ్యభిచార కేసులో సంచలనం!

అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రముఖ సీఈఓ అనురాగ్ బాజ్‌పాయ్ అరెస్టయ్యారు. బోస్టన్‌ సమీపంలో ఉన్న వ్యభిచార గృహాల వ్యవహారంలో ఆయన పేరు ఉండటమే దీనికి కారణం. హైప్రొఫైల్ కస్టమర్ల జాబితాలో అనురాగ్ పేరు కూడా ఉండటాన్ని విచారణాధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని న్యూయార్క్ పోస్ట్ స్పష్టంగా వెల్లడించింది. గంటకు 600 డాలర్లు చెల్లించి ఈ గృహాల్లో సేవలు తీసుకున్న వారిలో ఆయన ఒకరుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఆయన పేరూ బయటపడింది.

అనురాగ్ బాజ్‌పాయ్ ప్రస్తుతం గ్రేడియంట్ అనే స్టార్టప్‌కు సీఈఓగా ఉన్నారు. ఈ సంస్థ మురుగు నీటిని శుద్ధి చేసి పరిశ్రమలకు ఉపయోగపడే నీటిగా మారుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో సేవలందిస్తున్న ఈ కంపెనీకి అనురాగ్ స్థాపకుడిగా ఉన్నారు. ఈ ఘటన వెలుగులోకి రాగానే గ్రేడియంట్ సంస్థలో తీవ్ర కలకలం ఏర్పడింది. కంపెనీ సిబ్బంది ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సంస్థ మాత్రం న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందంటూ బాజ్‌పాయ్‌కు మద్దతు ప్రకటించింది.

వైద్యులు, న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులు తదితరులపై ప్రత్యేక నిఘా పెట్టిన విచారణ సంస్థలు… మానవ అక్రమ రవాణా కోణంలోనూ విచారణను ప్రారంభించాయి. ఈ వ్యవహారంలో పలు ఆసియా దేశాలకు చెందిన మహిళలు బలవంతంగా పని చేయిస్తున్నారని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనురాగ్ పై కేసు నమోదు చేయడం, విచారణ కోసం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం బాజ్‌పాయ్ బెయిల్‌పై బయటకు వచ్చారని సమాచారం.

అనురాగ్ బాజ్‌పాయ్ ఉత్తరప్రదేశ్‌ లోని లఖ్‌నవూ ప్రాంతానికి చెందినవారు. మెకానికల్ ఇంజినీరింగ్‌ విద్యనంతరం MITలో పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. 2013లో గ్రేడియంట్ కంపెనీని ప్రారంభించిన ఆయన, దాదాపు బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ అరెస్ట్ తో ఆయన రేపుటేషన్ క్షణాల్లో నేలచూపులు చూస్తుండటం పరిశ్రమ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.