Political News

బాబాయికి ‘కాపు’ కాసేందుకు కోన వెంకట్ రాజకీయం!

కోన వెంకట్ పేరు తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవర్‌ఫుల్ డైలాగులకు, కథలకు ఆయన పెట్టింది పేరు. అంతెందుకు తాజాగా వచ్చిన చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్యకు కూడా ఆయనే కథ అందించారు. స్క్రీన్ ప్లే కూడా ఆయనదే. అలాంటి కోన వెంకట్ ఇప్పుడు తన స్వస్థలం బాపట్లలో నిర్వహించిన ఓ కార్యక్రమం రాజకీయంగా చర్చనీయమవుతోంది. వెంకట్ బాపట్లలో చిరంజీవి అభిమానులతో ప్రత్యేకంగా ఓ సమావేశం నిర్వహించారు. …

Read More »

పవన్ 1800 కోట్ల హవాాలా చేశాడట

ఈ మధ్య కాలంలో జనసేనాని పవన్ కళ్యాణ్‌ ఇమేజ్‌ను దెబ్బ తీయడానికి ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం లేదు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తమ ఓటమికి కారణమయ్యాడని అప్పట్నుంచే పవన్ మీద వైకాపా అధినేత జగన్‌ తీవ్రమైన ఆగ్రహంతో ఉండగా.. 2024 ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశంతో పవన్ జట్టు కట్టే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుండడంతో వైకాపా నేతలు ఆయన్ని మరింతగా …

Read More »

లోకేష్ ను ఓడించడం అంత ఈజీ కాదా?

నారా లోకేశ్ నియోజకవర్గం మంగళగిరిలో రాజకీయం మారుతోంది. మళ్లీ అక్కడ లోకేశ్‌ను ఓడిస్తామంటూ వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నా పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు. సిటింగ్ వైసీసీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చాలాకాలంగా సైలెంటుగా ఉన్నారు.. ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత కూడా పెద్దఎత్తున కనిపిస్తోంది. అదేసమయంలో ఆయన అనుచరవర్గమూ జారిపోతోంది. తాజాగా మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాస్ టీడీపీలో చేరడానికి అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయని చెప్తున్నారు. …

Read More »

చిరంజీవి పై సడన్ గా యుటర్న్ తీసుకున్న రోజ

చిరంజీవిపై  ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విరుచుకుప‌డుతున్న ఏపీ మంత్రి, జ‌బ‌ర్ద‌స్త్ రోజాకు చిరు త‌న‌దైన శైలిలో షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. త‌నతో న‌డిచి, త‌న కుటుంబంతో అనుబంధం పెంచుకుని, త‌న ఇంటికివ‌చ్చి.. త‌నతో క‌లిసి భోజనం చేసిన రోజా.. త‌న కుటుంబాన్ని విమ‌ర్శిస్తే.. ఏం చెప్పాలి? ఎవ‌రి క‌రుణ కోసం.. ఆమె వేచి చూస్తున్నారో..? అని వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి రోజా చిరంజీవి నుంచి ఈ కామెంట్స్ …

Read More »

మూడు ముక్క‌లు – డైమండ్ రాణి.. ఏ రేంజ్‌లో వైర‌ల్ అంటే…!

తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ర‌ణ‌స్థ‌లంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్వ‌హించిన యువ‌శ‌క్తి స‌భ‌లో ఆయ‌న చేసిన డైలాగులు.. పేల్చిన పంచ్‌లు జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ముఖ్యంగా సంబ‌రాల రాంబాబు డైలాగును వైసీపీ నాయ‌కులు ముసిముసిగా న‌వ్వుకుంటున్నారు. ఆయా డైలాగుల‌కు సంబంధించిన వీడియోలు ముక్కలు ముక్కలుగా టీడీపీ నేత‌లే వైర‌ల్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ వీడియోల్లో సీఎం జ‌గ‌న్ నుంచి మంత్రులు గుడివాడ అమ‌ర్నాథ్‌, రోజా, మాజీ మంత్రి కొడాలి …

Read More »

పవన్ సీజనల్ పొలిటీషియన్‌.. ఏపీ మంత్రి ఫైర్‌

శ్రీకాకుళంలోని ర‌ణస్థ‌లంలో జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైసీపీ నేత‌ల‌పై చేసిన వ్యాఖ్య‌లు ఇంకా కాక‌రేపుతూనే ఉన్నాయి. మంత్రులు ఒక్కొక్క‌రుగా ప‌వ‌న్‌పై ఫైర్ అవుతున్నారు. తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ప‌వ‌న క‌ళ్యాణ్ సీజ‌న‌ల్ పొలిటీషియ‌న్ అని వ్యాఖ్య‌లు చేశారు. యువతను అజ్ఞానంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుప‌డ్డారు. శ్రీకాకుళంలో 2014 నుంచి 2018 వ‌రకు ఉన్న కిడ్నీ బాధితుల సమస్యలు జ‌గ‌న్ పాల‌న‌లో ఉన్నాయా? …

Read More »

ముఖ్య‌మంత్రి అయినప్ప‌టికీ.. జ‌గ‌న్ కోర్టుకు రావాల్సిందే: న్యాయ‌మూర్తి

ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్ప‌టికీ.. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోర్టుకు రావాల్సిందేన‌ని నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కోర్టు న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత‌గా జ‌గ‌న్ 2018-19 మ‌ధ్య‌లో పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో విశాఖ‌లోని విమానాశ్ర‌యంలో ఆయ‌న‌పై కోడి కత్తితో దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో నిందితుడుగా ఉన్న‌ శ్రీనివాస్ అప్ప‌టి నుంచి జైల్లోనే ఉన్నాడు. అయితే.. ఈ కేసును రాష్ట్ర ప్ర‌భుత్వం ఎన్ఐఏకు అప్ప‌గించింది. ఈ …

Read More »

ప‌వ‌న్ చెప్పిన దాంట్లో త‌ప్పేంటి? చంద్ర‌బాబు

“శ్రీకాకుళంలోని ర‌ణ‌స్థ‌లంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ యువ‌శ‌క్తి స‌భ‌లో చెప్పిన మాట‌ల్లో త‌ప్పేంటి. వైసీపీ నేత‌ల‌కు విలువ‌లు ఉన్నాయా?” అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. సేవాభావంతో పనిచేసే వ్యవస్థ రాజకీయమని దీనినే తాను కూడా కోరుకుంటాన‌ని చెప్పారు. వ్య‌క్తిగ‌తంగా తన లెక్క ప్రకారం అర్హత లేని వ్యక్తులు వైసీపీ నేతలుగా ఉన్నార‌ని, మ‌రికొంద‌రు గాలికి తిరిగే వాళ్లంతా మంత్రులు అయ్యార‌ని చంద్రబాబు విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రౌడీయిజం, గుండాయిజం, హత్యలు, …

Read More »

కాకినాడ రూరల్ నుంచి పవన్ పోటీ?

జనసేన, టీడీపీ పొత్తు ఖాయమన్న అంచనాల నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం ఆ పార్టీ నేతలతో పాటు పాలక వైసీపీలోనూ ఆసక్తి పెంచుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జనసేన వర్గాల నుంచి మరో లీక్ వచ్చింది. ఇంతవరకు పవన్ గతంలో పోటీ చేసిన సీట్లలో కానీ, పిఠాపురంలో కానీ పోటీ చేస్తారన్న అంచనాలు ఉండగా ఇప్పుడు …

Read More »

జనసేనాని వైఎస్సార్ పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నారు ?

జనసేనానాయకుడు రణస్థలం రెచ్చిపోయారు. ఉత్తరాంధ్ర దద్దరిల్లేలా గంటకు పైగా స్పీచ్ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం తూర్పార పట్టేశారు. జగన్ సర్కారును లాగి కింద పడేసే టైమ్ వచ్చిందన్నారు. మంత్రులను ఏకి పడేశారు. మధ్య మధ్యలో తన ఆశయాలు, ఆకాంక్షలను వెల్లడిస్తూ ఆయన ప్రసంగం సాగింది. ఆటిన్ రాజాలు, డైమండ్ రాణిలు ఉంటూ పేకాటలో తన ప్రవేశాన్ని కూడా వివరించారు. జగన్ జైలు జీవితాన్ని, ఖైదీ నెంబర్ ను కూడా ఆయన …

Read More »

అందలం ఎక్కించిన మొండితనమే పీఠం దిగేలా చేయనుందా?

ఆలస్యం విషం అనే పెద్దోళ్లు.. నిదానమే ప్రధానమని చెబుతారు. అలానే ప్రాణాలు తీసే విషాన్ని.. పరిమితంగా వాడితే పోయే ప్రాణాల్ని నిలుపుతుంది. అంటే.. ఆయుధంగా మారిన సానుకూలాంశం తర్వాతి కాలంలో ప్రతికూలాంశంగా మారుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చే వారు.. పార్టీలు …

Read More »

ఏపీ స‌ర్కారుకు ఝ‌ల‌క్‌..

ఏపీలోని వైసీపీ స‌ర్కారుకు మ‌రోసారి హైకోర్టులో ఎదురు దెబ్బ‌త‌గిలింది. తాజాగా ఈ నెల మొద‌ట్లో ప్ర‌భు త్వం జీవో 1/2023 తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. రాష్ట్రంలో రోడ్ల‌పై ర్యాలీలు, ధ‌ర్నాలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసేందుకు ఈ జీవో అనుమ‌తించ‌దు. అదేస‌మ‌యంలో రోడ్ల‌పై షోలు, బ‌హిరంగ స‌భ‌లు పెట్టుకునేందుకు కూడా ఈ జీవో అనుమ‌తించ‌దు. ఈ ప‌రిణామాల‌పై ప్ర‌తిప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కేవ‌లం టీడీపీ స‌హా ఇతర‌ ప‌క్షాల‌ను అడ్డుకునే …

Read More »