క్రికెటర్లకు 40 ఏళ్లు వచ్చాయంటే ఆటలో కొనసాగడం చాలా కష్టం. ఆ వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వాళ్లు చాలా తక్కువ మంది. టీ20 లీగ్‌ల్లో సైతం 40 మార్కు దాటాక కొనసాగడం కష్టమే అవుతుంది. ఎంతటి మహామహులైన ఆటగాళ్లయినా సరే.. ఆ వయసు వచ్చేసరికి ఫిట్నెస్, ఫామ్ సమస్యలు ఎదుర్కొంటారు. కొందరు తమ పని అయిపోయిందని గుర్తించి స్వచ్ఛందంగా తప్పుకుంటే.. ఇంకొందరు అవకాశాలు ఆగిపోవడంతో ఇక తప్పక రిటైర్మెంట్ …
Read More »అతను బౌల్డ్ చేస్తే బీసీసీఐకి 60 లక్షలు నష్టం
ఐపీఎల్లో ఒక బౌలర్ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. ఆ రెండూ బౌల్డ్లే. ఐతే అతను బౌల్డ్ చేసినందుకు బీసీసీఐ రూ.60 లక్షలు నష్టపోవడం గమనార్హం. ఇదేం లాజిక్? ఇందులో బెట్టింగ్, ఫిక్సింగ్ వ్యవహారం ఏమైనా ఉందా? అని ఆశ్చర్యం కలుగుతోందా? అలాంటిదేమీ లేదు. ఆ బౌలర్ బౌల్డ్ చేసిన రెండు సందర్భాల్లోనూ మిడిల్ స్టంప్ రెండుగా విరిగిపోవడం విశేషం. ఆ విరిగిన స్టంప్ ఆషామాషీది కాదు. …
Read More »అమెరికాకు వెళ్లాలనుకునే వారికి స్వీట్ న్యూస్..
అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లి చదువుకోవాలని.. అక్కడ ఉద్యోగం చేయాలి.. కారణం ఏదైనా కల మాత్రం అమెరికాకు ప్రయాణమే అన్న వారందరికీ అగ్ర రాజ్యం తీపికబురు చెప్పింది. ఈ ఏడాది భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలు ఇచ్చేయనున్నట్లు చెప్పింది. ఈ ఏడాది 10 లక్షలు (మిలియన్) వీసాలు ఇవ్వనున్నట్లుగా అమెరికా విదేశాంగ శాఖలో సహాయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న డొనాల్ట్ వెల్లడించారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికే భారతీయ విద్యార్థులందరికీ స్టూడెంట్ …
Read More »హైదరాబాద్ లో నరబలి కలకలం?
హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. నమ్మకాల మూఢత్వంతో అభం శుభం ఎరుగని పిల్లాడ్ని బలి (?)ఇచ్చిన షాకింగ్ ఉదంతం తాజాగా వెలుగు చూసింది. హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న సనత్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. విన్నంతనే ఒళ్లు జలదరించి.. భయాందోళనలకు లోనయ్యేలా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే.. సనత్ నగర్ పారిశ్రామిక వాడలో అల్లాదున్ కోటిలో రెడీ మేడ్ దుస్తుల వ్యాపారి వసీంఖాన్ అతని …
Read More »భారీ కోత.. ఈసారి 10వేల మందిని ఇంటికి పంపించేస్తున్న మెటా
మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో ఐటీ కంపెనీలతో సహా పలు దిగ్గజ కంపెనీలు తమ ఖర్చులకు కోత పెట్టుకునే క్రమంలో ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తున్నారు. గడిచిన రెండేళ్లుగా సాగుతున్న ఈ కోతల పర్వం ఇప్పుడు అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికే ఈ సంస్థ నుంచి పలువురు ఉద్యోగుల్ని తీసేసిన సంస్థ.. తాజాగా మరో పదివేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లుగా …
Read More »చైనాను దాటేశాం.. ప్రపంచంలోనే తొలి స్థానానికి భారత్
ఏదైనా విభాగంలో మొదటి స్థానంలో నిలిస్తే ఆ అనందమే వేరు. కానీ.. ఇప్పుడు వెల్లడైన విషయం గురించి వింటే ఆనందం కంటే ఆందోళనే ఎక్కువ అవుతుంది. అవును.. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. ఇంతకాలం ఈ స్థానంలో చైనా నిలిస్తే.. ఇప్పుడు భారత్ వచ్చేసింది. చైనాకు మించి భారత్ లో 29 లక్షల మంది జనాభా అధికంగా ఉన్నారన్న విషయాన్ని తాజాగా లెక్కించారు. భారత జనాభా …
Read More »హైదరాబాద్ లో ఐటీ కంపెనీ అరాచకం
ఇదో ఘరానా మోసం. విన్నంతనే అర్థం కాదు. కాస్తంత వివరంగా చెబితే.. అసలు విషయం అర్థమై ఆశ్చర్యపోవటమే కాదు.. వామ్మో ఇలా కూడా మోసం చేస్తారా? అంటూ నోరెళ్లబెట్టే పరిస్థితి. హైదరాబాద్ మహానగరంలో ఐటీ కంపెనీల పేరుతో జరిగే మోసాలకు సంబంధించి ఇదో కొత్త తరహా మోసంగా చెప్పాలి. ఐటీ ఉద్యోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కంపెనీల మాటునే.. దొంగ పనులు చేసే కంపెనీలు కొన్ని ఉంటాయి. ఆ …
Read More »డీఏవీ స్కూల్ ఘటన: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు
ముక్కుపచ్చలారని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఉన్మాదికి కోర్టు సరైన శిక్ష విధించింది. 20 ఏళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ.. సంచలన తీర్పు వెలువరించింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న డీఏవీ స్కూల్లో జరిగిన ఈ దారుణ ఘటనపై నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు కీలక తీర్పునిచ్చింది. చిన్నారిపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రజనీకుమార్ పాల్పడిన దాష్టీకాన్ని నిర్దారిస్తూ.. 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును వెల్లడించింది. ఏం …
Read More »దేశంలో ఫస్ట్ ‘ఆపిల్’ స్టోర్ ప్రారంభం.. ఎక్కడంటే!
అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఆపిల్ ఐ ఫోన్ కంపెనీ భారత్‌లో తన మొట్టమొదటి ఆపిల్ స్టోర్‌ను ఈ రోజు ప్రారంభించింది. Apple BKC పేరుతో భారత దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో అత్యంత అధునాతన హంగులతో రూపుదిద్దిన భవనంలో ఈ స్టోర్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్టోర్‌లో వినియోగ దారులకు అవసరమైన అన్ని ఆపిల్ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చారు. విశాలమైన ప్రాంగణంలో ఆధునిక సొబగులతో తీర్చిదిద్దిన …
Read More »వందేభారత్ స్పీడు ఒక మోసం !
చెప్పే గొప్పలకు.. చేతలకు మధ్య దూరం ఎంతన్న విషయాన్ని తెలుసుకోవాలంటే మోడీ సర్కారు గొప్పగా తీసుకొచ్చిన వందేభారత్ రైలును అడిగితే చెప్పేస్తుందంటున్నారు. దేశంలోనే అత్యధిక వేగంతో నడిచే రైలుగా గొప్పలు చెప్పేయటమే కాదు.. ఆ రైలుబండిలో ప్రయాణించాలంటే మస్తు పైసలు వసూలు చేస్తున్న వైనం తెలిసిందే. అదేమంటే.. అప్డేటెడ్ టెక్నాలజీతో అదిరే ఫీచర్లతో అంటూ బడాయి మాటలు చాలానే చెప్పటం చూశాం. అయితే.. ఈ ట్రైన్ కు సంబంధించిన అసలు …
Read More »పేపర్ లీకేజీ కోసం.. కారు అమ్మేశారు
తెలంగాణలో లీకు వీరులు సృష్టించిన తుఫాను.. మరిన్ని దిశలుగా పయనిస్తోంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలకు సంబంధించి పేపర్లు లీక్ అయిన వ్యవహారం.. అన్నివైపుల నుంచి విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. అయితే.. తోడుతున్న కొద్దీ.. నీరు ఊరినట్టు.. ఈ కేసులో విచారణ చేస్తున్న కొద్దీ విస్మయం కలిగించే విషయం వెలుగు చూస్తున్నాయి. పేపర్ లీకు కుంభకోణంలో ఖమ్మం ప్రాంతానికి చెందిన …
Read More »గంగూలీ, కోహ్లిల మధ్య సద్దుమణగని గొడవ
బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండగా సౌరభ్ గంగూలీ తనకు వ్యతిరేకంగా వ్యవహరించాడని చాలా బలంగా నమ్ముతాడు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి. తనను వన్డే కెప్టెన్‌గా తప్పించడంలో గంగూలీదే కీలక పాత్ర అన్నది అతడి నమ్మకం. ఈ విషయాన్ని విలేకరుల ముందు కూడా పరోక్షంగా చెప్పాడు ఓ సందర్భంలో. గంగూలీ వచ్చాకే భారత క్రికెట్లో కోహ్లి ఆధిపత్యానికి తెరపడిందని.. సెలక్షన్ సహా అన్ని నిర్ణయాల్లో విరాట్ ఏకఛత్రాధిపత్యాన్ని అతను …
Read More »