పార్టీని బలోపేతం చేసే విషయంలో రాహూల్ గాంధీకి ఇప్పటికైనా జ్ఞానోదయం అయినట్లుంది. అన్నీ రాష్ట్రాల్లో పార్టీని పరుగులు పెట్టించాలని డిసైడ్ అయ్యారట. పంజాబ్ లో అమరీందర్-సిద్ధూ మధ్య విభేదాలను పరిష్కరించిన పద్దతిలోనే రాజస్ధాన్ వ్యవహారాన్ని కూడా రాహూల్ డైరెక్టుగా డీల్ చేయబోతున్నట్లు ప్రచారం మొదలైంది. ఈనెలాఖరులో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్-కీలక నేత సచిన్ పైలెట్ తో భేటి అవ్వాలని రాహూల్ నిర్ణయించుకున్నారట. దీంతో సుదీర్ఘంగా ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు …
Read More »ఎంఐఎంకు అంత సీనుందా ?
తనను తాను ఎంఐఎం పార్టీ చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నట్లుంది. వచ్చే ఏడాది మొదట్లోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో గెలుపు ఇటు సమాజ్ వాది పార్టీ (ఎస్పీ) అటు బహుజన్ సమాజ్ వాదిపార్టీ (బీఎస్పీ)లకు చాలా కీలకంగా మారింది. ఇందుకనే చిన్నా చితకా పార్టీలతో పోటీపడితే ఓట్లు చీలోతాయనే టెన్షన్ పై రెండుపార్టీల్లో పెరిగిపోతోంది. దీన్ని చిన్నాపర్టీలు బాగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయి. ఎస్పీ నేతలతో పొత్తు చర్చలు …
Read More »మోత్కుపల్లి ఇక్కడైనా సర్దుకుంటాడా ?
ఈయన ఒకపుడు ఫైర్ బ్రాండ్ నేతగా పాపులరయ్యారు. అయితే కాలక్రమంలో పరిస్ధితుల ప్రభావం కారణంగా ఎవరికీ కాకుండా పోయారు. అందుకనే సంవత్సరాలుగా అనామకంగా ఉండిపోయారు. అయితే ఇపుడు అధికార టీఆర్ఎస్ లో చేరటం ద్వారా పూర్వవైభవాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఈయనే సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు. తన వ్యూహాన్ని అమలు చేయటంలో భాగంగానే బీజేపీకి మూడు రోజుల క్రితమే రాజీనామా కూడా ఇచ్చేశారు. మోత్కుపల్లిది మొదటి నుండి విచిత్రమైన వ్యవహార …
Read More »ఏడుస్తూ రాజీనామా చేసిన సీఎం
కర్ణాటక సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర నాయకత్వం సూచన మేరకు ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న ఆయనను రాజీనామా చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం కోరినట్లు తెలుస్తోంది. సీఎంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజునే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. సాయంత్రం నాలుగు గంటలకు యడ్యూరప్ప గవర్నర్ కు తన రాజీనామా లేఖను ఇవ్వనున్నారు. ఈ …
Read More »పవన్ సత్తా తేలిపోయిందా ?
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సత్తా ఏమిటో తేలిపోయిందా ? తాజాగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అందరిలోను ఇదే సందేహం పెరిగిపోతోంది. ఎందుకంటే ఉభయగోదావరి జిల్లాల్లో కాపుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని, జనసేనకు ఈ రెండు జిల్లాల్లో మంచి పట్టుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైసీపీ దెబ్బకు జనసేన తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. రెండు జిల్లాల్లో కలిపి 34 …
Read More »ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కాంగ్రెస్ వల ఫలిస్తుందా?
మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మునుపెన్నడూ లేని రీతిలో గత కొద్దికాలంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన పలు సంచలన ప్రకటనలు చేస్తున్నారు. అయితే, ఆయన పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతుందన్న చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే తెలగాణలో బలపడాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రవీణ్ కుమార్‌కు వల వేస్తోంది. …
Read More »సీఎం జగన్ ను ఢిల్లీకి రమ్మంటూ ఫోన్ కాల్?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనూహ్యంగా ఢిల్లీ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లుగా చెబుతున్నారు. రాష్ట్రం ఎదుర్కొనే సమస్యలు.. దాని పరిష్కారం కోసం అదే పనిగా సంప్రదింపులు జరిపినా.. సానుకూల స్పందన అంతగా ఉండని కేంద్రం నుంచి తాజాగా వచ్చిన ఫోన్ కాల్ తెలుగు రాజకీయ వర్గాల్లో చర్చకు తెర తీస్తుందని చెప్పాలి. మోడీ మాష్టారు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాష్ట్రాలకు.. కేంద్రానికి మధ్యకాస్త గ్యాప్ …
Read More »రేవంత్ కుర్రోడేనా..!
రేవంత్ ని పీసీసీ చీఫ్ పదవిని కలిపి చూడలేకపోతున్నారుట. రేవంత్ పక్కా జూనియర్ అని కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూచిక పుల్లను తీసేసినట్లుగా పక్కన పెట్టేశారు. ఇక రేవంత్ రెడ్డికి అనేక మైనసులు ఉన్నాయి. వాటిలో చంద్రబాబు అనుంగు శిష్యుడు అని పెద్ద ట్యాగే ఉంది. చంద్రబాబు మాట మీద ఓటుకు నోటుకు కేసులో దూరి అడ్డంగా ఇరుక్కున్న చరిత్ర ఉంది. మరో వైపు తనలో టీడీపీ …
Read More »‘జాతీయ గీతం’ సరే.. ‘జనగీతం’ వినండి మోడీ జీ.. నెటిజన్ల ఫైర్
తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. దేశ ప్రజలను ఉద్దేశించి.. మన్‌కీ బాత్ కార్యక్రమం నిర్వహించారు. తన మనసులోని భావాలను ప్రజలకు పంచుకునే ఈ కార్యక్రమం ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రతిసారిలాగే.. ఈ దఫా కూడా మోడీ.. తన మనసులోని మాటలే చెప్పారు తప్ప.. ప్రజల మనసుల్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయలే కపోయారనేది విశ్లేషకుల మాట. మరీ ముఖ్యంగా గడిచిన నెలకు, …
Read More »ఈ సారి పవన్ పై డమ్మీ అభ్యర్ధులే..
రాజకీయాల్లో పుంజుకోవాలంటే.. వ్యూహాలు మార్చుకోవాల్సిందే. పిడివాదాలకు పోతే.. పరిస్థితులు తల్లకిందులైన పరిస్థితి గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ మినహా అన్ని పార్టీలూ చవిచూశాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాయి. మరీ ముఖ్యంగా ఎన్నో ఆశలతో.. అధికారం అందేసుకోవడం.. ఖాయమనే అంచనాలతో ఎన్నికల రంగంలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఘోరంగా ఓడిపోయారు. 175 నియోజక వర్గాలో బీఎస్పీ, కమ్యూనిస్టులతో పొత్తు …
Read More »కల్వకుంట్ల చంద్రశేఖర్ రావా మజాకానా?
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావా మజాకానా? అధికారాన్ని సొంతం చేసుకోవటానికి ఏళ్లకు ఏళ్లుగా ప్లానింగ్ చేసి.. తాను అనుకున్నట్లుగా పవర్ ను అరచేతిలోకి తీసుకున్న ఆయన.. దాన్నిఅంత తేలిగ్గా వదులుకుంటారా? అధికారాన్ని చేజిక్కించుకోవటానికి పవర్ లేనప్పుడు ఎంతో ప్రయత్నించిన ఆయన.. చేతినిండా పవర్ ఉన్నప్పుడు అధికారాన్ని తాను అనుకున్నంత కాలం తన వద్దే నిలుపుకోవటానికి దేనికైనా సిద్దమవుతారు. స్వతంత్ర భారతంలో సర్వాధికారాలున్న కేంద్ర ప్రభుత్వం సైతం చేయని సంచలన ప్రకటనను తెలంగాణ …
Read More »జగన్ కీలక స్వప్నం వెనక్కేనా? జగన్ వ్యూహం ఏంటి?
రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. నెల నెలా ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకే ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకే నిధులు సరిపోక.. ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కీలకమైన మరిన్ని హామీల విషయం ఏంటి? మరీ ముఖ్యంగా పాదయాత్ర సమయంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం ఎలా? వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర స్వరూపాన్ని మార్చుతామన్న హామీని ఎలా నిలబెట్టుకోవాలనే విషయాలపై వైసీపీ …
Read More »