రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. సాధారణంగా జూన్ వచ్చిందంటే.. ఎండలు తగ్గుముఖం పట్టి.. తొలకరి జల్లులు మొదలు వాతావరణం కాస్తంత చల్లబడే పరిస్థితి. అందుకు భిన్నంగా సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడు నుంచి ఆరు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దుస్థితి. ఎల్ నినో వాతావరణ పరిస్థితుల కారణంగా.. వర్షాలు ఆశించినంత స్థాయిలో కురవకపోవటంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమొదవుతున్నాయి. రానున్న మూడు రోజులు …
Read More »నీట్ రీ ఎగ్జామ్… ఆ యాప్ బ్యాన్!
నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, ఈ ఏడాది మే 3న జరిగిన ఆ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ క్రమంలో కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 21న నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్‌ను నిర్వహించబోతున్నారు. అయితే, …
Read More »శ్రీనగర్.. ఈ ఏడాది సమ్మర్ విన్నర్.. ఎంత భారీగా ఫ్లైట్ జర్నీలంటే?
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్ కు భారీగా దేశీయ ప్రయాణికులు ఆసక్తి చూపటం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విమానయానం ద్వారా దేశంలోని వివిధ ఎయిర్ పోర్టుల రద్దీ చూస్తే.. శ్రీనగర్ విజేతగా నిలవటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో విమాన టికెట్ల ధరలు పెరిగినప్పటికి.. ప్రయాణికులు మాత్రం …
Read More »సీఎం ఇంటిముందే చెత్త పోసి నిరసన
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. “మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే.. అన్యాయం జరిగితే నిలదీస్తాం, నిరసన తెలుపుతాం” అంటోంది నేటి యువత. మన దేశంలో వచ్చిన కాక్రోచ్ ఉద్యమం ఇందుకు ఉదాహరణ. జెన్-జెడ్ యువత పలు దేశాల్లో ఇటువంటి వినూత్న పద్ధతుల్లోనే తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. నేపాల్‌లో తాజాగా ముఖ్యమంత్రి నివాసం ముందే చెత్త పారబోసి యువత …
Read More »వీకెండ్ పార్టీలో విగత జీవిగా టెకీ
సాప్ట్ వేర్ రంగమంతా ఇప్పుడు వీకెండ్ వచ్చిందంటే… ఫుల్ ఎంజాయ్ మెంట్ లోకి దిగిపోతోంది. శని, ఆదివారాలు రెండు రోజులూ ఇల్లు కూడా గుర్తుకు రానంతగా జల్సాల్లో మునిగి తేలుతున్నారు. ఇలాంటి ఓ వీకెండ్ పార్టీకి వెళ్లిన ఓ యువ టెకీ పార్టీలోనే విగత జీవిగా మారిపోయాడు. హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్ హౌస్ కేంద్రంగా జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టగా… ఈ టెకి …
Read More »గొడవలతో భార్యతో మాట్లాడకపోతే గృహ హింస కాదు
గొడవలు కానీ మనస్పర్థలతో కానీ భార్యతో భర్త మాట్లాడకపోవటం గృహ హింస కిందకు వస్తుందా? మాట్లాడకుండా ఉండటం వేధింపులకు గురి చేసినట్లు అవుతుందా? దాంపత్య జీవితంలో గొడవలు చోటు చేసుకున్నప్పుడు..మాటా మాటా పెరిగి మాటలు బంద్ అయిన వేళ.. గృహ హింస కేసు పెడితే..దానికి న్యాయస్థానం శిక్ష విధిస్తే..? అచ్చంగా ఇలానే జరిగిన ఉదంతానికి సంబంధించి సదరు భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా దీనికి సంబంధించిన తీర్పును ఇవ్వటమే కాదు.. …
Read More »పాప రాలేదు.. కుక్క ఇక లేదు.. ఏపీకి సవాల్‌గా కేసు!
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్‌గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు కీలక మలుపు తిరిగింది. సదరు బాలిక జాడ కనిపెడుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న పెంపుడు(వీధి) కుక్క కూడా చనిపోయింది. దీంతో ఇప్పుడు ఆ బాలిక ఆచూకీ ఎలా కనిపెట్టాలన్న విషయం ఇటు సర్కారుకు కూడా ఇబ్బందిగానే ఉంది. మరోవైపు బాలల హక్కుల సంఘాలు.. వైసీపీ నాయకులు సర్కారుపై విమర్శల …
Read More »‘వర్క్ ఆన్ బైక్’… ఇది టూ మచ్ గురు!
కరోనా మహమ్మారి పుణ్యమా అని వర్క్ ఫ్రమ్ హోమ్ మన జీవనయానంలో ఓ విదానం అయితే… ఆ తీరు ప్రభావం మరింత ఎక్కువైన ఓ వ్యక్తి అప్పుడెప్పుడో వర్క్ ఇన్ కార్ ను పరిచయం చేశాడు. దానినీ గిరాటేసిన మరొకతను ఏకంగా వర్క్ ఆన్ బైక్ అన్న కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టాడు. వర్క్ ఫ్రం హోమ్ వరకు ఓకే గానీ… మిగిలిన రెండు మన ప్రాణాలతో పాటు ఎదుటి …
Read More »తడబడుతున్న వైభవ్… ఒక్క సిక్స్ లేదు
ఐపీఎల్‌లో సిక్సర్ల సునామీతో అందరినీ ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఇండియా A జట్టు తరఫున ఆడుతూ ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయికి అలవాటు పడుతున్నాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంక పిచ్‌లపై ఆడుతున్న ఈ కుర్రాడు తన మార్క్ హిట్టింగ్ చూపించలేక కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. లీగ్ లో టాప్ స్కోరర్‌గా, అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా వచ్చిన క్రేజ్ కు, ఇక్కడ ఇండియా A టీమ్‌లో …
Read More »ఆమెకు జీతం రూ.1.4 లక్షలు… భరణం రూ.1.35
ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై జరుగుతున్న చర్చ అంతకంతకూ పెరుగుతోంది. దీనికి కారణం.. కోర్టు ఇచ్చిన తీర్పుగా చెప్పాలి. పెళ్లైన ఆర్నెల్లకే విడిపోయి.. విడాకులకు సిద్దమైన జంటకు కోర్టు అందుకు అంగీకరించటం ఒక ఎత్తు అయితే.. భరణం కింద భార్యకు చెల్లించాల్సిన మొత్తం మీద కోర్టు ఆదేశాలు ఈ చర్చ మొత్తానికి కారణంగా చెప్పాలి. …
Read More »గంట వాన పడితే ఇదీ హైదరాబాద్ పరిస్తితి
వర్షాకాలం ఇంకా ప్రారంభం కానే లేదు. అప్పుడే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మంగళవారం భారీ వర్షం కురిసింది. గంటల తరబడి నగరంలోని పలు ప్రాంతాల్లో నాన్ స్టాప్ గా వర్షం కురవడంతో జనం ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. వర్షం కురిసిన ప్రాంతాల్లో రాత్రి పొద్దుపోయేదాకా కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ జాంలు కొనసాగాయి. మంగళవారం సాయంత్రం సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో …
Read More »హెచ్1బీ వీసాదారులకు భారీ ఊరట
అమెరికాలో పనిచేసేందుకు వెళుతున్న సాంకేతిక నిపుణులకు ఆ దేశ న్యాయస్థానం భారీ ఊరటను ఇచ్చిందని చెప్పక తప్పదు. ప్రత్యేకించి టెక్నాలజీలో అన్ని దేశాల కంటే అగ్రస్థానంలో ఉన్న భారతీయ వృత్తి నిపుణులకు ఆ కోర్టు తీపి కబురు చెప్పిందని చెప్పక తప్పదు. అమెరికాకు మరోమారు అధ్యక్షుడిగా పదవీ బాద్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వలస విధానంలో చేస్తున్న మార్పుచేర్పులకు ఆ కోర్టు ఓ చెంపపెట్టులాంటి తీర్పును ఇచ్చిందని చెప్పాలి. హెచ్1బీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates