2000-2010 మధ్య తెలుగులో చెప్పుకోదగ్గ స్థాయిలోనే సినిమాలు చేశాడు రాజా. ముఖ్యంగా ఆనంద్, వెన్నెల, ఒక ఊరిలో లాంటి చిత్రాలు అతడికి మంచి పేరే తెచ్చిపెట్టాయి. హీరోగా అవకాశాలు తగ్గాక క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్న సమయంలో ఉన్నట్లుండి అతడి దారి మారిపోయింది. ముందుగా రాజకీయాల్లో అడుగు పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. తర్వాతేమో ఆ ఫీల్డ్ నుంచి పక్కకు వెళ్లిపోయి క్రిస్టియానిటీని స్వీకరించాడు. పాస్టర్ అయ్యాడు. ఇప్పుడు పూర్తిగా …
Read More »దేశంలో పెరిగిపోతున్న ఫోర్త్ వేవ్ ఆందోళన
దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని క్షేత్ర స్ధాయిలోని పరిణామాలు చూస్తుంటే కరోనా వైరస్ ఫోర్త్ వేవ్ ఆందోళన పెరిగిపోతోంది. దేశం మొత్తం మీద శనివారం 3962 కేసులు నమోదైతే, ఆదివారం నాడు 4270 కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదవ్వటమే కాకుండా 15 మంది చనిపోయారు. మార్చి 11వ తేదీ తర్వాత ఇన్ని వేల కేసులు నమోదవ్వటం మళ్ళీ ఇదే మొదటిసారి. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై, దేశ రాజధాని అయిన …
Read More »ఆర్యసమాజ్ పెళ్ళిళ్ళు చట్టబద్ధం కాదా
ఒకే ఒక్క తీర్పుతో సుప్రీంకోర్టు లక్షలాదిమంది దంపతులను అయోమయంలో పడేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఆర్యసమాజ్ లో జరిగే పెళ్ళిలు చట్టబద్దం కావని తీర్పు చెప్పింది. హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి ఆర్యసమాజ్ లో జరుగుతున్న వివాహాలపై కోర్టులో కేసు వేశారు. ఆ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై విధంగా తీర్పిచ్చింది. తాజా తీర్పుతో లక్షలాదిమంది దంపతుల బంధం అయోమయంలో పడిపోయింది. ప్రేమ వివాహాలకు, కులాంతర, మతాంతర …
Read More »అవును.. ఆ ఇద్దరు మహిళా క్రికెటర్లు పెళ్లి చేసుకున్నారు
ఈ ఫోటోకు ఒక ప్రత్యేకత ఉంది. ఇందులోని మహిళల్ని చూసినంతనే క్రికెట్ ప్రేమికులు ఎక్కడో చూసినట్లుందే అనుకోవటం ఖాయం. అవును.. ఈ ఇద్దరు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సభ్యులు. స్టార్ మహిళా క్రికెటర్లుగా పేరున్న కేథరీన్ బ్రట్.. నటాలీ స్కివర్ లు తమ రోటీన్ డ్రెస్ కు భిన్నంగా.. ఇంత అందంగా ముస్తాబు కావడానికి ప్రత్యేకమైన కారణమే ఉంది. గతంలో ప్రేమన్నా.. పెళ్లి అన్నా అమ్మాయి.. అబ్బాయి మధ్యన సాగేది. …
Read More »ఫిక్సయిపోయారు.. ఐపీఎల్ ఫైనల్ ఫిక్సింగ్ అని
ఐపీఎల్ అంటేనే ఫిక్సింగ్‌కు కేరాఫ్ అడ్రస్ అని ఓ వర్గం క్రికెట్ అభిమానులు బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ప్రతి మ్యాచ్‌లోనూ ఏదో ఒక పాయింట్ పట్టుకుని మ్యాచ్ ఫిక్సయిందని ఆరోపణలు చేస్తుంటారు. ఐతే ఈ ఆరోపణలు, విమర్శలు, వ్యాఖ్యానాలు ఎప్పుడూ ఉండేవే కావట్టి అందరూ లైట్ తీసుకుంటూ ఉంటారు. ఈ ఐపీఎల్లో చివరి ప్లేఆఫ్ బెర్తును ఖరారు చేసే మ్యాచ్‌లో ముంబయి చేతిలో ఢిల్లీ ఓడిపోవడాన్ని చాలామంది అనుమానంగా చూశారు. …
Read More »పాక్ కొత్త తరహా బాంబులను ప్రయోగించిందా?
మనదేశంలోని జనాలను చంపేందుకు పాకిస్తాన్ కొత్త తరహా బాంబులను ప్రయోగించిందా ? భద్రతా దళాలు చెప్పిన ప్రకారం అవుననే అనుకోవాలి. ఇంతకీ విషయం ఏమిటంటే పాకిస్ధాన్ భూభాగం నుండి వచ్చిన ఒక క్వాడ్ కాపర్ (డ్రోన్ లాంటిదే)ను భద్రతా దళాలు గుర్తించాయి. వెంటనే అప్రమత్తమైన సైన్యం ఉన్నతాధికారులకు తెలియజేయటం, వారి ఆదేశాలతో వెంటనే క్వాడ్ కాపర్ ను కాల్చేశారు. కథువా జిల్లాలోని తాల్లీ హరియా చాక్ గ్రామంలో భద్రతా దళం క్వాడ్ …
Read More »RBI దగ్గర ఎంత బంగారం ఉందో తెలుసా?
ఒక దేశపు ఆర్థిక స్తోమతను రెండు రకాలుగా కొలుస్తారు. మొదటిదేమో ఆ దేశం దగ్గరున్న విదేశీ మారకపు నిల్వలు. ఇక రెండోదేమో ఆ దేశం దగ్గరున్న బంగారం నిల్వలు. విదేశీ మారకద్రవ్య నిల్వలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. అలాగే బంగారం నిల్వలు కూడా అటు ఇటు అవుతుంటాయి. కానీ ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశపు ఆర్థిక స్తోమత అంతగా ఉన్నట్లు ఆర్ధిక నిపుణులు చెబుతుంటారు. ఇపుడిదంతా ఎందుకంటే మనదేశంలోని బంగారం …
Read More »స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు: సుప్రీం కోర్టు
సెక్స్ వర్కర్లను వేధించకూడదని పోలీసులకు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రైడ్ లలో పట్టుబడ్డ సెక్స్ వర్కర్ల ఫొటోలను ప్రచురించకూడదని మీడియాకు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కోర్టు నియమించిన కమిటీ కీలక సిఫార్సులను ఆమోదించింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. సెక్స్ వర్కర్లను ఏవిధంగానూ వేధించరాదని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎక్కడైనా దాడులు నిర్వహించినప్పుడు పట్టుబడిన సెక్స్ …
Read More »మాజీ క్రికెటర్ సిద్ధూకు జైల్లో క్లర్క్ పని
మూడు దశాబ్దాల క్రితం ఓ వృద్ధుడిపై దాడి చేసి అతడి మరణానికి కారణమైన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సిద్ధూ.. అక్కడ క్లెర్క్ ఉద్యోగం చేయనున్నారు. మూడు నెలల పాటు ట్రైనీగా పరిగణిస్తామని ఆ తర్వాత రోజుకు రూ.40 నుంచి రూ.90 మధ్య జీతం అందిస్తామని అధికారులు వెల్లడించారు. మూడు దశాబ్దాల నాటి కేసులో ఏడాది శిక్ష పడటంతో కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ ప్రస్తుతం పటియాలా సెంట్రల్ …
Read More »స్టార్ మా లో “సూపర్ సింగర్ జూనియర్
ఎక్కడెక్కడో వున్న కొత్త కొత్త ప్రతిభావంతులైన గాయనీ గాయకులను పరిచయం చేయడంలో ముందుంటుంది “స్టార్ మా”. ఎన్నో అద్భుతమైన స్వరాలను సినిమా రంగానికి పరిచయం చేసింది స్టార్ మా. స్టార్ మా స్టార్ సింగర్ వేదిక పైన పాడిన ఎందరో ఇప్పుడు మంచి సింగర్స్ గా తమ స్వరాలను వినిపిస్తున్నారు. ఈ పరంపరలో స్టార్ మా ఇప్పుడు కేవలం పిల్లల కోసం “సూపర్ సింగర్ జూనియర్” పేరుతో ఓ కొత్త …
Read More »ధోనీ ఫ్యాన్స్.. టెన్షన్ తీరిపోయింది
ఇండియన్ క్రికెట్ ఆల్ టైం గ్రేట్స్‌లో ఒకడైన మహేంద్రసింగ్ ధోని.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసి రెండేళ్లు కావస్తోంది. ఐపీఎల్లో కూడా అతను ఒకట్రెండేళ్లకు మించి కొనసాగకపోవచ్చని అప్పుడే అనుకున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు టాటా చెప్పాక ధోని రెండు ఐపీఎల్ సీజన్లలో ఆడాడు. 2020లో ఐపీఎల్ ఆలస్యంగా, యూఏఈలో జరగగా.. గత ఏడాది సగం సీజన్ ఇక్కడ, సగం యూఏఈలో నిర్వహించారు. మళ్లీ ఏ ఏడాది ఐపీఎల్ స్వదేశానికి తిరిగొచ్చింది. …
Read More »‘దిశ ఎన్కౌంటర్’ కేసులో దోషి ఎవరో తేలిపోయింది: సుప్రీం కోర్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ కేసుపై సుప్రీం కోర్టు సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు, కింది స్థాయి కోర్టులో ఏం జరుగుతుందో తెలియదన్న సుప్రీం.. సిర్పూర్కర్ కమిషన్ నివేదిక హైకోర్టుకు పంపుతామని పేర్కొంది. ఈ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో…హైకోర్టు నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. అయితే.. ఈ ఎన్కౌంటర్ కు సంబంధించి దోషి ఎవరో తేలిపోయిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దిశ హత్యాచార …
Read More »