Trends

6 వేల విద్యార్థుల వీసాలను రద్దు చేసిన అమెరికా.. కారణమిదే!

అమెరికా విద్యార్థి వీసాలపై పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభమయ్యాయి. తాజాగా 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అధికారికంగా వెల్లడించారు. అమెరికా కొత్త విధానాలు విద్యార్థులపై ఆర్థిక, విద్యా, వ్యక్తిగత స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. దేశ భద్రత పేరుతో తీసుకున్న చర్యలు నిజంగా అంతర్జాతీయ విద్యార్థుల హక్కులకు ముప్పు తెస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రద్దైన వీసాలలో 4,000 మంది దేశ చట్టాలు ఉల్లంఘించడం, మత్తులో వాహనాలు నడపడం, …

Read More »

ఆసియా కప్ 2025 టీమిండియా జట్టు ఇదే.. ఆ ఇద్దరు మిస్!

ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఎంపిక పూర్తయింది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌ అజిత్‌ ఆగార్కర్‌, టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌లు ఈ జాబితాను ప్రకటించారు. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా సెలెక్టర్లతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా కొనసాగుతుండగా, శుభ్‌మన్‌ గిల్‌కు వైస్‌ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు.  జస్ప్రీత్‌ బుమ్రా కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, శ్రేయాస్‌ అయ్యర్‌, యశస్వి …

Read More »

2025 మిస్‌ యూనివర్స్ ఇండియా.. ఎవరీ మణిక?

జైపూర్ వేదికగా ఆగస్టు 18న జరిగిన మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2025 పోటీల్లో మణిక విశ్వకర్మ విజయం సాధించారు. గత ఏడాది విజేత రియా సింఘా చేతులమీదుగా ఆమెకు కిరీటాన్ని అలంకరించారు. ఈ విజయంతో మణిక భారత్ తరఫున నవంబర్‌లో థాయ్‌లాండ్‌లో జరగనున్న 74వ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఘనత సాధించడంతో ఆమె పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్ అయింది. ఈ పోటీల్లో ఇతర రాష్ట్రాల …

Read More »

ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే టోల్ ఎందుకు చెల్లించాలి? : సుప్రీం

ట్రాఫిక్‌ జామ్‌లో గంటల తరబడి ఇరుక్కుని ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సందర్భంలోనూ టోల్‌ ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారని సుప్రీంకోర్టు ఎన్‌హెచ్‌ఏఐని ప్రశ్నించింది. 65 కి.మీ దూరం ప్రయాణానికి 12 గంటలు పట్టినా రూ.150 టోల్‌ వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రయాణికుల మనసులో ఉన్న సందేహాలకు ప్రతిధ్వనిలా మారాయి. ఇటీవల కేరళ హైకోర్టు కూడా …

Read More »

హైదరాబాద్ లో కరెంటు మరణాలు.. మొన్న ఐదుగురు.. నిన్న ముగ్గురు

హైదరాబాద్‌లో విద్యుత్ తీగల కారణంగా వరుసగా ప్రమాదాలు చోటుచేసుకోవడం అందరిని కలచివేస్తోంది. పాతబస్తీ బండ్లగూడలో గణేశ్‌ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే విధంగా అంబర్‌పేట్‌లో రామ్‌చరణ్‌ అనే యువకుడు విద్యుత్‌ తీగలను తొలగించే క్రమంలో షాక్‌ తగిలి ప్రాణాలు కోల్పోయాడు.  కేవలం రెండు రోజుల వ్యవధిలో మూడు వేర్వేరు ప్రదేశాల్లో విద్యుదాఘాత ఘటనలు జరగడం కలకలం రేపుతోంది. ఇంతకుముందు …

Read More »

ఉక్రెయిన్ – రష్యా భేటి: అమెరికాకు వచ్చే లాభమేంటి?

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం సుమారు నాలుగేళ్లుగా కొనసాగుతోంది. దీనిని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మళ్లీ రంగంలోకి దిగారు. ఇటీవల వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పాటు యూరప్ దేశాల నేతలతో చర్చించిన అనంతరం, త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌, జెలెన్‌స్కీ భేటీ జరగనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ భేటీ యుద్ధాన్ని ముగించే దిశగా ఒక కీలక ముందడుగని ఆయన అభివర్ణించారు. అమెరికా సమన్వయం వల్లే ఇది …

Read More »

తెలంగాణలో మరో రెండు విమానాశ్రయాలు!

తెలంగాణలో విమానయాన రంగం కొత్త ఊపు అందుకోబోతోంది. వరంగల్, ఆదిలాబాద్‌లలో నిలిచిపోయిన విమానాశ్రయ ప్రణాళికలు ఇప్పుడు మళ్లీ కదలికలు మొదలుపెట్టాయి. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఈ రెండు నగరాల్లో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను వచ్చే రెండేళ్లలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.  ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ కోసం అవసరమైన భూసేకరణ దాదాపు పూర్తయింది. 253 ఎకరాల భూమికి రూ.205 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రాజెక్టు …

Read More »

అక్కడ రూ.1000 కోట్ల అద్దె

ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్‌ భారత్‌లో తన వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే సంస్థ తాజాగా బెంగళూరులో 2.7 లక్షల చదరపు అడుగుల కార్యాలయాన్ని అద్దెకు తీసుకుంది. ఇది కేవలం సాధారణ లీజు ఒప్పందం కాదు, పదేళ్లలో యాపిల్‌ చెల్లించబోయే అద్దె మొత్తం చూసి దేశంలోని రియల్ ఎస్టేట్ రంగం సైతం ఆశ్చర్యపోతోంది. నెలకు రూ.6.3 కోట్ల అద్దెతో మొదలయ్యే ఈ ఒప్పందం, ప్రతి ఏడాది 4.5 శాతం …

Read More »

ఎయిర్టెల్‌ డౌన్‌ అయ్యిందా?

సోమవారం మధ్యాహ్నం ఎయిర్టెల్‌ నెట్‌వర్క్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్‌ ప్రాంతంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు కాల్స్‌ చేయలేకపోవడం, మెసేజ్‌లు పంపలేకపోవడం, మొబైల్‌ ఇంటర్నెట్‌ పనిచేయకపోవడం వంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. డౌన్‌డిటెక్టర్‌ వెబ్‌సైట్‌లో సుమారు 3,200 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో 66 శాతం నెట్‌వర్క్‌ సమస్యలు, 18 శాతం డేటా యాక్సెస్‌ సమస్యలు, 16 శాతం సిగ్నల్‌ లేకపోవడంపైగా ఉన్నాయి. యూజర్లు X (ట్విట్టర్‌)లో కూడా …

Read More »

రూ.474 కోట్ల బీమా.. దేశంలోనే సంపన్న గణపతి!

ముంబయి గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది మరో రికార్డు సృష్టించాయి. మతుంగా ప్రాంతంలోని జీఎస్‌బీ సేవామండల్ వినాయక మహోత్సవానికి ఏకంగా రూ.474.46 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకున్నారు. దేశంలోనే సంపన్న వినాయకుడిగా పేరుగాంచిన ఈ మండపం, ప్రతిసారి బంగారం, వెండి ఆభరణాలతో అలంకరించబడుతుంది. అదే కారణంగా భీమా మొత్తం ఏటా పెరుగుతూనే వస్తోంది. ఈ ఏడాది వినాయకుడికి అలంకరించనున్న బంగారం, వెండి ఆభరణాల విలువను దృష్టిలో పెట్టుకుని సుమారు రూ.67 …

Read More »

ఆసియా కప్‌ 2025: 10 సెకన్లకు రూ.16 లక్షలు

ఆసియా కప్‌ 2025 సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈసారి టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. సెప్టెంబర్ 10న భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. టీమ్ఇండియా బరిలోకి దిగుతున్న ప్రతి మ్యాచ్‌కి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తుండటంతో, ప్రకటనల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఉంటే, యాడ్ రేట్లు రికార్డులు బద్దలుకొట్టే అవకాశం ఉంది. ఈసారి ఆసియా కప్‌ ప్రసార హక్కులు …

Read More »

‘ఖాకీ’ రూపంలో వెంకన్న.. భక్తుడి ప్రాణం భద్రం

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండపై శుక్రవారం అద్భుతమే జరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు గుండెపోటుతో కుప్పకూలిపోగా… అది గమనించిన ఓ కానిస్టేబుల్ ఆయనకు సీపీఆర్, ఫస్ట్ ఎయిడ్ చేసి బతికించారు. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా వెంకన్నే కానిస్టేబుల్ రూపంలో వచ్చి… తన దర్శనం కోసం వచ్చిన భక్తుడి ప్రాణాలను కాపాడారని స్వామి వారికి గోవింద నామ స్మరణలు చేశారు. ఈ ఆసక్తికర ఘటన కాస్తంత ఆలస్యంగా …

Read More »