Trends

ఇంజెక్షన్‌ల భయానికి చెక్ పెట్టిన కొత్త టెక్నాలజీ

ఇంజెక్షన్ అని వినగానే చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్లలో కూడా భయం కనిపిస్తుంది. దీనికి వైద్య పరంగా ట్రిపనోఫోబియా అని పేరు ఉంది. ప్రపంచవ్యాప్తంగా 50 శాతం మంది పిల్లలు, 30 శాతం మంది పెద్దలు ఈ ఇంజెక్షన్ భయాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఒక వినూత్న పరిష్కారం వచ్చేసింది.. అదే సూది లేని ఇంజెక్షన్. బెంగళూరులో తాజాగా నిర్వహించిన ఓ సమావేశంలో ‘ఇంటెగ్రి మెడికల్’ సంస్థ …

Read More »

వరుసగా ఏఐ మేధావుల మరణాలు.. ఏం జరుగుతోంది?

చాట్ GPT – డీప్ సీక్ – మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి అలవాటు పడుతోంది. ముఖ్యంగా చైనా ఏఐ పరిశోధకులు ప్రపంచానికి సాంకేతిక విజ్ఞానంలో ఒక సరికొత్త ట్రెండ్ తీసుకొచ్చే మార్గం వేస్తున్నప్పటికీ, వారి వ్యక్తిగత జీవితం మాత్రం తీవ్ర ఒత్తిడిలో కొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. గత మూడు సంవత్సరాల్లో చైనాకు చెందిన పలువురు ప్రముఖ ఏఐ శాస్త్రవేత్తలు చిన్న వయసులోనే …

Read More »

అతి చెత్త స్కోరుతో గెలిచి చూపించిన పంజాబ్

ఐపీఎల్‌లో సాధారణంగా ఎక్కువ స్కోర్లు మాత్రమే విజయం అందిస్తాయని అనుకునే వారికి, పంజాబ్ కింగ్స్ తన తాజా విజయంతో ఊహించని షాక్ ఇచ్చింది. ముల్లాన్‌పూర్ వేదికగా KKR తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడింది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు అత్యల్ప స్కోరుగా నిలిచింది. ఈ విజయం ఒక్క మ్యాచ్ కాదు, ఒక రీబౌండ్, గత మ్యాచులో 245 పరుగుల …

Read More »

ఎన్టీఆర్ జిల్లాలో స్పోర్ట్స్ సిటీ.. నది తీరాన అత్యంత భారీగా..

ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంగా భారీ క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కృష్ణా నది తీరంలో 1,600 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్పోర్ట్స్ సిటీని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పెదలంక, చిన్నలంక గ్రామాల పరిధిలో ఈ భూమిని గుర్తించగా, అమరావతికి సమీపంగా ఉండటం ఇది ప్రధాన ఆకర్షణగా మారింది. రాజధాని ప్రణాళికల్లోనే మొదట స్పోర్ట్స్ సిటీని నిర్మించాలనుకున్నా, అవసరమైన స్థలాభావం వల్ల ప్రత్యామ్నాయంగా మూలపాడు …

Read More »

ట్రంప్ టారిఫ్ లను తట్టుకున్న ఏకైక మార్కెట్ మనదే..

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి భారత స్టాక్ మార్కెట్ బయటపడిన మొదటి మార్కెట్‌గా నిలిచింది. ఇటీవల అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు అనంతరం మంగళవారం ట్రేడింగ్ ప్రారంభమైన నేపథ్యంలో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (నిఫ్టీ 50) 2.4 శాతం లాభంతో ట్రేడయ్యింది. ఇది ఏప్రిల్ 2న ట్రంప్ ఆదేశాల తర్వాత పడిపోయిన స్థాయిని మళ్లీ చేరుకోవడం విశేషం. ట్రంప్ చర్యల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా …

Read More »

అంతరిక్షంలో ప్రయాణం.. టికెట్ ధర ఎంతంటే?

ప్రముఖ అమెరికన్ గాయని కేటీ పెర్రీ ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆమె మరో ఐదుగురు మహిళలతో కలిసి స్పేస్ టూర్‌లో పాల్గొన్నారు. అమెరికన్ అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ నిర్వహించిన ఈ ప్రయాణం కేవలం 11 నిమిషాల వ్యవధిలో పూర్తయింది. అయితే ఈ షార్ట్ స్పేస్ రైడ్ అనుభవించాలంటే ఎంత ఖర్చవుతుందో తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కేటీ పెర్రీతో పాటు ఈ అంతరిక్ష ప్రయాణంలో జెఫ్ బెజోస్ …

Read More »

దేశంలో తొలిసారిగా మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేయనున్న రోబో

మ్యాన్‌హోల్‌లోకి దిగుతూ ప్రాణాలు కోల్పోయే పారిశుద్ధ్య కార్మికుల ఘటనలు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ పనిని చేయడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు, విషవాయువుల బారిన పడే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా మ్యాన్‌హోల్‌లో  ప్రమాదాలు కూడా ఎక్కువే. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది.  రాబోయే రోజుల్లో మ్యాన్‌హోల్ శుభ్రపరిచే పని …

Read More »

అనకాపల్లి : బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం బాణసంచా తయారీ కేంద్రాల్లో పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అయినా కూడా అధికార యంత్రాగం మొద్దు నిద్ర వీడటం లేదు. జనం ప్రాణాలు హరిస్తున్న ఈ భాణ సంచా తయారీపై ఓ సురక్షితమైన పాలసీ రూపొందిద్దామన్న కనీస యావ ప్రభుత్వాలకూ రావడం లేదు. వెరసి నిత్య ఈ …

Read More »

ఎండలు…క్రికెట్ మ్యాచులు…థియేటర్లలో ఖాళీ కుర్చీలు

బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ లాంటి హిట్లు పడ్డప్పటికీ వందల కోట్ల బిజినెస్ చేసే స్టార్ హీరోల సినిమాలు రాకపోవడం థియేటర్ల ఆక్యుపెన్సీ మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఏప్రిల్ లో బోణీ సరిగా జరగలేదు. జాక్, గుడ్ బ్యాడ్ అగ్లీ రెండూ అంతంత మాత్రంగానే నెట్టుకొస్తున్నాయి. అజిత్ వల్ల రెండోది కొంచెం …

Read More »

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్.. చైనా అద్భుత సృష్టి!

ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఇంజినీరింగ్ లో అద్భుతాలు చేయడంలో చైనా మరోసారి తన ప్రతిభను చూపించింది. గుయ్‌ఝౌ ప్రాంతంలోని బీపన్ నదిపై చైనా నిర్మించిన “హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జ్” ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.  ఈ వంతెన సముద్ర మట్టానికి 2050 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ఈఫిల్ …

Read More »

వీడియో : కొడుకుని తీసుకొని ఇంటికి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి తిరిగి వచ్చారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన తన సతీమణి అన్నా లెజినోవా, కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో గాయపడ్డ మార్క్ శంకర్ ను పవన్ తన భుజాన ఎత్తుకుని మరీ ఎస్కలేటర్ నుంచి దిగుతూ …

Read More »

ఇంగ్లిష్ రాదని ట్రోలింగ్.. క్రికెటర్ కౌంటర్

పాకిస్థాన్ క్రికెటర్ల మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆటతోనే కాక మాటతీరుతోనూ వాళ్లు సోషల్ మీడియాకు టార్గెట్ అవుతుంటారు. అలా ఎక్కువగా సోషల్ మీడియాలో నానే పేరు అంటే.. మహ్మద్ రిజ్వాన్‌దే. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టుకు వన్డే, టీ20 ఫార్మాట్లలో కెప్టెన్ అయిన రిజ్వాన్‌కు ఇంగ్లిష్ రాదు. చాలామంది పాక్ క్రికెటర్లకు ఇంగ్లిష్‌తో ఇబ్బందే కానీ.. రిజ్వాన్ పరిస్థితి మరీ ఘోరం. ఐతే ఇంగ్లిష్ రాదని అతను ఊరుకోడు.. తనకు …

Read More »