Trends

న‌లుగురు పిల్ల‌లు.. భ‌ర్త‌ను చంపేసి ప్రియుడితో జంప్‌

కేవ‌లం శృంగారం కోసం.. ఓ మ‌హిళ తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భ‌ర్త‌ను చంపేసి.. తాజాగా ప‌రిచ‌య‌మైన ప్రియుడితో జంపైపోయింది. ఆమెకు న‌లుగురు పిల్ల‌లు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ ఘ‌ట‌న ఎక్క‌డో కాదు.. ఏపీలోని నెల్లూరులోనే జ‌రిగింది. స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఘ‌ట‌న‌.. నివ్వెర‌పోయేలా చేసింది. ఆమెకు పెళ్లైంది.. నలుగురు పిల్లలు ఉన్నారు.. అయినా సరే మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇంకేముంది ప్రేమించి పెళ్లి చేసుకున్నామన్న …

Read More »

బైడెన్‌ మ‌న‌వ‌రాలి పెళ్లి.. ఎంత సింపుల్‌గా చేశారంటే!

అమెరికా అన‌గానే ఆడంబ‌రం, దానికి కొంత డాంబికం క‌లిసి క‌నిపిస్తాయి. ఏం జ‌రిగినా అట్ట‌హాసంగా ఉంటుంది ఇక్క‌డ య‌వ్వారం. ఇక‌, అధికారంలో ఉంటే అందునా, అధ్య‌క్ష స్థానంలో ఉంటే ఇక చెప్పేది ఏముంటుంది. ఆ హ‌డావుడికి, జోరుకు అంతా ఇంతా సంద‌డి కాదు. అయితే, వీట‌న్నింటికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు ప్ర‌స్తుత అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌. అంతా సింప్లిసిటీ! ఆయ‌న ఏం చేసినా పెద్ద అట్ట‌హాసం ఉండ‌దు. ఆ సొమ్మును …

Read More »

భారత క్రికెట్లో పెను మార్పులు?

గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడడమే కాక.. కనీసం సెమీస్ కూడా చేరకుండానే ఇంటిముఖం పట్టింది భారత జట్టు. ఈ ఏడాది పాకిస్థాన్ మీద అతి కష్టం మీద నెగ్గారు. సూపర్-12 కూడా దాటారు. కానీ సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి నిష్క్రమించారు. పేరుకు ప్రపంచ అత్యుత్తమ జట్లలో ఒకటి. కానీ పెద్ద టోర్నీలు ఏవి వచ్చినా ప్రదర్శన …

Read More »

ట్విట్టర్లో #Riptwitter ట్రెండింగ్

ట్విట్టర్లో ఏవేవో నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండవుతూ ఉంటాయి. వాటి మీద వేలు, లక్షల్లో ట్వీట్లు పడుతుంటాయి. ఆ హ్యాష్ ట్యాగ్స్‌ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టాప్‌లో ట్రెండ్ అవుతుంటాయి. కానీ ఇప్పుడు చిత్రంగా ట్విట్టర్ మీద నెగెటివ్ హ్యాగ్‌లు అదే ట్విట్టర్లో ట్రెండ్ అవుతుండడం విశేషం. #RipTwitter #$Goodbytwitter #Twitterdown… ఇవీ నిన్నట్నుంచి ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్‌లు. వరల్డ్ వైడ్ ఈ హ్యాష్ ట్యాగ్ వీర …

Read More »

ఇవేం వెడ్డింగ్ ఫొటో షూట్లు బాబోయ్

ఒకప్పుడు పెళ్లి తంతు జరుగుతుండగా మాత్రమే పొటోలు తీసేవారు. ఆ తర్వాత పెళ్లి జరగడానికి ముందు వధూవరులతో కళ్యాణ మండపంలోనే రకరకాల పోజులు ఇప్పించి ఫొటోలు తీయడం చూశాం. గత కొన్నేళ్ల నుంచి పెళ్లికి ముందు రకరకాల ప్రదేశాల్లో.. అనేక థీమ్స్‌తో ఫొటోలు తీయడం చూస్తున్నాం. ప్రి వెడ్డింగ్ ఫొటోగ్రఫీ అనేది ఇప్పుడు పెద్ద బిజినెస్ అయిపోయింది. లక్షలు పోసి ఈ ఫొటో షూట్లు చేయించుకుంటున్నాయి కొత్త జంటలు. ఒక …

Read More »

యాపిల్ చెప్పులు కోటి 75 లక్షల రూపాయలు

Steve Jobs Chappals

ప్రపంచవ్యాప్తంగా కొంతమందికి పురాతన వస్తువులు, యాంటిక్ పీసులు సేకరించడం అలవాటు. చారిత్రాత్మక వస్తువులను కొనేందుకు కొంతమంది వ్యక్తులు కోట్లు కుమ్మరించడానికి సైతం వెనుకాడరు. ఇక, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొందరు వ్యక్తులు వాడిన వస్తువులకైతే గిరాకీ చాలా ఎక్కువ. అటువంటి వస్తువులు మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇటువంటి వారి ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకే కొన్ని ఈ ఆక్షన్ కంపెనీలు కూడా వెలిశాయి. ఇటువంటి వస్తువులను కలెక్ట్ చేసి …

Read More »

23 ఐపీఎల్.. ఇదే పెద్ద ట్విస్ట్

ప్రపంచకప్‌లో టీమ్ఇండియా సెమీఫైనల్లో నిష్క్రమించగానే.. జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీల్లో భారత జట్టు వైఫల్యానికి ఐపీఎలే కారణమంటూ ఆ లీగ్‌ను నిందించడం మొదలుపెట్టారు. కానీ ఇలా ఐపీఎల్‌ను తిట్టేవాళ్లంతా కూడా ఆ టోర్నీ వస్తే దానికి అతుక్కుపోవాల్సిందే. దానికి ఉన్న ఆకర్షణ అలాంటిది. ఈ విమర్శలను బీసీసీఐ కానీ, ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కానీ, ఆటగాళ్లు కానీ పట్టించుకోవడం జరగదు. ఇంకా కొత్త సీజన్‌కు ఐదు …

Read More »

ధోని చేతికి టీమ్ ఇండియా?

ఇండియన్ క్రికెట్ టీంకు సంబంధించి పెను మార్పులు అవసరం అన్న చర్చ గత కొన్ని రోజులుగా జోరుగా నడుస్తోంది. ప్రపంచకప్ మీద బోలెడు ఆశలతో భారత జట్టు టోర్నీకి వెళ్లడం.. చివరికి ఏదో ఒక దశలో విఫలమై నిష్క్రమించడం మనకు అలవాటే. దశాబ్ద కాలంగా ఇదే జరుగుతోంది. కానీ ఈసారి ప్రపంచకప్‌లో ఎదురైన పరాభవం మాత్రం చాలా పెద్దది. భారత జట్టు అతి కష్టం మీద దాదాపు 170 పరుగుల …

Read More »

హైదరాబాద్ లో ఎయిరోప్లేన్ రెస్టారెంట్..

పుర్రెకో బుద్ధి…జిహ్వకో రుచి అన్నారు పెద్దలు…ఈ సోషల్ మీడియా జమానాలో వినూత్నమైన ఆలోచనలను జనం విపరీతంగా ఆదరిస్తున్నారు. అందుకే, చాలామంది తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు సరికొత్త కాన్సెప్ట్ లతో కస్టమర్ల ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా రెస్టారెంట్, హోటల్స్ వంటి బిజినెస్ లలో వెరైటీ కాన్సెప్ట్ లు పిల్లలు, పెద్దలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రుచికరమైన ఐటమ్స్, పరిశుభ్రమైన వాతావరణం ఉంటే చాలు అన్నది గతంలో మాట. మారుతున్న ట్రెండ్ ప్రకారం …

Read More »

కొంప‌ముంచిన ట్విట్ట‌ర్ బ్లూ టిక్‌

ట్విటర్‌లో 8 డాల‌ర్లు చెల్లించి ఎవ‌రైనా ఇక‌పై వెరిఫైడ్ అకౌంట్ల‌కు ఇచ్చే బ్లూ టిక్‌ను సొంతం చేసుకునేలా ఇటీవ‌లే సంస్థ అధినేత అయిన ఎలాన్ మ‌స్క్ కొత్త స‌దుపాయాన్ని ప్ర‌వేశ పెట్టిన సంగ‌తి తెలిసిందే. దీని ప‌ట్ల ట్విట్ట‌ర్ యూజ‌ర్లు చాలామంది హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. కొంద‌రు దీని ప‌ట్ల వ్య‌తిరేక‌త ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఐతే మున్ముందు స్పంద‌న ఎలా ఉంటుందో కానీ.. ఈ కొత్త స‌దుపాయం వ‌ల్ల ఒక ఫార్మా …

Read More »

వన్ బ్యూటీ.. వోగ్ హొయలు

మహేష్ 1 నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నార్త్ బ్యూటీ కృతి సనోన్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ అందుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఇక ఈ బ్యూటీ బ్యాడ్ లక్ ఏమిటో గాని ఒక సినిమా సక్సెస్ అయితే వెంటనే మరో సినిమా నిరాశపరుస్తోంది. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా గ్లామర్ తో ఎప్పటికప్పుడు తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక …

Read More »

రూ.2వేల నోటుపై ఆర్బీఐ చెప్పిన నిజం!

సరిగ్గా ఆరేళ్ల క్రితం.. రాత్రి వేళలో టీవీ స్క్రీన్ల మీద లైవ్ లో ప్రత్యక్షమైన ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన వైనాన్ని ప్రకటించి దేశ ప్రజలతో పాటు.. పలు దేశాలను సైతం ఆశ్చర్యానికి గురి చేశారు. పెద్ద నోట్ల రద్దు అంటూ అప్పట్లో చెలామణీలో ఉన్న వెయ్యి రూపాయిలు.. రూ.500 నోట్లు రాత్రికి రాత్రి రద్దు అయినట్లుగా చెప్పటంలో ఒక్కసారి అవాక్కు అయిన పరిస్థితి. అనంతరం …

Read More »