Trends

పాకిస్థాన్ డ్రామా.. ఆయన నిజంగా సారీ చెప్పాడా?

గత ఆదివారం ఆసియా క‌ప్ టీ20 టోర్నీలో భాగంగా జ‌రిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భార‌త జ‌ట్టు.. మ్యాచ్ అనంత‌రం వ్య‌వ‌హ‌రించిన తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా టాస్ గెలిచిన అనంతరం.. అతడికి భార‌త సారథి సూర్య‌కుమార్ యాద‌వ్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇక మ్యాచ్ అనంత‌రం కూడా భార‌త ఆట‌గాళ్లెవ్వ‌రూ పాక్ ప్లేయ‌ర్ల‌తో కరచాలనం చేయలేదు. ఇండియ‌న్ టీం కోసం కాసేపు ఎదురు …

Read More »

బ్రెయిన్‌ ఈటింగ్‌ ఆమీబా కలకలం.. కేరళలో 19 మంది మృతి

కేరళలో ఇటీవల ఆందోళన కలిగించే వ్యాధి వ్యాప్తి చెందుతోంది. ‘బ్రెయిన్‌ ఈటింగ్‌ ఆమీబా’ అనే సూక్ష్మక్రిమి కారణంగా ఇప్పటివరకు 61 కేసులు నమోదు కాగా, 19 మంది మరణించారు. మెదడును నేరుగా ప్రభావితం చేసే ప్రైమరీ ఆమీబిక్‌ మెనింగోఎన్సెఫలిటిస్‌ (PAM) అనే ఈ వ్యాధి చాలా అరుదుగా వస్తుంది కానీ వస్తే ప్రాణాపాయం తప్పదు. ముఖ్యంగా నిల్వ నీటిలో ఈ ఆమీబా పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి …

Read More »

అమ‌రావ‌తి రైతుల‌కు ఊర‌ట‌.. చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి భూములు ఇచ్చిన రైతుల‌కు భారీ ఊర‌ట ల‌భించింది. ఈ మేర‌కు.. సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ వెంట‌నే అధికారులు కూడా జీవో పాస్ చేశారు. 2015-16 మ‌ధ్య అమ‌రావ‌తి నిర్మాణం కోసం.. 33 వేల ఎక‌రాల‌కు పైగా భూముల‌ను రైతులు త్యాగం చేసిన విష‌యం తెలిసిందే. ఆయా భూముల‌ను ప్ర‌భుత్వం ల్యాండ్ పూలింగ్‌(సేక‌ర‌ణ‌) విధానంలో తీసుకుంది. ఈ నేప‌థ్యంలోనే రైతుల‌కు కొన్ని సౌక‌ర్యాలు …

Read More »

రూ.10 లక్షలతో 151 మేకల్ని బలిచ్చిన లారీ డ్రైవర్!

అవును.. ఒక లారీ డ్రైవర్ చేసిన పని గురించి తెలిసిన వారంతా అవాక్కు అవుతున్నారు. నమ్మకాలకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారన్న విషయం అతడి చర్యతో మరోసారి స్పష్టమవుతుందని చెప్పాలి. తాను కోరుకున్న కోరికను తీర్చేందుకు మొక్కు కోసం ఏకంగా 151 మేకల్ని బలి ఇచ్చేసిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. ధర్మపురి జిల్లాలోని అత్తిమరత్తూర్ గ్రామానికి చెందిన తంగరాజ్ ఒక లారీ …

Read More »

ఉసేన్ బోల్ట్.. మెట్లు ఎక్కితే ఆయాసం

ఉసేన్ బోల్ట్.. ప్ర‌పంచంలోనే అత్యంత వేగ‌వంత‌మైన మ‌నిషిగా రికార్డు నెల‌కొల్పిన స్ప్రింట‌ర్. 100 మీట‌ర్ల ప‌రుగు, 200 మీట‌ర్ల ప‌రుగు, 4-100 మీట‌ర్ల రిలే ప‌రుగు.. ఈ మూడింట్లోనూ ప్ర‌పంచ రికార్డులు ఈ జ‌మైకా అథ్లెట్ సొంతం. వంద మీట‌ర్ల‌లో అత‌డి రికార్డు టైమింగ్ 9.58 సెకన్లు. ఎప్పుడో 2009లోనే అత‌నీ ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పాడు. 200 మీట‌ర్ల‌లో కూడా అదే ఏడాది 19.19 సెక‌న్ల‌తో రికార్డు బ‌ద్ద‌లు కొట్టాడు. …

Read More »

ఐసీసీ నుంచి పాక్‌కు మరో షాక్‌

ICC

ఆసియా కప్ 2025లో ఇండియా – పాక్ మ్యాచ్ తర్వాత చోటు చేసుకున్న “నో హ్యాండ్‌షేక్” వివాదం ఊహించని స్థాయికి చేరింది. ఈ అవమానాన్ని తట్టుకోలేని పాక్ క్రికెట్ బోర్డు (PCB) ఇండియన్ జట్టుపైనే కాకుండా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై కూడా ఆరోపణలు చేసింది. టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్‌తో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ చేతులు కలపకూడదని పైక్రాఫ్ట్ ఆదేశించారని పాక్ ఆరోపించింది. అందుకే ఆయన్ని వెంటనే రిఫరీ …

Read More »

షేక్ హ్యాండ్ గొడ‌వ‌.. బాయ్‌కాట్‌కు సిద్ధ‌మైన పాక్

ఆసియా క‌ప్ టీ20 టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి జ‌రిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భార‌త జ‌ట్టు.. మ్యాచ్ అనంత‌రం వ్య‌వ‌హ‌రించిన తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. టాస్ సంద‌ర్భంగా భార‌త కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్, పాకిస్థాన్ సార‌థి స‌ల్మాన్ అఘా ఒక‌రితో ఒక‌రు క‌ర‌చాల‌నం చేసుకోలేదు. టాస్ వేయ‌గానే గెలిచిన కెప్టెన్‌కు అవ‌త‌లి .జ‌ట్టు సార‌థి షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం ఆన‌వాయితీ. కానీ నిన్న సూర్య‌కుమార్ …

Read More »

ఐటీఆర్ గడువుపై గందరగోళం.. కేంద్రం క్లారిటీ

ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువు సెప్టెంబరు 15తోనే ముగుస్తుందని కేంద్రం స్పష్టంగా తెలిపింది. కొన్ని సోషల్ మీడియా పోస్టుల్లో ఈ గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగించారనే వార్తలు వైరల్ అవుతున్నా, అవన్నీ నకిలీ సమాచారం మాత్రమేనని ఆదాయపు పన్ను విభాగం ఖండించింది. ఇప్పటికే జూలై 31 వరకు ఉన్న గడువును ఒకసారి పొడిగించి సెప్టెంబరు 15 వరకు తీసుకొచ్చామని, ఇకపై ఎలాంటి పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది. …

Read More »

నాగమల్లయ్యకు మంచి పేరు ఉంది: ట్రంప్

డాలస్‌లో భారతీయుడు చంద్ర నాగమల్లయ్య దారుణ హత్యకు గురైన ఘటన అమెరికాలో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు నిందితుడని తేలింది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇకపై అక్రమ వలసలను ఏమాత్రం ఉపేక్షించబోమని ఆయన స్పష్టంచేశారు. అమెరికాను మళ్లీ సురక్షితం చేయడమే తమ లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు. చంద్ర నాగమల్లయ్యను నిందితుడు మార్టినెజ్‌ తన భార్య, కుమారుడి …

Read More »

హైద‌రాబాద్‌: డ్రైనేజీలో కొట్టుకుపోయిన‌ మామా అల్లుడు

భాగ్య‌న‌గ‌రం హైదరాబాదు.. చిన్న పాటి వ‌ర్షానికే నీట మునుగుతున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఓ మోస్త‌రు వ‌ర్షానికి అయితే.. మోకాల్లోతు నీటిలో న‌గ‌రం మునిగిపోతోంది. అయితే.. తాజాగా ఆదివారం రాత్రి ఉన్న‌ప‌ళంగా భారీ వ‌ర్షం కురిసింది. కేవ‌లం గంట వ్య‌వ‌ధిలోనే 12 సెంటీమీట‌ర్ల వ‌ర్షం కుర‌వ‌డంతో న‌గ‌రం నీటిలో మునిగిపోయిన‌ట్టు అయింది. ఎటు చూసినా.. వ‌ర‌దదుస్థితి క‌ళ్ల‌కు క‌ట్టింది. లోత‌ట్టు ప్రాంతాల నుంచి ఉన్న‌త‌స్థాయి ప్రాంతాల వ‌ర‌కు కూడా నీట …

Read More »

పాక్ మ్యాచ్.. నో హ్యాండ్‌షేక్.. డోర్స్ క్లోజ్!

ఆసియా కప్ 2025లో పాక్ తో దుబాయ్ వేదికగా జరిగిన పోరులో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. అయితే, ఈ విజయానంతరం చోటుచేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. మ్యాచ్‌ తర్వాత సాధారణంగా ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరికొకరు హ్యాండ్‌షేక్ చేసుకుంటారు. కానీ ఈసారి మాత్రం భారత ఆటగాళ్లు డైరెక్ట్ గా డ్రెస్సింగ్ రూమ్ తలుపులు మూసుకుని లోపలికి వెళ్లిపోవడం గమనార్హం. మ్యాచ్ జరుగుతున్న సమయంలో …

Read More »

పహల్గాం ఉగ్రదాడి… ఇండియన్ కెప్టెన్ క్లీన్ మెసేజ్

ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయాన్ని అందుకున్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ తన మాటలతో అభిమానులను కట్టిపడేశాడు. దుబాయ్ వేదికగా ఆడిన మ్యాచ్‌లో అద్భుత విజయానంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం క్రికెట్‌కే పరిమితం కాలేదు. ఈ సారి సూర్య తన గెలుపు సంతోషాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు అంకితం చేయడం విశేషంగా మారింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్య, “ఇది మా కోసం మరో గేమ్ …

Read More »