ఆరేళ్ల కిందట తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో రజతం గెలవడంతో దేశవ్యాప్తంగా ఆమె పేరు మార్మోగిపోయింది. అప్పటిదాకా ఆమె గురించి పెద్దగా తెలియని వాళ్లందరూ ఇంటర్నెట్ మీద పడిపోయారు. తన గురించి గూగుల్లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఐతే ఆ టైంలో ఎక్కువగా ఆమె గురించి శోధించిన ప్రశ్న ఏంటో తెలుసా? తన కులం ఏంటి అని. భారతీయ కీర్తి పతాకను ప్రపంచస్థాయిలో …
Read More »కంపెనీ బాత్‌రూంలో శిశువును ప్రసవించి… పరార్
వివాహం ముందు, తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకునే విధానం ఈ మధ్య పెరుగుతోంది. తాజాగా ఏపీలోని అచ్యుతాపురం సెజ్ లోని క్వాంటమ్ కంపెనీలోని బాత్ రూంలో శిశువు కనిపించడం.. కలకలం సృష్టించింది. క్వాంటమ్ కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతికి ప్రసవం జరిగింది. పెళ్లి కాకుండా ప్రసవించడంతో ఆ యువతి.. శిశువును అక్కడే వదిలి వెళ్లిపోయింది. ఈ ఘటన మీద సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే.. రంగంలోకి దిగిన పోలీసులు.. …
Read More »భర్తతో కలిసి సినిమాకు వెళ్లిన భార్య మిస్సింగ్?
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో వివాహిత అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. భర్తతో కలిసి సినిమాకు వెళ్లిన భార్య మిస్సయిన వ్యవహారం ఇపుడు జంటనగరాల్లో హాట్ టాపిక్ గా మారింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. ఆ వివాహిత కావాలనే భర్తను వదిలి వెళ్లిపోయిందా లేదంటే కిడ్నాప్ నకు గురైందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన భాస్కర్ రెడ్డి …
Read More »టీ20: పాక్ పై కసి తీర్చుకున్న భారత్..
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై టీం ఇండియా చిరస్మరణీయం విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా మెల్బోర్న్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో అద్భుత విక్టరీ నమోదు చేసింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియాదే పైచేయిగా నిలిచింది. ఈ విజయంతో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో జరిగిన టీ20లో భారత్‌పై పాక్‌పై కసితీర్చుకున్నట్టయింది. టీమిండియా …
Read More »పెళ్లైన 5 నెలలకే విశాఖ పోలీస్ స్టేషన్ ఎదుట సూసైడ్!
లైఫ్ ను ప్రభావితం నిర్ణయాలు తీసుకునే వేళలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అందులో ఏ మాత్రం ఏమరుపాటుతో వ్యవహరించినా విషాదమే. అలాంటి ఉదంతమే ఒకటి విశాఖలో చోటు చేసుకుంది. విశాఖపట్నంలో లా కాలేజీలో చదువుతున్న లా స్టూడెంట్ ఒకరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకున్న శ్రావణి వైనం సంచలనంగా మారింది. ఆమె విషాద ఉదంతం గురించి తెలిసిన వారంతా అయ్యో పాపం అనేసే పరిస్థితి. గుంటూరుకు చెందిన 22 …
Read More »ఇష్టా – “గోదావరి” నుండి ప్యూర్ వెజ్ కాన్సెప్ట్
ప్రపంచంలో అమెరికాతోపాటు పలుదేశాలలో దక్షిణాది వంటకాలను వండి వార్చే ప్రముఖ రెస్టారెంట్ లలో ఒకటిగా ‘గోదావరి’ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. వినూత్న ఆలోచనలతో, విభిన్నమైన కాన్సెప్ట్‌లకు కేరాఫ్ అడ్రస్ గా మారి భోజనప్రియులను ఎన్నోఏళ్లుగా ఆకట్టుంటోన్న “గోదావరి” ఇప్పుడు హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో “ప్యూర్ వెజ్” రెస్టారెంట్ ను ప్రారంభించింది (Ishtaa Pure Veg Restaurant). Ikea కు అతి సమీపంలో, హైటెక్ సిటీలోని పలు దిగ్గజ ఐటీ కంపెనీల …
Read More »తైవాన్ పై దాడిచేస్తే ప్రపంచానికే చిప్పు దొబ్బుతుందా ?
ఈమధ్య వచ్చే సినిమాల్లో తరచూ వాడికి చిప్పు దొబ్బిందని, వీడికి చిప్పు దొబ్బిందనే డైలాగులు వింటునే ఉంటాము. ఇపుడు వాడికీ వీడికి కాదు మొత్తం ప్రపంచానికే చిప్పు దొబ్బే రోజులు దగ్గరలోనే ఉన్నాయట. ప్రపంచానికి చిప్పు దొబ్బటం ఏమిటా ? అని అనుకుంటున్నారు. పొరుగునే ఉన్న తైవాన్ పైన డ్రాగన్ కన్నేసిన విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడు తైవాన్ దేశాన్ని కబళించేద్దామా ? అని చైనా చాలా ఆతృతగా ఉంది. ఇదే …
Read More »చిరంజీవి గారు…ఫోటో సెషన్ ఆపక పోతే నేను వెళ్లిపోతా…
హైదరాబాద్ లో నేడు జరిగిన అలయ్ బలయ్ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని ప్రత్యేకార్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రసంగించిన చిరు…అక్కడికి వచ్చిన పలువురు ప్రముఖులను పేరుపేరునా ప్రశంసించారు. ఈ క్రమంలోనే గుర్తు పెట్టుకొని మరీ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారి గురించి ప్రస్తావించారు. ఆయనపై చిరు ప్రశంసలు కురిపించారు. అయితే, కాసేపటి తర్వాత అనూహ్యంగా చిరంజీవిపై గరికపాటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనం …
Read More »షాకిస్తున్న ఐటీ కంపెనీలు
నిరుద్యోగులకు, ఉద్యోగాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్న ఫ్రెషర్లకు ఐటీ కంపెనీలు భారీ షాకిస్తున్నాయి. చేసుకున్న రిక్రూట్మెంట్లను వాపసు తీసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతుందని అనుకుంటున్న ఆర్థిక మాంద్యం భయమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్, క్యాంపస్ సెలక్షన్ అన్నింటినీ కంపెనీలు రద్దు చేసుకుంటున్నాయి. దాంతో ఉద్యోగాలకు ఎంపికయ్యామని సంతోషంగా ఉన్న వాళ్ళందరికీ తీవ్ర నిరాశ తప్పటం లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ నేపథ్యంలో దాదాపు రెండేళ్లు …
Read More »దృశ్యం సినిమా క్రైమ్ నిజం చేశారుగా !
‘దృశ్యం’ సినిమా చూసే వుంటారు కదా! ఈ సినిమాలో హీరో.. తన కుమార్తె స్నానం చేస్తుండగా.. ఓ యువ కుడు మొబైల్‌లో చిత్రీకరించాడని తెలిసి.. ఆ యువకుడిని యువతి, తల్లి కలిసి చంపేయడం.. తర్వాత..దాన్ని.. కప్పిపుచ్చు కునేందుకు వ్యూహాత్మకంగా రక్తికట్టించడం.. తెలిసిందే. ఇప్పుడు సేమ్ అలానే జరిగింది. అయితే.. ఈ కేసులో యువతి, ఆమె తల్లి కలిసి.. తండ్రిని కడతేర్చారు. మిగిలిందంతా సేమ్ సీన్. ఏం జరిగిందంటే.. కర్ణాటకలోని బెళగావికి …
Read More »అన్నంతపనీ చేసిన రష్యా
ఉక్రెయిన్లోని నాలుగు ప్రధాన ప్రాంతాలను కలిపేసుకుంటున్నట్లు ప్రకటించిన రష్యా అన్నంతపనీ చేసింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య గడచిన ఎనిమిది నెలలుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో విజేతగా చివరకు ఏ దేశం నిలుస్తుందో కూడా ఎవరు చెప్పలేకున్నారు. ఈ నేపధ్యంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఊహించని విధంగా నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే ఉక్రెయిన్లోని నాలుగు కీలకమైన ప్రాంతాలను రష్యాలో కలిపేసుకోవాలని. డోనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, …
Read More »దేశంలో ప్రైవేటు జైళ్ళా ?
ఐరోపా దేశాల్లో ఉన్నట్లు మనదేశంలో కూడా ప్రైవేటు జైళ్ళు ఎందుకు నిర్మించకూడదు ? ఇది ఎవరో వేసిన ప్రశ్నకాదు. ఒక కేసు విచారణ సందర్భంగా స్వయాన సుప్రీంకోర్టు చేసిన కామెంట్. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ప్రైవేటు జైళ్ళ నిర్మాణ ప్రస్తావన తెచ్చిందో వెంటనే ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేసు విచారణ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ మన జైళ్ళలో రద్దీ బాగా పెరిగిపోయిందని అభిప్రాయపడ్డారు. మన జైళ్ళల్లో …
Read More »