భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతోంది. 2019లో బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.6,000 కోట్ల నిధి.. ఐదు సంవత్సరాల్లో మూడింతలు పెరిగి రూ.20,686 కోట్లకు చేరింది. క్రికెట్ ఆడకపోయినా, క్రికెట్ చుట్టూ తిరిగే వ్యాపారాలు బీసీసీఐని నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బోర్డు 1,623 కోట్ల లాభం ఆర్జించింది. ఇది ముందు లాభం అయిన 1,167 కోట్లతో పోలిస్తే గణనీయమైన …
Read More »గణపతి ‘లడ్డూ’ పాటలకు.. ‘ఈడీ’ బ్యాండు!
దేశవ్యాప్తంగా వినాయకచవితి ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. ఆదివారం.. చంద్రగ్రహణం ఉండడంతో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన గణపతి పందిళ్ల నుంచి విఘ్ననాయకులు.. నిమజ్జనానికి కదిలారు. శనివారం సాయంత్రం నాటికి దాదాపు దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ.. నిమజ్జన ఘట్టాలు ముగియనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద వినాయకుడు ఖరతాబాద్ గణపతి నిమజ్జనం శనివారం మధ్యాహ్నం ముగిసింది. ఇలా.. దేశవ్యాప్తంగా గణపతి భక్తులు భక్తిలో ఓలలాడుతున్నారు. ఇదేసమయంలో గణపతి ఉత్సవాల …
Read More »ఎర్రకోటలో భారీ చోరీ?
దేశంలోనే ప్రతిష్టాత్మక వారసత్వ కట్టడం.. ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగే.. ఎర్ర కోటలో భారీ దొంగతనం జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే.. ఎర్రకోటలో ఇలా చోరీ జరగడం ఇదే తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు. దొంగను గుర్తించామని.. ఉత్తరాది రాష్ట్రాల్లోని ఆలయాల్లో తరచుగా దొంగతనాలకు పాల్పడే వ్యక్తే ఎర్రకోటలోనూ చోరీ చేసినట్టు తెలిపారు. దొంగ కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిశితంగా …
Read More »GST కొత్త రూల్స్.. మధ్యతరగతికి ఊరట, ప్రభుత్వానికి టెన్షన్?
భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. ఈసారి ప్రధాన ఎజెండా.. జీఎస్టీ స్లాబ్‌లను సరళీకరించడం. ఇప్పటివరకు ఉన్న 5%, 12%, 18%, 28% స్లాబ్‌ల బదులుగా కేవలం రెండు రేట్లే ఉండేలా ప్రతిపాదన వచ్చింది. అంటే, 5% – 18% మాత్రమే ఉండి, ఎక్కువ శాతం వస్తువులు ఈ రెండు కేటగిరీల్లోకి వస్తాయి. ఇకపోతే, …
Read More »అశ్విన్ @క్రికెట్ ఆస్ట్రేలియా.. ఏంటీ మ్యాటర్?
భారత క్రికెట్‌లో స్పిన్ మాస్టర్‌గా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు మరో ప్రయాణం వైపు చూడబోతున్నాడన్న చర్చ మొదలైంది. ఐపీఎల్‌కి గుడ్‌బై చెప్పిన కొద్ది రోజుల్లోనే అతను విదేశీ లీగ్ వైపు అడుగులు వేస్తాడన్న వార్తలు బయటకు రావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈసారి టార్గెట్ ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బ్యాష్ లీగ్ (BBL) అని టాక్ వస్తోంది. 38 ఏళ్ల వయసులో కూడా క్రికెట్‌పై ఉన్న ప్యాషన్ …
Read More »ఆఫ్ఘాన్ భూకంపం.. ఇండియా నుంచి 21 టన్నుల సహాయం
ఆఫ్ఘాన్ భూకంపం మళ్లీ ప్రపంచాన్ని కదిలించింది. ఆదివారం రాత్రి 6.3 తీవ్రతతో వచ్చిన భూకంపం 1,400 మందికి పైగా ప్రాణాలు బలిగొనగా 3,000 మందికి పైగా గాయపడ్డారు. ఇళ్లన్నీ కూలిపోవడంతో వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఈ పరిస్థితిలో భారత్ సహాయ హస్తం చాపింది. మంగళవారం ప్రత్యేకంగా సేకరించిన 21 టన్నుల సహాయ సామగ్రిని విమానాల ద్వారా కాబూల్‌కు పంపింది. ఈ సహాయ సరుకుల్లో దుప్పట్లు, టెంట్లు, హైజీన్ కిట్లు, నీటి …
Read More »స్పాన్సర్ రేసులో కఠిన నిబంధనలు.. బీసీసీఐ బిగ్ చెక్!
క్రికెట్ స్పాన్సర్‌షిప్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్11తో ఒప్పందం ముగిసిన నేపథ్యంలో, బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం టెండర్లు ఆహ్వానించింది. బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం, మద్యం, పొగాకు, ఆన్‌లైన్ బెట్టింగ్, గాంబ్లింగ్, క్రిప్టోకరెన్సీ, అశ్లీల కంటెంట్ మీడియా వంటి రంగాల్లో ఉన్న సంస్థలకు అవకాశం లేదు. పబ్లిక్ మోరల్స్‌కి విరుద్ధంగా ఉన్న ఏదైనా బ్రాండ్ కూడా నిషేధిత జాబితాలోకి వెళ్ళినట్లే. …
Read More »చైనాను నమ్మొచ్చా… మోదీ ప్లాన్ ఏంటీ?
భారత్ – చైనా సంబంధాలు ఎప్పుడూ సంక్లిష్టంగానే ఉంటాయి. పొరుగు దేశాలైన ఇరు దేశాలు భౌగోళికంగా, ఆర్థికంగా విడదీయరాని సంబంధం కలిగి ఉన్నా, సరిహద్దు ఉద్రిక్తతలు తరచూ సమస్యగా మారాయి. గల్వాన్ ఘర్షణ తర్వాత ఏర్పడిన అవిశ్వాసం ఇంకా పూర్తిగా తొలగలేదు. అయినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ ఏడేళ్ల విరామం తర్వాత చైనా పర్యటన చేయడం, షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశంలో పాల్గొనడం కీలక పరిణామంగా భావిస్తున్నారు. చైనా …
Read More »రోహిత్ బ్రోంకో టెస్ట్.. రిటైర్మెంట్ వార్తలకు చెక్!
భారత క్రికెట్ జట్టు సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ మరోసారి తన ఫిట్‌నెస్‌తో అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. తాజాగా బీసీసీఐ పరిచయం చేసిన కొత్త బ్రోంకో టెస్ట్లో పాల్గొన్న ఆయన ఫలితం బయటకు వచ్చింది. ఈ టెస్ట్‌లో రోహిత్ కేవలం పాస్ అవ్వడమే కాకుండా, తన ప్రదర్శనతో అక్కడి కోచింగ్ స్టాఫ్‌ను కూడా మెప్పించాడని సమాచారం. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆగస్టు 30, 31 తేదీల్లో ఆటగాళ్లందరికీ …
Read More »ప్రో కబడ్డీ: మూడో రోజే మొదలైన రగడ
ప్రో కబడ్డీ లీగ్ 2025 మూడో రోజునే రగడ మొదలైంది. బెంగాల్ వారియర్స్ కెప్టెన్ దేవాంక్ దలాల్ తన సూపర్ రైడ్‌లతో 21 పాయింట్లు సాధించి జట్టుకు 54-44తో గెలుపు అందించాడు. కానీ ఈ మ్యాచ్‌లో చివరి క్షణాల్లో ఆయన చేసిన సంబరాలు చర్చనీయాంశం అయ్యాయి. హరియాణా స్టీలర్స్ కోచ్ మన్‌ప్రీత్ సింగ్ వైపు మీసం తిప్పి, తొడ కొట్టి చూపించడం కబడ్డీ అభిమానులందరినీ కట్టిపడేసింది. మ్యాచ్ చివరి రైడ్ …
Read More »చావు వార్తలపై ట్రంప్ చల్లటి కబురు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఎప్పటికప్పుడు ఊహించని వార్తలు వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో రీసెంట్ గా #TrumpIsDead అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవ్వడంతో ఆయన ఆరోగ్యంపై అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. వాషింగ్టన్ డీసీలో గత వారం వైట్ హౌస్ షెడ్యూల్ ఖాళీగా ప్రకటించడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. అయితే ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి, తాను ఎప్పుడూ లేనంత ఆరోగ్యంగా ఉన్నానని వ్యాఖ్యానిస్తూ అన్ని …
Read More »బ్యాంకు డబ్బుతో బెట్టింగ్ ఆడిన క్యాషియర్, చివరికి…
లక్కీ భాస్కర్ సినిమాలో క్యాషియర్ గా ఉండే హీరో బ్యాంక్ సొమ్ముతో అక్రమ వ్యాపారం చేసి కోటీశ్వరుడిగా మారిపోతాడు. రాంగ్ రూట్లోనే తెలివిగా డబ్బు సంపాదించి మ్యానేజ్ చేస్తూ అత్యాశకు పోతాడు. ఇక చివరికి విదేశాలకు వెళ్లి కథానాయకుడిగా గెలుస్తాడు. కానీ రియల్ లైఫ్ లో ఎప్పటికైనా అలాంటివి ప్రమాదమే అని నిరూపించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రీసెంట్ గా ఓకే బ్యాంక్ ఉద్యోగి కూడా లక్కీ భాస్కర్ రేంజ్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates