రాజకీయాల్లో విభేదాలు.. వివాదాలు.. విమర్శలు అన్నీ కామనే. అయితే.. ఇవన్నీ కూడా రెండు ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతల మధ్య అయితే.. కామన్ అనుకోవచ్చు. కానీ, ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఇప్పటి వరకు ఉన్న పరిస్థితికి భిన్నంగా జరుగుతోందని అంటున్నారు పరిశీలకులు. నెల్లూరు జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ మంత్రి అనిల్ కుమార్‌కు.. మేధావిగా పేరున్న సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి మధ్య వివాదం చెలరేగింది. అయితే.. …
Read More »ఏపీలో బీజేపీ ఎందుకిలా చేస్తోంది?
బీజేపీ నేతల్లో కొందరి వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి బీజేపీ చీఫ్ సోమువీర్రాజు పెద్ద వ్యూహంతోనే ఉన్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని ఆవిష్కరించటమనే చిన్న విషయాన్ని పట్టుకుని బీజేపీ నేతలు అంతర్జాతీయ అంశంగా పాకులాడుతుండటమే విచిత్రంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రొద్దుటూరులో ముస్లిం మైనారిటిల జనాభా ఎక్కువగానే ఉంది. వీళ్ళంతా పట్టణంలో టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని …
Read More »కారులో వచ్చి.. హత్యాయత్నం చేశారట.. ఇదో వింత కేసు గురూ!
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు.. దేవినేని ఉమామహేశ్వరరావుపై కృష్ణాజిల్లా పోలీసులు ఒక చిత్రమైన కేసు నమోదు చేశారు. ఆయన హత్యాయత్నం చేశారట. అది కూడా దాదాపు పాతిక లక్షల కారులో తెల్లటి దుస్తుల్లో వచ్చి.. బహిరంగంగానే వైసీపీ నేతను హత్య చేయాలని ప్లాన్ చేశారట. ఇదీ.. ఏపీ పోలీసులు చేసిన అభియోగం. కాదు.. అటెంప్టివ్ మర్డర్ కేసు కూడా నమోదు చేశారు. నిజానికి అటెంప్టివ్ మర్డర్ కేసంటే.. ఇలా …
Read More »కాంగ్రెస్ లో కోమటిరెడ్డి చిచ్చు – అసలు కారణం షర్మిలేనా?
నల్గొండ జిల్లాలోని మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీలో చిచ్చు సంచలనంగా మారింది. నిరుద్యోగి పాక శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయాలనే డిమాండ్ తో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇపుడు పాక ఆత్మహత్యకు నిరసనగా నల్గొండలో షర్మిల దీక్ష చేశారు. ఈ దీక్షలో ఉన్న షర్మిలకు కోమటిరెడ్డి ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. ఈ విషయమే …
Read More »బీజేపీ కొత్త వ్యూహం అమలు చేస్తోందా ?
త్రిపుర రాష్ట్రం హెడ్ క్వార్టర్స్ అగర్తలలో జరిగిన పరిణామం చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ బృందం అగర్తలలో పర్యటిస్తోంది. ఏదో సర్వే కోసం అగర్తలకు చేరుకున్న బృందం బసచేయటానికి హోటల్లో రూములు తీసుకుంది. విషయం తెలుసుకున్న పోలుసులు వెంటనే హోటల్ కు చేరుకుని వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. కారణం ఏమిటయ్యా అంటే కోవిడ్ సమయంలో 22 మంది …
Read More »ఎంపి విషయంలో రూటుమార్చిన పార్టీ
తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుపై సొంతపార్టీ నేతలు వ్యూహాన్ని మార్చారు. ఇంతకాలం అనర్హతకు మాత్రమే డిమాండ్ చేస్తున్న పార్టీ ఇపుడు అరెస్టుపైన డిమాండ్ మొదలుపెట్టింది. కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌ను కలవటం ఇందులో భాగమే. ఎంపిపై అనర్హత వేటు వేయాలని గడచిన ఏడాదిగా వైసీపీ ఎంపిలు ఇచ్చిన లేఖలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పట్టించుకోలేదు. స్పీకర్ పట్టించుకోలేదు అనేకంటే ప్రధానమంత్రి నరేంద్రమోడి, హోంశాఖ మంత్రి అమిత్ షా నుండి …
Read More »హుజూరాబాద్‌కు పెద్దకష్టం.. సానుభూతా? సంక్షేమమా?
తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలకు పెద్ద సంకటమే వచ్చి పడిందని అంటున్నారు పరిశీలకులు. త్వరలోనే ఇక్కడ ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఈ ఉపపోరు.. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీల మధ్య యుద్ధాన్ని తలపిస్తుండగా.. అదేసమయంలో సానుభూతి-సంక్షేమ పథకాలతో.. ప్రజలు ఎటు మొగ్గు చూపాలనే విషయంపై తర్జన భర్జన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. వరుస విజయాలతో దూసుకుపోతూ.. ఇక్కడి ప్రజలకు తలలోనాలుకగా వ్యవహరిస్తున్న …
Read More »వైసీపీలోకి వచ్చి.. నష్టపోయాం.. తల్లీ కూతుళ్ల ఆవేదన!
వైసీపీ అధికారంలోకి రాగానే.. ఆ పార్టీలోకి చేరిన వారిలో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గానికి చెందిన పి. శమంతక మణి, ఆమె కుమార్తె యామినీ బాల తొలివరుసలో నిలిచారు. ఎస్సీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున గట్టి వాయిస్ వినిపించిన ఈ కుటుంబం.. అనేక పదులు కూడా పొందారు. టీడీపీ అంటే.. శమంతకమణి.. అన్న తరహాలో రాజకీయాలు చేశారు. కాంగ్రెస్ నేతలకు చుక్కలు చూపించారు. ఈ క్రమంలోనే 2014లో యామినీ బాల …
Read More »బద్వేల్‌ను టీడీపీ ఏం చేస్తుంది…?
తిరుపతి పార్లమెంటు స్థానానికి.. అదిగో ఉప ఎన్నిక అనగానే.. ఇదిగో అభ్యర్థి.. అంటూ.. నానా హడావుడి చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. కీలకమైన స్థానంపై మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. పైగా ఇది పార్టీకి.. వ్యక్తిగతంగా తనకు కూడా ప్రతిష్టాత్మకమే అయినప్పటికీ.. ఆయన పెద్దగా రియాక్ట్ కావడం లేదు. అదే.. కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గం. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న వైసీపీ నాయకుడు …
Read More »మంత్రి విస్తరణలో జగన్ వ్యూహం ఇదేనా?
ఏపీ సీఎం జగన్ త్వరలోనే తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఆదిలోనే అంటే.. కేబినెట్ ను ఏర్పాటు చేసుకున్న సమయంలోనే 90 శాతం మంది మంత్రులను రెండున్నరేళ్ల తర్వాత.. మారుస్తానని.. అందరికీ అవకాశం ఇవ్వలేక పోతున్నానని చెప్పుకొచ్చారు. సో.. దీనిని బట్టి రెండున్నరేళ్ల తర్వాత..కేబినెట్ విస్తరణకు జగన్ మొగ్గు చూపకతప్పదు. దీంతో చాలా మంది నాయకులు.. మలివిడత మంత్రి వర్గ విస్తరణపై చాలానే …
Read More »కన్ఫామ్.. బీఎస్పీలోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..!
ఐపీఎస్ మాజీ అధికారి, స్వేరో చీఫఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఆయన బీఎస్పీ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయన బీఎస్పీలో చేరనున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి వెల్లడించినట్లు.. జాతీయ మీడియాలో కథనాలు రావడం గమనార్హం. ఆగస్టు 8న ప్రవీన్ కుమార్ బీఎస్పీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 8వ తేదీన నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారట. ఆ సయమంలోనే ప్రవీణ్ తో పాటు దాదాపు …
Read More »మోడి ఎందుకు నోరు తెరవటం లేదు ?
ప్రధానమంత్రి నరేంద్రమోడి వ్యవహారశైలే చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రతిపక్ష నేతలు, వివిధ సెక్టార్లలోని ప్రముఖులపై పెగాసస్ అనే సాఫ్ట్ వేర్ తో మొబైల్ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై పార్లమెంటులో నానా రచ్చ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంరోజున అంటే 19వ తేదీనే పెగాసస్ వ్యవహారం మీడియాలో వచ్చింది. అప్పటికే మోడి సర్కార్ పై అనేకరకాలుగా మండిపోతున్న ప్రతిపక్షాలకు పెగాససన్ వ్యవహారం చక్కటి ఆయుధంగా దొరికింది. …
Read More »