సంచలన తీర్పును వెల్లడించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. కలిసి జీవించే పరిస్థితులు లేనప్పుడు విడిపోవాలని దంపతులు ఇద్దరు పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నప్పుడు.. విడాకుల కోసం ఆర్నెల్లు ఆగాల్సిన అవసరం లేదని.. వారికి వెంటనే విడాకులు ఇవ్వొచ్చని చెప్పింది సుప్రీంకోర్టు. పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటే అందుకు ఆరు నెలలు ఎందుకు ఆగాలి? కొన్ని షరతులతో ఆరునెలల నిరీక్షణ నిబంధనను పాటించకుండా తక్షణమే విడాకులు మంజూరు చేసే విశిష్ఠ అధికారం తమకు …
Read More »థాయ్ లాండ్ లో అడ్డంగా దొరికిపోయిన చికోటి గ్యాంగ్
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. క్యాసినో కింగ్ గా పేరున్న చికోటి ప్రవీణ్ ను థాయ్ లాండ్ లో అరెస్టు చేశారు. మొత్తం 90 మంది భారతీయ గ్యాంబ్లింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. థాయ్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పటాయాలోని టాస్క్ ఫోర్సు పోలీసులు ఈ అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ముఠాలో పద్నాలుగు మంది మహిళలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. వీరి నుంచి భారీగా …
Read More »కాళీమాతను హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోతో పోల్చుతూ..
రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్.. భారత ప్రజల మనోభావాలు దెబ్బతీసే పనికి ఒడిగట్టింది. హిందువులు ఆరాధించే కాళీమాత ఫొటోను అభ్యంతరకరమైన రీతిలో పోస్ట్ చేసింది. కాళీమాతను హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోతో పోల్చుతూ రెండు ఫొటోలను ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తొలి ఫొటోలో బాంబు దాడి అనంతరం సంభవించే అగ్ని, దట్టమైన పొగ దృశ్యాలున్నాయి. మరో ఫొటోలో దట్టమైన పొగంతా …
Read More »బ్యూటీ పార్లర్‌కు వెళ్లొద్దన్నాడని భార్య ఆత్మహత్య..
చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బ్యూటీ పార్లర్‌కు వెళ్లొద్దు అని చెప్పిన భర్త మాట ఆ భార్యకు చేదుగావినిపించింది. అంతే.. వెంటనే ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్‌లో జరిగింది. బ్యూటీ పార్లర్‌కు వెళ్లొద్దని చెప్పినందుకు.. ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. భర్త భయటకు వెళ్లిన సమయంలో సీలింగ్‌కు ఉరివేసుకొని చనిపోయింది. …
Read More »ఎన్నికలపై కేసీఆర్ రూటు మార్చారా…?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు ఎవ్వరికీ అర్థం కావు. ఎవరితో ఎప్పుడు స్నేహంగా ఉంటారో..ఎవరిని ఎప్పుడు గెంటి వేస్తారో చెప్పడం ఎంతటి రాజకీయ దురంధరుడికైనా కష్టమే.తిట్టిన వారినే అక్కున చేర్చుకునే సమర్థత కూడా కేసీఆర్ కే ఉంది. అందుకే బీఆర్ఎస్ అధినేత విషయంలో అవునంటే కాదనిలే… కాదంటే అవుననిలే అన్న పాట పాడుతుంటారు.. నాలుగు నెలల క్రితం కేసీఆర్ ఒక పాచిక వదిలారు. ఈ సారి సిట్టింగులందరికీ టికెట్లు ఖాయమని …
Read More »హైదరాబాద్ నాలాలో పడి చిన్నారి మృతి.
ఎండాకాలంలో అనూహ్యంగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ తడిసి ముద్దయింది. శుక్రవారంరాత్రి కురిసిన భారీ వర్షాలకు.. లోతట్టు ప్రాంతాలు మోకాల్లోతు నీటిలో మునిగిపోయాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్ కళాసిగూడలో మ్యాన్‌హోల్ మూత తెరిచి ఉండడంతో మౌనిక అనే ఓ చిన్నారి డ్రైనేజీలో పడి మృతి చెందింది. ఈ రోజు ఉదయం చిన్నారి పాల ప్యాకెట్ కోసం బయటికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన డీఆర్ఎఫ్ సిబ్బంది …
Read More »క్రికెట్ కెప్టెన్ అంటూ కప్పు పట్టుకొచ్చి.. సీఎం కే మస్కా కొట్టేశాడు
అవును.. వీడు మామూలోడు కాదు. ఏకంగా ముఖ్యమంత్రికే మస్కా కొట్టేశాడు. నిఘా విభాగం ఏం చేస్తుందో కానీ అంత జరిగిపోయిన తర్వాత అసలు విషయం బయటకువచ్చి అవాక్కు అయ్యేలా చేసింది. తాజాగా ఈ పరిణామం తమిళనాడులో చోటు చేసుకుంది. తనకుతాను వీల్ ఛైర్ క్రికెట్ కెప్టెన్ గా పరిచయం చేసుకోవటమే కాదు.. ఈ మధ్యనే ప్రపంచకప్ ను సాధించినట్లుగా బిల్డప్ ఇచ్చి.. ముఖ్యమంత్రిగా ఫోటోలు దిగిన మాయగాడి ఉదంతమిది. రామనాథపురం …
Read More »40 మంది మహిళలకు ఒకే భర్త.. నిజం.. మన దేశంలోనే!!
ఒక్క భార్యతోనే వేగలేకపోతున్నాం.. అని తలపట్టుకునే భర్త పుంగవులకు.. కళ్లు తెరిపించే ఘటన వెలుగు చూసింది. ఏకంగా.. ఒక భర్తకు 40 మంది భార్యలు ఉన్నారు. వారికి పిల్లలు కూడా పుట్టారు. ఎవరిని అడిగినా.. తమ భర్త పేరు ఒక్కటే అని చెబుతున్నారు. మొత్తం 40 మందీ ఇదే పాట పాడుతున్నారు. మరి ఆ 40 మంది భార్యలు.. ఒక్కగానొక్క భర్త కథేంటి? ఎక్కడ వెలుగు చూసింది.. అనేది దేశవ్యాప్తంగా …
Read More »ఫ్లైట్ లో కొట్టేసుకున్నారు.. అద్దం సైతం విరిగిపోయింది
ఇటీవల కాలంలో విమాన ప్రయాణంలో చోటు చేసుకుంటున్న విపరీతాలు అన్నిఇన్ని కావు. ఎయిర్ హోస్టెస్ మీద వేధింపులు..వారిని ఇబ్బంది పెట్టటం కొత్తేం కాదు. కానీ.. తోటి ప్రయాణికుల మీద మూత్ర విసర్జన చేయటం.. అనుచితంగా ప్రవర్తిస్తున్న వైఖరులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. తాజా ఉదంతంలో అయితే.. ఏకంగా కొట్టేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. ఆస్ట్రేలియాలో వెలుగు చూసిన తాజా ఉదంతం గురించి తెలిస్తే షాక్ తినాల్సిందే. నలుగురు ప్రయాణికుల …
Read More »దొంగతనం ఎలా చేయాలి.. సమ్మర్ క్లాసులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్
కొన్ని కొన్ని సంగతులు.. నమ్మేందుకు శక్యం కాదు! కానీ, అవి పక్కా నిజాలు. ఇలా కూడా జరుగుతాయా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ, ఈ దేశంలో ఏదైనా కూడా సాధ్యమే అంటున్నారు పరిశీలకులు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రొఫెసర్ రిటైర్ అయ్యారు. తాజాగా ఆయన తన ఇంట్లో ట్యూషన్లు చెబుతున్నారు. సరే.. అందరూ ఏమనుకుంటారు? ఆయనంత సీనియర్ కాబట్టి.. చాలా బాగా పాఠాలు చెబుతారు అనేకదా! …
Read More »హైదరాబాద్ లో గుర్రాన్ని కాపాడబోయి ఇద్దరు చనిపోయారు
హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులు అనూహ్యరీతిలో మరణించారు. గుర్రాన్ని కాపాడే క్రమంలో వారు ప్రాణాలు కోల్పోయారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని కిషన్ బాగ్ కు చెందిన అజం అనే వ్యక్తి కిస్మత్ పూర్ లో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తుంటాడు. అజం అన్న కొడుకు సైఫ్ అతడికి సాయం చేస్తుంటాడు. ఒకట్రెండు రోజుల క్రితమే రాజస్థాన్ కు చెందిన అశీష్ సింగ్ అనే యువకుడు వారి వద్ద …
Read More »ధోని చెప్పకనే చెప్పేశాడు
క్రికెటర్లకు 40 ఏళ్లు వచ్చాయంటే ఆటలో కొనసాగడం చాలా కష్టం. ఆ వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వాళ్లు చాలా తక్కువ మంది. టీ20 లీగ్‌ల్లో సైతం 40 మార్కు దాటాక కొనసాగడం కష్టమే అవుతుంది. ఎంతటి మహామహులైన ఆటగాళ్లయినా సరే.. ఆ వయసు వచ్చేసరికి ఫిట్నెస్, ఫామ్ సమస్యలు ఎదుర్కొంటారు. కొందరు తమ పని అయిపోయిందని గుర్తించి స్వచ్ఛందంగా తప్పుకుంటే.. ఇంకొందరు అవకాశాలు ఆగిపోవడంతో ఇక తప్పక రిటైర్మెంట్ …
Read More »