Trends

వీరు మామూలు త‌ల్లీకూతుళ్ళు కాదు

మ‌గువ‌లు.. తెగువ చూపిస్తే ఎలా ఉంటుందో.. ఆ త‌ల్లీకూతుళ్లు చేసి చూపించారు. క‌త్తులు, క‌ర్ర‌లు కాదు.. ఏకంగా తుపాకీతో ఇంట్లోకి చొర‌బ‌డిన దొంగ‌ల‌ను అడ్డుకుని చిత‌క్కొట్టేశారు. హైద‌రాబాద్ న‌డిబొడ్డు ప్రాంతం బేగంపేటలో తల్లీకూతుళ్లు చూపిన‌ ధైర్యం అంద‌రితోనూ ప్ర‌శంస‌లు అందుకునేలా చేస్తోంది. వారు దొంగలపై తిరగబడ్డారు. కత్తులకు బెదరలేదు… తుపాకీకి జడవలేదు. ఎదురుతిరిగారు… దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ తల్లీకూతుళ్ల సాహనం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్‌ …

Read More »

ధోని విషయంలో ఇక ఫిక్సయిపోవచ్చు

భారత లెజెండరీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని కెరీర్ ముగింపు దశకు చేరుకున్నట్లేనా? ఈ ఏడాది ఐపీఎల్‌తో అతను ఆటకు గుడ్‌బై చెప్పబోతున్నట్లేనా? ఔననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ధోని ఈసారి ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించట్లేదన్న వార్త బయటికి వచ్చినప్పటి నుంచి ఈ చర్చే జరుగుతోంది. చెన్నై యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అతను పగ్గాలు అప్పగించేశాడు. ధోని రెండేళ్ల ముందు కూడా ఇలాగే చేశాడు. రవీంద్ర జడేజాకు …

Read More »

సద్గురు కు ఏమైంది?

ఈశ‌ ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువు, సద్గురు జ‌గ్గీ వాసుదేవ్ ప‌రిచ‌యం లేని వారు లేరు. సింపుల్‌గా ఉంటూ.. హోమాలు, య‌జ్ఞాల‌కు దూరంగా ఉంటూ.. త‌న‌దైన శైలిలో ఆధ్యాత్మిక‌త‌ను సైన్స్‌కు జోడిస్తూ ఆయ‌న ప్ర‌చారం చేయ‌డం, శిబిరాలు నిర్వ‌హించ‌డం తెలిసిందే. ప్ర‌తి ఏటా మ‌హాశివ‌రాత్రి నాడు.. ఆయ‌న త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో ఉన్న త‌న ఆశ్ర‌మంలో పెద్ద పండుగే చేస్తారు. దీనికి కేంద్ర మంత్రుల నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కు, ప్ర‌పంచ …

Read More »

‘సంతోషం’లో మనమెక్కడ?

మరో ఆసక్తికర రిపోర్టు వచ్చింది. దాన్ని చదివినప్పుడు ఒకలాంటి నిరాశ కమ్మేస్తుంది. దీనికి కారణం భారతదేశం దూసుకెళుతుందన్న పాలకుల మాటకు భిన్నంగా ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశాల్లో మన ర్యాంక్ అత్యంత దారుణంగా ఉండటమే దీనికి కారణం. అంతర్జాతీయ ఆనంద దినోత్సవంగా మార్చి 20ను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో యూఎస్ కు చెందిన ఒక సంస్థ తాజాగా జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ …

Read More »

పిక్ టాక్: మిల్కీ.. బ్యూటీనే హాటీ కూడా

తెల్లటి పాలరాతి శిల్పంలా మెరిసిపోయే అందం తమన్నాది. అందుకే ఆమెకు మిల్కీ బ్యూటీ అనే పేరొచ్చింది. ఐతే ఆమె కేవలం బ్యూటీ మాత్రమే కాదు.. హాటీ కూడా. ఈ మధ్య ఆ యాంగిల్‌ను బాగా ఎక్స్‌ప్లోర్ చేయడానికే ప్రయత్నిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Read More »

‘అవును.. నా ఆరోగ్య ర‌హ‌స్యం.. డ్ర‌గ్సే!’

ఎవ‌రైనా డ్ర‌గ్స్ బారిన ప‌డితే .. ఆరోగ్యంగా ఉంటారా?  నాశ‌న‌మై పోతారా? అంటే.. దీనిలో త‌డుముకోవా ల్సిన ఏమీ లేదు. ఎంతటివారైనా నాశ‌నం అయిపోతారు. కానీ, స‌ర‌దాకు చెప్పారో.. నిజ్జంగా నిజ‌మేనో తెలియ‌దు కానీ… త‌న ఆరోగ్య ర‌హ‌స్యం డ్ర‌గ్సేనని టెస్లా అధినేత‌, ట్విట్ట‌ర్‌(ఎక్స్‌) య‌జ‌మాని ఎలాన్ మ‌స్క్ మాత్రం త‌న ఆరోగ్య ర‌హ‌స్యం డ్ర‌గ్సేన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  అంతేకాదు.. త‌ను వాడే డ్ర‌గ్స్ పేరును కూడా ఆయ‌న …

Read More »

మనమడికి ఇన్ఫో నారాయణమూర్తి ఖరీదైన గిఫ్టు

తండ్రి దగ్గర కొడుక్కి లేని చనువు మనమడికి ఉంటుందని చెబుతారు. దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి తాజాగా తన మనమడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి ఖరీదైన బహుమతి అందజేశారు. తన సంస్థలోని 15 లక్షల షేర్లను మనవడి పేరు మీద రిజిస్టర్ చేశారు. ఈ భారీ షేర్ల విలువ ఏకంగా రూ.240 కోట్లు ఉంటుందని అంచనా. కంపెనీలో తన వాటా షేర్లలో కొన్నింటిని …

Read More »

కుమారి ఆంటీ తర్వాత ఈ అమ్మాయి

హైదరాబాద్‌ హైటెక్ సిటీ ప్రాంతంలో రోడ్డు పక్కన నాన్ వెజ్ మీల్స్ అమ్మే సాయికుమారి అలియాస్ కుమారి ఆంటీ విషయంలో ఆ మధ్య ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. కుమారి ఆంటీకి కొంచెం పాపులారిటీ రాగానే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబ్ ఛానెళ్ల వాళ్లకు తోడు మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం అక్కడే తిష్ట వేసి.. ఆమెకు ఎక్కడ లేని కవరేజీ ఇచ్చారు. దీంతో జనాలు పోటెత్తి ఆ ప్రాంతంలో …

Read More »

మ‌రోసారి పుతిన్‌.. క‌నీ వినీ ఎరుగ‌ని ఓట్లు

ఉక్రెయిన్‌తో యుద్ధం.. ప్ర‌పంచం మాట విన‌ని తెంప‌రిత‌నం.. నా ఇష్టం నాదే అనే గ‌డుసు త‌నం.. వెర‌సి అప్ర‌క‌టిత నియంతృత్వానికి పోత‌పోసిన‌ట్టు ఉండే ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌కే అక్క‌డి ప్ర‌జ‌లు మ‌రోసారి ప‌ట్టం క‌ట్టారు. క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో ఆయ‌న‌కు ఓట్ల వ‌ర్షంకురిసింది. తాజాగా మూడు రోజుల పాటు సాగిన అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పుతిన్‌కు దాదాపు 88శాతం ఓట్లు లభించినట్లు రష్యా ఎన్నికల సంఘం తెలిపిం ది. మూడు రోజుల …

Read More »

ఒకే వేదిక‌ పై రేవంత్‌-ష‌ర్మిల‌.. ఆ ఉత్సాహ‌మే వేర‌ప్పా!

కాంగ్రెస్ పార్టీలో ఆ ఉత్సాహ‌మే వేర‌ప్పా! అనే టాక్ వినిపించింది. దీనికి కార‌ణం విశాఖ‌లో ఒకే వేదిక‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డి, ఏపీసీసీ చీఫ్ ష‌ర్మిల క‌నిపించ‌డ‌మే. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆనందాన్ని రెట్టింపు చేసింది. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ పేరుతో కాంగ్రెస్ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు ఏపీ నాయకులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి …

Read More »

పూజాకు మ‌ళ్లీ ఓ పెద్ద ఛాన్స్‌?

హీరోయిన్ల కెరీర్లు ఉన్న‌ట్లుండి ఊపందుకుంటాయి. అలాగే ఉన్న‌ట్లుండి డౌన్ అయిపోతాయి. ఒక‌సారి డౌన్ అయ్యాక మ‌ళ్లీ పుంజుకోవ‌డం అంత తేలిక కాదు. కొన్నేళ్ల పాటు వైభ‌వం చూసిన హీరోయిన్లు ఉన్న‌ట్లుండి క‌నుమ‌రుగైపోతుంటారు. ఒక ఐదారేళ్ల పాటు టాలీవుడ్ నంబ‌ర్ వ‌న్ హీరోయిన్ హోదాను అనుభ‌వించిన పూజా హెగ్డేకు ఉన్న‌ట్లుండి కాలం క‌లిసి రాలేదు. వ‌రుస‌గా ఫ్లాపులు ఎదుర‌య్యాయి. దీంతో చేతిలో ఉన్న మంచి అవ‌కాశాలు చేజారాయి. కొత్త అవకాశాలు ఆగిపోయాయి. …

Read More »

బెంగళూరులో నీటి కష్టాలు పీక్స్?

ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో గార్డెన్ సిటీ బెంగళూరు మహానగరం నీటి ఎద్దడితో విలవిలలాడుతోంది. 500 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మహానగరానికి ఇప్పుడు ఎదురైన నీటి సమస్య ఎంత ఎక్కువగా ఉందంటే.. మహానగరంలోని టెకీలంతా ఇంటి బాట పట్టేసి.. వర్కు ఫ్రం హోం మొదలు పెట్టేశారు. అపార్టుమెంట్లు ఇప్పుడు ఖాళీ అయిన పరిస్థితి. జనాబా రీత్యా దేశంలో మూడో అతి పెద్ద నగరంగా పేరున్నప్పటికీ.. అందుకు తగ్గట్లుగా …

Read More »