మూడో ప్ర‌పంచ యుద్ధం త‌ప్ప‌దు: బాబా వాంగా భ‌విష్య‌వాణి

బాబా వాంగా.. అంత‌ర్జాతీయంగా పేరున్న సిద్ధాంతి. భ‌విష్య‌వాణిని వినిపించ‌డంలో సుప్ర‌సిద్ధురాలు. పూర్తిగా అంధురాలైన బాబా వాంగాకు ప్ర‌పంచ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. అయితే.. ఆమె ఇప్పుడు లేరు. 1996లోనే మృతి చెందారు. కానీ, ఆమెరాసిన పుస్త‌కంలోని విష‌యాల‌ను ఏటా బ‌య‌ట పెడుతున్నారు.

తాజాగా 2026కు సంబంధించిన భ‌విష్య‌వాణిని వాంగా పుస్త‌కం నుంచి బ‌య‌ట పెట్టారు. దీనిలో ప‌లు విష‌యాలు ఉన్నాయి. ప్ర‌ధానంగా మూడో ప్ర‌పంచ యుద్ధం త‌ప్ప‌ద‌ని ఆమె వెల్ల‌డించారు. అదేవిధంగా కృత్రిమ మేథ ప్ర‌జ‌ల‌పై ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తుంద‌ని.. 2026లో ఇదే అస‌లైన ముప్పు అని ఆమె చెప్ప‌డం గ‌మ‌నార్హం.

2026లో ఏం జ‌రుగుతుంది?

+ మూడో ప్ర‌పంచ యుద్ధం వ‌స్తుంది. దేశాల మ‌ధ్య అశాంతి త‌లెత్తుతుంది.

+ అన్ని దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు ప‌డ‌తాయి.

+ చైనా దేశం తైవాన్‌ను ఆక్ర‌మిస్తుంది. ఎవ‌రూ ఆప‌లేరు.

+ రష్యా… అమెరికాల‌ మధ్య ఆధిప‌త్య పోరు పెరుగుతుంది.

+ ప్రపంచవ్యాప్తంగా అశాంతి, ఒత్తిడి పెరుగుతుంది.

+ కృత్రిమ మేధ(ఏఐ) మానవాళిపై ఆధిపత్యం చెలాయిస్తుంది.

+ మానవుల సామర్థ్యాన్ని ఏఐ బలహీనపరుస్తుంది.

+ ఆసియా దేశాల్లో వరదలు, భూకంపాలు, సునామీలు.

+ ప్రకృతి వైపరీత్యాలతో వేల మంది చ‌నిపోయే అవ‌కాశం.

ఇప్ప‌టి వ‌ర‌కు ఏం చెప్పినా.. నిజ‌మే!

+ అమెరికాలో 11 సెప్టెంబర్ దాడులు జ‌రుగుతాయ‌ని చెప్ప‌గా.. అవి నిజ‌మ‌య్యాయి.

+ 2022లో బ్రిట‌న్‌లో వరదలు వ‌స్తాయ‌ని వంద‌లాది మంది చ‌నిపోతార‌ని చెప్పారు. అది కూడా నిజ‌మైంది.

+ ప్ర‌పంచంలో ఉగ్ర‌వాదం పెరుగుతుంద‌న్నారు. అది కూడా నిజ‌మైంది.

+ అమెరికా ఆధిప‌త్య భ‌విష్య‌త్తులో త‌గ్గుతుంద‌ని వాంగా చెప్పారు. రాను రాను ఇది నిజంఅవుతోంది.

+ ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌త క‌ల‌హాలు.. మ‌త‌రాజ్యాల‌పై దాడులు పెరుగుతాయ‌ని అన్నారు. ఇది కూడా వాస్త‌వ‌మైంది.

+ చ‌మురు దేశాలు(ర‌ష్యా-ఉక్రెయిన్‌) సుదీర్థ‌కాలం కొట్లాడుకుంటాయ‌ని వాంగా వెల్ల‌డించారు. ఇది కూడా నిజ‌మైంది.

+ ఒక పెద్ద దేశం( భార‌త్‌) ప్ర‌పంచానికి దిశానిర్దేశం చేస్తుంద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం అది జ‌రుగుతోంది.

ఎవ‌రీ వాంగా..?

బాబా వాంగా బల్గేరియా దేశానికి చెందిన ఒక ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని. ఈమె చెప్పిన‌ జోస్యం చాలా సందర్భాలలో నిజమైంది. బాబా వాంగా జీవించి ఉన్నప్పుడు ఆమె చెప్పిన జోస్యం నిజమవుతుండడంతో ధనవంతులు, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఆమె వద్దకు వెళ్లి తమ భవిష్యత్ గురించి చెప్పించుకునేవారు.

వీరిలో మ‌న భార‌తీయులు కూడా ఉండ‌డం విశేషం. 1996లో 84 ఏళ్ల వ‌య‌సులో అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విష‌యాన్ని కూడా ఆమె ముందుగానే ఊహించారు. దీంతో ఏర్పాట్లు చేయ‌మ‌ని కూడా ఆమె త‌న వారిని ఆదేశించారు.