వైసీపీ అధినేత సీఎం జగన్ చెప్పిన మాటే వేదంగా నాయకులు ముందుకు కదులుతున్నారని.. సలహాదా రు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఆయన వెంటేనడుస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ప్రారంభించిన నువ్వే మా నమ్మకం జగనన్నా.. కార్యక్రమంలో చాలామంది ఉత్సాహంగా పాల్గొన్నారని ఆయన చెప్పారు. అయితే.. వాస్తవానికి ఎక్కడా ఒకరిద్దరు తప్ప.. మిగిలిన వారంతా కూడా బలవంతంగానే ముందుకు కదిలారనేది వాస్తవం అంటున్నారు పరిశీలరు.
నిన్న మొన్నటి వరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో కొందరు పాల్గొన్నారు..కొందరు పాల్గొనలేదు. అయితే.. అలాంటి వారిని దారికి తెచ్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఇక, ఇప్పుడు తాజాగా ప్రారంభించిన జగనన్నే మా భవిత కార్యక్రమాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. దీనిలోనూ నాయకులు ముందుకు సాగుతున్నారని చెబుతున్నా.. ఆశించిన స్పందన లేదు.
వాస్తవానికి నిన్నటి వరకు గడపగడపకు తిరిగి అలిసిపోయామని.. కొందరు నాయకులు చెప్పారు. అయితే.. ప్రతిపక్షాలు చాలా దూకుడుగా ఉన్నాయని.. ఇప్పుడు మనం పుంజుకోకపోతే.. కష్టమని.. సీఎం జగన్ పదే పదే చెప్పారు. అయినా .. పెద్దగా స్పందన మాత్రం కనిపించడం లేదు. ఇక, గతంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు.
ఇక, ఇప్పుడు గత ప్రభుత్వానికి ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని వివరించే కార్యక్రమం చేపట్టారు. ఇది పార్టీకి మేలు చేస్తుందని.. నాయకులు సమష్టిగా పని చేయాలని సీఎం జగన్ సూచించారు. దీంతో నాయకులు.. ఉదయాన్ని బయటకు వచ్చారు. కానీ, మధ్యాహ్నం ఇంటికే పరిమితమయ్యారు. అదేమంటే ఎండ ఠారెత్తిందని చెప్పుకొచ్చారు.
మరోవైపు.. ప్రత్యేకంగా తయారు చేయించిన సంచీలను భుజాన వేసుకుని.. జగనన్నే మా భవిత నినాదంతో ఉన్న స్టిక్కర్‌ను చూపిస్తూ.. ప్రజలకు పథకాలను వివరించే ప్రయత్నం చేశారు. మంత్రి రోజా సహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా.. తమ తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసినా.. ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. ఈ పరిణామంతో జన్ బలవంతంతోనే ముందుకు కదులుతున్నారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates