ఎవరికైనా ఆశ ఉంటుంది. రాజకీయ నాయకులకు అయితే అది మహా లావుగా ఉంటుంది. ఇక పీసీసీ కిరీటం తగిలించుకుని తెలంగాణా అంతా కాలికి బలపం కట్టుకుని తిరిగేస్తున్న రేవంత్ రెడ్డికి కూడా సీఎం కావాలనే ఆశ ఉంటుంది. అందులో తప్పు లేదు కూడా. లేకపోతే తెల్లారి లేస్తే కేసీఆర్ ఆయన ఫ్యామిలీ మీద విమర్శలు చేస్తూ ఒకటికి నాలుగు తిట్లు తింటూ రేవంత్ ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. …
Read More »ఏపీలో అప్రకటిత ముఖ్యమంత్రి ఆయనేనా?
జగన్ ప్రభుత్వంలో నెంబర్ వన్ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డే.. సర్వం తానే అయి.. ప్రబుత్వాన్ని నడిపించ నున్నారా? వచ్చే ఐదార్రోజుల పాటు.. ఆయనే అప్రకటిత ముఖ్యమంత్రిగా వ్యవహరించనున్నారా? అంటే.. వైసీపీ నేతలు అటు ఔనని, ఇటు కాదని నిర్దిష్టంగా చెప్పలేక పోతున్నారు. అయితే.. ఇదే విషయంపై మాత్రం వారు కూడా గుసగుసలాడు తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తన కుటుంబంతో సహా విహార యాత్రకువెళ్లారు. 25వ పెళ్లిరోజును …
Read More »టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై స్పందించిన రేవంత్..!
టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసులో.. చాలా మంది సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. వారిపై ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. పలువురికి నోటీసులు కూడా అందాయి. కాగా.. ఈ అంశంపై తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నాలుగు రోజులుగా మంత్రి కేటీఆర్ ఆందోళనలో ఉన్నారని… కేటీఆర్ దగ్గరి వారికి… డ్రగ్స్ నోటీసులు వచ్చాయని …
Read More »ఎన్నారైలపై మోడీ వరాల వర్షం.. ఏం చేశారంటే
విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీపికబురు అందించారు. ఇప్పటి వరకు వారు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నారైలు భారత్కు వచ్చినప్పుడు.. వారు ఆధార్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. దాదాపు 6 నెలలు పట్టేది. దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొనే వారు. అయితే.. ఇప్పుడు మోడీ సర్కారు ఈ విషయంలో కొంత సడలింపు ప్రకటించింది. ఈ క్రమంలో కేంద్రం ఆదేశాల మేరకు …
Read More »అంబాసిడర్గా సోనుసూద్.. కేజ్రీవాల్ వ్యూహం అదే
కరోనా కారణంగా దేశంలో విధించిన లాక్డౌన్ సమయంలో ఎంతోమంది ప్రజల కష్టాలను తీర్చిన నటుడు సోనుసూద్ దేవుడయ్యాడు. వలస కూలీలు మొదలు అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు సాయం చేస్తూనే ఉన్నారు. రోగులకు మందులు, ఆక్సిజన్.. ఆకలితో అలమటించిన పేదలకు అన్నం.. విద్యార్థులకు పుస్తకాలు, స్మార్ట్ఫోన్లు ఇలా అవసరాల్లో ఉన్నవాళ్లందరికీ అండగా నిలిచిన సోనుసూద్ను రియల్ హీరోగా దేశమంతా కీర్తించింది. ఓ వ్యక్తిగా ఇంతటి గొప్ప పనులు చేస్తున్న ఆయన.. …
Read More »షర్మిల కోసం పీకే.. పార్టీలో ఉత్సాహం
తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిల తనదైన శైలిలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పదునైన విమర్శలు చేస్తున్నారు. నిరుద్యోగ సమస్యను భుజాలకెత్తుకున్న ఆమె అందుకోసం ప్రతి మంగళవారం దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగాల భర్తీ సహా పలు ప్రజా సమస్యలపై ఆమె పోరాటం చేస్తున్నారు. కానీ తన పార్టీకి ఇప్పటికీ రావాల్సినంత గుర్తింపు మాత్రం రాలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. …
Read More »పాకిస్థాన్ తో బంధాన్ని బయటపెట్టిన తాలిబన్లు
‘తమకు పాకిస్తాన్ రెండో ఇల్లు లాంటిది’ అని తాలిబన్లు తాజాగా చేసిన ప్రకటన చాలా కీలకమైనదని చెప్పాలి. ఎందుకంటే భారతదేశాన్ని అస్ధిరతపాల్చేయటం, మారణహోమాన్ని రేపటమే లక్ష్యాలుగా పాకిస్ధాన్ ఎన్ని కుట్రలు పన్నుతోందో అందరికీ తెలిసిందే. అందుకే అవకాశం ఉన్న ప్రతి చోటా పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని, పాకిస్తాన్ అవలంభిస్తున్న భారత్ వ్యతిరేకతను మనదేశం ఎండగడుతునే ఉంది. తాజాగా ఆఫ్ఘనిస్థాన్లో మొదలైన పరిణామాలను మన పాలకులు కూడా చాలా జాగ్రత్తగా …
Read More »కాబూల్ లో ఆత్మాహుతి దాడి..60మంది మృతి
తాలిబాన్లు ఆక్రమించుకున్న ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ఇప్పుడు రక్తసిక్తమైంది. తాలిబాన్ల చేతిలోకి వెళ్లిన తర్వాత దేశ పరిస్థితి దారుణంగా మారిపోయింది అనుకునేలోపు.. అక్కడ ఉగ్రదాడి జరిగింది. భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో దాదాపు 60మంది ప్రాణాలు కోల్పోయారు. జంట పేలుళ్లు సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ రెండు పేలుళ్లు సూసైడ్ బాంబర్లుగా అధికారులు పేర్కొంటున్నారు. వేలాది మంది ఉన్న ఎయిర్ పోర్టు ప్రాంతంలో ఈ మారణహోమం సృష్టించడం గమనార్హం. …
Read More »కర్నూలును న్యాయ రాజధానిగా మార్చేందుకు అడుగులు
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉన్న జగన్ ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కేవలం అమరావతిని మాత్రమే రాజధానిగా ఉంచకుండా.. పాలన వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో జగన్ అధికారంలోకి రాగానే మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాల నుంచి ఓ వర్గం ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ అవి పట్టించుకోకుండా జగన్ ముందుకు సాగుతున్నారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ …
Read More »హుజూరాబాద్ దెబ్బ కేసీఆర్ మీద బాగా పడిందా ?
తొందరలో జరగబోయే హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక దెబ్బకు కేసీఆర్ జనాల్లో తిరగాల్సొస్తోంది. మామూలుగా అయితే నెలల తరబడి సీఎం అసలు జనాల మొహమే చూడరు. కొన్ని నెలలపాటు సచివాలయానికి రాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అనుమానం లేకుండా కేసీయార్ పేరే చెబుతారు. మంత్రులకు, ఉన్నతాధికారులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వరనే ప్రచారానికి కొదవేలేదు. ఎంతోమంది మంత్రులు, ఉన్నతాధికారులు ఫామ్ హౌస్ దగ్గరకు వెళ్ళి కేసీఆర్ తో మాట్లాడకుండానే వెనక్కు తిరిగివచ్చేశారట. …
Read More »దేశంలోని ఆ రాష్ట్రంలో మూడో వేవ్ ఎంట్రీ ఇచ్చేసినట్లేనా?
దేవతలు నడయాడిన భూమిగా అభివర్ణించే కేరళలో ఇప్పుడు దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ చిన్న రాష్ట్రం ఇప్పుడు కరోనాతో కిందా మీదా పడుతోంది. దేశంలోని మరే రాష్ట్రంలో అమలు చేయనంత కఠినంగా కొవిడ్ నిబంధనల్ని అమలు చేస్తున్నా.. కేసుల నమోదు మాత్రం అంతకంతకూ ఎక్కువ అవుతూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల తీవ్రత చూస్తే.. మూడో వేవ్ దేశంలోకి ఎంట్రీ ఇచ్చినట్లేనా? …
Read More »వైసీపీలో ముందస్తు గానం.. వ్యూహం ఏంటి..?
ఏపీ అధికార పార్టీ వైసీపీలో ముందస్తు కోయిల కూస్తోంది. వచ్చే ఏడాదిలోనే సీఎం జగన్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్తారనే వాదనను వైసీపీ నేతలు బహిరంగంగానే చేస్తున్నారు. అయితే.. దీని వెనుక వ్యూహం ఏదైనా ఉందా ? లేక నిజంగానే జగన్ ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారా ? అనేది సందేహం. ప్రస్తుతం రాష్ట్రంలో 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు (జగన్ మినహా). అయితే.. వీరిలో సగానికి సగం …
Read More »