ఒకప్పుడు తన పెంపుడు కుక్కను వాకింగ్ చేయించడం కోసం ఏకంగా క్రీడాకారులను స్టేడియం నుంచి బయటకు పంపించిన ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ గుర్తున్నారా? అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఇప్పుడు మళ్లీ ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) కొత్త కమిషనర్‌గా ఆయనను నియమిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2022లో ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో అథ్లెట్లు …
Read More »న్యూజిలాండ్ లో ఒక్కడు… RCB ఫుల్ హ్యాపీ!
నాగ్‌పూర్ వేదికగా జరిగిన మొదటి టీ20లో టీమిండియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించి 238 పరుగులు బాదినా, న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫీ మాత్రం తన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. సిరీస్‌లో మొదటి విజయం భారత్‌దే అయినా, బౌలింగ్‌లో మాత్రం డఫీ తన మార్క్ చూపించాడు. కేవలం 27 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టడం ద్వారా, బ్యాటర్ల స్వర్గధామం లాంటి పిచ్‌పై కూడా తనేంటో నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో డఫీ …
Read More »70 ఏళ్ల వయసులో వైరల్ వ్లాగ్: 3 రోజుల్లో 3 కోట్లు
సోషల్ మీడియాలో సక్సెస్ అవ్వడానికి వయసుతో సంబంధం లేదని ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వినోద్ కుమార్ శర్మ నిరూపించారు. 70 ఏళ్ల వయసులో సరదాగా చేసిన మొదటి వ్లాగ్ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన కేవలం 72 గంటల్లోనే ఈ వీడియోకు దాదాపు 3 కోట్ల వ్యూస్ రావడం విశేషం. ఎటువంటి అనుభవం లేకపోయినా, ఆయన చూపించిన నిజాయితీ నెటిజన్ల మనసు గెలుచుకుంది. రిటైర్మెంట్ తర్వాత ఖాళీగా ఉండకుండా …
Read More »లోయలో పడ్డ ఆర్మీ వాహనం… 10 మంది జవాన్లు మృతి
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత సైనికులు ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి 200 అడుగుల లోతైన లోయలో పడిపోవడంతో 10 మంది జవాన్లు మరణించారు. ఈ ఘటన భదర్వా ప్రాంతంలోని ఖన్నీ టాప్ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 10 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. సైనిక వాహనం ఎత్తైన ప్రాంతంలోని పోస్ట్ వైపు వెళ్తుండగా, భదర్వా-చంబా అంతర్రాష్ట్ర రహదారిపై …
Read More »భర్తను చంపి.. ఆపై అలాంటి వీడియోలతో కాలక్షేపం!
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో ఒక భార్య చేసిన ఘాతుకం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రియుడితో తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో భర్తను అత్యంత క్రూరంగా అంతమొందించింది. భర్త చనిపోయిన తర్వాత ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా రాత్రంతా పో**ర్న్ వీడియోలు చూస్తూ గడిపిన ఆమె తీరు పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. చిలువూరుకు చెందిన లోకం శివనాగరాజుకు, లక్ష్మీమాధురికి …
Read More »ఇలా అయితే ఎలక్ట్రిక్ బైక్స్ ఎవరైనా కొంటారా?
ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు, బైకులు, మోపెడ్‌లు మార్కెట్లో రకరకాల ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. సంప్రదాయ ఇంధన వనరులైన పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఆ డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూ ఓలా వంటి ప్రముఖ కంపెనీలు కూడా ఈ బైక్‌లను తయారు చేశాయి. కానీ తన బ్రాండ్ ఇమేజ్‌ను ఈ బైకుల విషయంలో ఓలా నిలబెట్టుకోలేకపోయింది. ఓలా బైకులకు సర్వీస్ …
Read More »రఫ్ఫ్ ఆడించేసిన భారత్
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ ఓటమి నుంచి టీమిండియా త్వరగానే కోలుకుంది. జనవరి 21న నాగ్‌పూర్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో కివీస్‌ను చిత్తు చేసి, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో బోణి కొట్టింది. అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్, అర్ష్‌దీప్ సింగ్ పదునైన బౌలింగ్‌తో భారత్ 47 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి …
Read More »‘చనిపోయిన తర్వాత కూడా వదలవా…’ చిన్మయికి కౌంటర్!
కేరళలో జరిగిన దీపక్ ఆత్మహత్య ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన ఆరోపణల వల్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సింగర్ చిన్మయి శ్రీపాద చేసిన ఒక పోస్ట్, దానికి నటి కస్తూరి ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. డెహ్రాడూన్‌లో ఒక మహిళను వేధించిన వ్యక్తి అరెస్టయిన వార్తను షేర్ చేస్తూ.. …
Read More »ప్రపంచ కుబేరులు… రాజకీయాలను శాసిస్తున్నారు
ప్రపంచవ్యాప్తంగా ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు. చరిత్రలో తొలిసారిగా ప్రపంచ బిలియనీర్ల సంఖ్య 3,000 మార్క్‌ను దాటేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలోని టాప్ 12 బిలియనీర్ల దగ్గర ఉన్న సంపద, భూమిపై ఉన్న సగం జనాభా, అంటే సుమారు 400 కోట్ల మంది దగ్గర ఉన్న దానికంటే ఎక్కువ. ఆక్స్ ఫామ్ (Oxfam) ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ షాకింగ్ నిజాలను వెల్లడించింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా …
Read More »కేరళ బస్సుల్లో మగవారి ప్రయాణం చూసారా…
కేరళ రాష్ట్రంలో ఇప్పుడొక వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీపక్ అనే 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం అక్కడ పెను దుమారం రేపుతోంది. ఒక మహిళ అకారణంగా తన మీద నింద వేసి, మానసిక క్షోభకు గురి చేయడం అతడి ఆత్మహత్యకు కారణంగా చెబుతున్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహంతో కేరళలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న పురుషులందరూ విచిత్ర రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అక్కడ …
Read More »భారత విద్యార్థులకు పీడకలగా మారుతోన్న మరో దేశం
ఒకప్పుడు ఉన్నత విద్యకు, కెరీర్‌కు స్వర్గధామంగా కనిపించిన ఐర్లాండ్, ప్రస్తుతం భారతీయ విద్యార్థుల పాలిట పెను సవాలుగా మారింది. అమెరికా, యూకే వంటి దేశాల్లో వీసా నిబంధనలు కఠినతరం కావడంతో చాలామంది ఐర్లాండ్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. గత ఏడాది భారతీయ విద్యార్థుల నమోదులో 30 శాతం పెరుగుదల కనిపించినప్పటికీ, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎదురవుతున్న కఠిన వాస్తవాలు వారిని కుంగదీస్తున్నాయి. ప్రధానంగా ఉద్యోగ మార్కెట్ సంక్షోభం, వీసా స్పాన్సర్‌షిప్ దొరకకపోవడం, …
Read More »ఆ కుక్కలను నేను పెంచుకుంటా: రేణు దేశాయ్
వీధి శునకాలను అకారణంగా చంపుతున్నారని నటి రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ ఆమె ఘాటుగా విమర్శలు చేశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కుక్కల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి వాటిని చంపడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనాల తయారీ కంపెనీలను మూసేస్తున్నారా? దోమ కాటుతో మరణాలు జరుగుతున్నాయని దోమలన్నిటినీ చంపేస్తారా? …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates