ఏపీలో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మధ్య రాజకీయాలు మరింత ముదురుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం.. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే.. దీనికి కౌంటర్‌గా.. టీడీపీ ” ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాదూ” అంటూ టీడీపీ పోస్టర్ విడుదల చేసింది. ఇది.. రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఈ మధ్య వీధుల్లో సంచులు వేసుకొని వైసీపీ భజన బృందo తిరుగుతోందని, సంచుల్లో ఉన్న స్టిక్కర్ తీసి ప్రతి ఇంటికి వాళ్లే అంటించుకుంటున్నారని విమర్శించారు.
జగన్ తమ భవిష్యత్తు అని ప్రజలు చెప్పుకోవాలి కానీ స్టిక్కర్లు అంటించుకోవడమేంటని ప్రశ్నించారు.సీఎం జగన్ స్టిక్కర్ పథకానికి నాంది పలికారని, ‘జగన్ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం’ అనే స్టిక్కర్లు వేసే రోజు దగ్గరలోనే ఉందని అనిత అన్నారు. జగన్ మాట తప్పరు, మడమ తిప్పరు అంటే నాలుక కోస్తారన్నారు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కొడుకు కాకపోతే ఆయనకు ఏమీ లేదని.. ఏ తల్లి ఇలాంటి బిడ్డను కనకూడదని చూపించడానికి బెస్ట్ ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. సొంత తల్లినే గౌరవించని వ్యక్తని దుయ్యబట్టారు.
ఓటును గుర్తించారు.. బాబాయి హంతకుడిని గుర్తించలేదా?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు గోడల మధ్య వేరొకరు ఓటు వేస్తేనే తెలిసిపోయింది.. మరి బాబాయి వైఎస్ వివేకను చంపింది ఎవరో ఇప్పటికీ జగన్ తెలుసుకోలేకపోయారా? అని టీడీపీ నాయకురాలు అనిత ప్రశ్నించారు. ఎవరు ఎన్ని చెప్పినా.. చంద్రబాబు సీఎం అవ్వడం ఖాయమని వంగలపూడి అనిత ఆశాభావం వ్యక్తం చేశారు. ‘జగనన్న, మా భవిష్యత్తు కాదు.. జగనే మా దరిద్రం’ అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. సంక్షేమంపై డబ్బులు పంచడం జరిగిందని.. అభివృద్ధి లేదని విమర్శించా రు. అభివృద్ధి లేక ఉపాధి లేక యువత గంజాయికి బానిసలు అవుతున్నారని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates