వినియోగదారులు ఎంతో ఇష్టంగా తినే ‘మయోనైజ్’ క్రీమ్‌పై తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిషేధం విధించింది. దీనిని వినియోగిస్తే.. రూ.5 నుంచి 10 లక్షల వరకు హోటళ్లు, రెస్టారెంట్లు.. ఇతర ఆహార తయారీ, విక్రయ కేంద్రాలకు జరిమానా విధిస్తామని తెలిపింది. నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని కూడా స్పష్టం చేసింది. గత కొన్నాళ్లుగా మయోనైజ్ వినియోగంపై వైద్యులు, పర్యావరణ వేత్తలు, ఆరోగ్య నిపుణులు కూడా.. సర్కారుకుకొన్ని సూచనలు చేశారు. దీనిని వినియోగించడంపై …
Read More »చైనాలో మరో ఊహించని కష్టం
చైనా ఆధునికంగా ఎంత వేగంగా దూసుకుపోతున్నా కూడా ప్రతీ ఏడాది ఏదో ఒక కొత్త కష్టం అక్కడ తీరని నష్టాన్ని కలిగిస్తోంది. అగ్ర జనాభా కలిగిన చైనా ఇప్పటికే కొత్త రోగాలను పుట్టించడంలో చరిత్ర సృష్టించింది. ఇక కరోనా నుంచి ఆ దేశం ఇంకా కొలుకోలేదు. ప్రపంచానికి తెలియడం లేదు కానీ ఏదో ఒక వైరస్ తో అక్కడి జనాలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇంటర్నేషనల్ మీడియా నుంచి రహస్యాలు …
Read More »WTC ఫైనల్‌కు టీమిండియా పయనం క్లిష్టమా?
పుణేలో జరిగిన రెండో టెస్టులో టీమిండియాకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. కివీస్ జట్టు 113 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి మూడు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇదే భారత గడ్డపై న్యూజిలాండ్ సాధించిన తొలి టెస్టు సిరీస్ విజయం కావడంతో చరిత్ర సృష్టించింది. భారత్ తన సొంత గడ్డపై టెస్టు సిరీస్‌ను కోల్పోవడం 12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2012-13 సీజన్లో ఇంగ్లండ్ పర్యటనలో …
Read More »భారత అంతరిక్ష ప్రయాణంలో కొత్త అడుగు: టార్గెట్ 2035
భారత అంతరిక్ష ప్రయాణం మరో కీలక మలుపు తీసుకోబోతోంది. 2035 నాటికి భారత్ సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తోందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మేరకు ఇస్రో, కేంద్ర బయోటెక్నాలజీ విభాగం మధ్య కీలక ఒప్పందం కుదిరింది, ఇది దేశంలో శాస్త్రీయ రంగానికి కొత్త శకం తెస్తుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా, భారతీయ అంతరిక్ష కేంద్రం …
Read More »చంద్రముఖి అవుతుందా.. నాగవల్లి అవుతుందా?
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ హార్రర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న సినిమా అనే విషయం చాన్నాళ్ల ముందే వెల్లడైంది. తెలుగులో హార్రర్ కామెడీలు ఊపందుకోవడంలో మారుతిదే ప్రధాన పాత్ర. అతను తీసిన ‘ప్రేమ కథా చిత్రమ్’ అప్పట్లో సెన్సేషనల్ హిట్టయింది. దీంతో వరుసగా ఆ జానర్లో సినిమాలు వచ్చాయి. కొన్నేళ్ల తర్వాత ఆ జానర్ జనాలకు మొహం మొత్తేసింది. దీంతో ఆ తరహా సినిమాలు ఆగిపోయాయి. కానీ …
Read More »మరో సచిన్ అవుతాడనుకుంటే..
పృథ్వీ షా.. ఈ పేరు ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి రాకముందు నుంచే ఇండియాలో బాగా వినిపించింది. స్కూల్ లో ఉండగానే ఒక మ్యాచ్ 546 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. అనంతరం ప్రముఖ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ సైతం అతని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మెల్లగా రంజీల్లోకి రావడంతో అతని దశ తిరిగింది. స్పాన్సర్స్ సైతం చిన్న ఏజ్ లొనే అతనికి సపోర్ట్ చేసేందుకు ముందుకు …
Read More »USA: ఎలాన్ మస్క్ అధ్యక్ష రేసులో ఎందుకు లేరు?
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీకి మద్దతు తెలిపిన ఎలాన్ మస్క్, ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ తరఫున తన మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం ట్రంప్ ఎన్నికల ప్రచారంలో మస్క్ కూడా పాల్గొంటున్నారు. మరోవైపు, డెమొక్రాటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ కూడా ముమ్మర ప్రచారంలో ఉన్నారు. ఇక ప్రపంచంలోని టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ టెక్నాలజీ పరంగా ఎవరు సాధించలేని ఘనతను సాధించాడు. అతను తలచుకుంటే …
Read More »క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. షమీ వచ్చేశాడు!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ గత కొంతకాలంగా భారత టీమ్ కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది వన్డే వరల్డ్‌కప్‌లో గాయపడిన తర్వాత చాలా కాలం రెస్ట్ లొనే ఉన్నాడు. ఇటీవల ఐపీఎల్ సీజన్ కు కూడా గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. బుమ్రా తో పాటు జట్టుకు ప్రధాన బలంగా ఉన్న షమీ లేకపోవడంతో చాలాసార్లు ఆ లోటు కనిపించింది. ఇక ఎట్టకేలకు షమీ పూర్తిగా …
Read More »70 బాంబు బెదిరింపులు.. ఎయిర్‌లైన్స్‌కు భారీ నష్టం
ఇటీవల దేశీయ విమానయాన రంగంలో బాంబు బెదిరింపుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది విమానయాన సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారింది. గడచిన వారం పది రోజుల్లోనే 70కి పైగా బెదిరింపులు నమోదయ్యాయి. బాంబు బెదిరింపులు వచ్చిన ప్రతిసారీ అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ బెదిరింపులు ప్రధానంగా సోషల్ మీడియా ఖాతాల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా అందివ్వబడుతున్నాయి. అయితే, ఇవన్నీ ఉత్తుత్తి బెదిరింపులే కావడం విశేషం. …
Read More »కొత్త సినిమా ఫెయిల్యూర్ మీట్
కొత్త సినిమాలకు టాక్ ఎలా ఉన్నా.. సక్సెస్ మీట్లు పెట్టేయడం మామూలే. ఐతే ఇప్పుడో చిన్న సినిమాకు చిత్రంగా ‘ఫెయిల్యూర్ మీట్’ పెట్టారు. తమ సినిమా ఫెయిలైందని మీట్ పెట్టడం ఏంటి అని ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ‘లవ్ రెడ్డి’ అనే చిన్న సినిమాకు సంబంధించిన యూనిట్ సభ్యులు నిజంగా ‘ఫెయిల్యూర్ మీట్’ పెట్టారు. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా స్మరణ్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ …
Read More »ప్రతి విచారణ లైవ్.. సుప్రీంకోర్టు కొత్త ప్రయోగం!
సుప్రీంకోర్టు కార్యకలాపాల్లో ఇకపై మరింత పారదర్శకత రానుంది. కోర్టు విచారణలను ప్రజలందరూ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించేందుకు వీలుగా సుప్రీంకోర్టు యాప్‌ను త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ యాప్ పై ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించారు. లోపాలను సవరించి, త్వరలోనే దీన్ని ప్రారంభించాలని సుప్రీంకోర్టు యోచిస్తోంది. ఈ విధానంతో దేశ ప్రజలకు చట్టసంబంధి నిర్ణయాలపై మరింత అవగాహన కలుగుతుందని భావిస్తున్నారు. అయితే 2018లోనే సుప్రీంకోర్టు …
Read More »BSNL స్టన్నింగ్ టెక్నాలజీ: ఇక సిమ్‌కార్డ్ తో పనిలేదు
ప్రైవేట్ టెలికం సంస్థలకు గట్టి పోటీ ఇవ్వడానికి BSNL సరికొత్త టెక్నాలజీతో సంచలనం సృష్టించబోతోంది. ఈసారి ప్రముఖ గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ ‘వియాసాట్’తో కలిసి డైరెక్ట్ టు డివైజ్ (డీటుడీ) టెక్నాలజీని పరిచయం చేయనుంది. ఈ సాంకేతికతతో సిమ్‌కార్డు అవసరం లేకుండా నేరుగా శాటిలైట్ ద్వారా కనెక్టివిటీ పొందొచ్చని అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ట్రయల్స్ కూడా విజయవంతంగా పూర్తయ్యాయి. డీటుడీ టెక్నాలజీ ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. …
Read More »