అమ్ముతున్నారు.. జ‌య‌ల‌లిత ఆస్తులు కొంటారా!!

జీవిత‌కాలం ఎంతో ఉన్న‌తంగా బ‌తికి.. త‌మిళ‌నాడును శాసించిన దివంగ‌త ముఖ్య‌మంత్రి.. అన్నాడీఎంకే నేత‌ల అమ్మ‌.. జ‌య‌ల‌లిత‌.. చివ‌రి ద‌శ‌లో అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొని..జైలు జీవితం గ‌డిపిన విష‌యం తెలిసిందే. పురుచ్చిత‌లైవిగా.. పేర్గాంచి.. బ‌తికి ఉన్న‌ప్పుడే.. ఆల‌యాలు క‌ట్టించుకునేంత‌ ఎత్తుకు ఎదిగిన జ‌య జీవితంలో అన్నీ స‌స్పెన్సులే! వివాహం.. పిల్ల‌(లు).. ప్రేమాయ‌ణం.. అవినీతి… ఆఖ‌రుకు మ‌ర‌ణం కూడా.. అంతా మిస్ట‌రీగానే ముగిశాయి.

ఇక‌, ఆమె జీవితంలో కీల‌క మ‌లుపుగా మారి… జైలుకు వెళ్లే దుస్థితిని క‌ల్పించిన‌ అవినీతి అంతా ఇంతా కాదు. అప్ప‌ట్లో జ‌య అక్ర‌మార్జ‌న గురించి.. పేప‌ర్లు ప్ర‌త్యేక ఎడిష‌న్లు వేసిన సంద‌ర్భాలు ఉన్నాయంటే.. ఆశ్చ‌ర్యం అనిపించ‌క‌మాన‌దు. ఈ కేసును ప్ర‌భావితం చేస్తున్నారంటూ.. ఏకంగా.. త‌మిళ‌నాడు రాష్ట్రం నుంచి క‌ర్ణాట‌క‌కు త‌ర‌లించారు. ఇక్క‌డే జ‌య కేసులో తీర్పురావ‌డం.. ఆమె జైలుకు కూడా వెళ్ల‌డం తెలిసిందే.

అయితే.. అక్రమార్జన కేసులో జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న చరాస్తుల్ని విక్రయించేందుకు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించి లావాదేవీలు చేసేందుకు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా న్యాయవాది కిరణ్‌ ఎస్‌ జావలిని బొమ్మై ప్రభుత్వం నియమించింది. సాక్ష్యాల రూపంలో 1996లో చెన్నైలోని జయ నివాసం నుంచి స్వాధీనపరచుకున్న వస్తువులన్నీ ప్రస్తుతం కర్ణాటక స‌ర్కారు ఆధీనంలో ఉన్నాయి. మ‌రి వీటిని కొనుగోలు చేయాల‌ని భావించేవారు.. ప్ర‌త్యేక ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో పేరు న‌మోదు చేసుకుని.. వేలంలో పాల్గొన‌వ‌చ్చు.

వేలం వేసే జ‌య‌ అక్ర‌మార్జ‌న ఇదీ..

  • 7 కిలోల బంగారం
  • 9 కిలోల వజ్రాభరణాలు
  • 600 కిలోల వెండి ఆభరణాలు
  • 11 వేలకు పైగా ప‌ట్టు చీరలు
  • 750 జతల పాదరక్షలు
  • 250 జ‌త‌ల బూట్లు
  • 91 ఖ‌రీదైన విదేశీ చేతి గడియారాలు
  • 131 విదేశీ సూట్‌ కేసులు
  • 1,040 ఏసీలు
  • 200 ఫ్రిజ్‌లు
  • 2000 ఫ్యాన్లు