పవన్ కల్యాణ్ సభలకు జనం పోటెత్తుతున్నారు..ఇందులో కొత్తేం ఉంది? ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి జనం సునామీలా వస్తూనే ఉన్నారు.. అయినా ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు.పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలైన తరువాత కాపులంతా ఆయనకు మద్దతుగా ఏకమవుతున్నారు.అవుతారు.. అవుతారు.. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇదంతా ఏమవుతుందో చూద్దాం..పవన్ కల్యాణ్ ఈసారి చాలా సీరియస్‌గా ఉన్నారు.. ఇక వైసీపీ పని అయిపోయినట్లే..ఆఁ సీరియస్ పొలిటీషియనే.. నరసాపురంలో యాత్ర …
Read More »షర్మిల లేదు.. గిర్మిల లేదు.. పోవాయ్!!
“షర్మిల లేదు.. గిర్మిలా లేదు.. పోవాయ్!! గామెను ఏపీలోకి పొమ్మను. అక్కడ బాగుంటది” అని తెలంగాణ కాంగ్రెస్ కురువృద్ధుడు వీ. హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఆయన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.. షర్మిలను ఉద్దేశించి.. వ్యాఖ్యానించారు. ముందుగా షర్మిల ఎవరో తనకు తెలియదని.. ఇటీవల కాలంలో పేపర్లలో ఎవరో ఏదో రాస్తున్నారని వ్యాఖ్యానించిన వీహెచ్.. మీడియా ప్రతినిధులు వైఎస్ కుమార్తె అని గుర్తు చేయడంతో.. “`ఆ.. …
Read More »నాపై సుపారీ గ్యాంగులను పంపిస్తున్నారు.. పవన్
కొన్ని రోజుల కిందట తనకు ప్రాణహాని ఉందంటూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 2019లో కనుక వైసీపీ అధికారంలోకి రాకపోయి ఉంటే.. తనను చంపేసేవారని ఆయన తూర్పుగోదావరి జిల్లా వారాహి యాత్రలో వ్యాఖ్యానించి సంచలనం రేపారు. ఇక, ఇప్పుడు తాజాగా.. తనను చంపించేందుకు కొందరు వైసీపీ ముఠా నాయకులు.. సుపారీ గ్యాంగులను పంపిస్తున్నారని చెప్పారు. తాజాగా ఆయన మలికిపురంలో యాత్రనురద్దు చేసుకున్న నేపథ్యంలో స్థానిక పార్టీ …
Read More »పగలు సెగలు రాత్రి మైత్రి.. బీజేపీ, బీఆర్ఎస్ అఫైర్స్
కొన్నాళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కొనసాగిన రాజకీయ ఉద్రిక్తతలు నెమ్మదించినట్లుగా ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు కేంద్రాని లేఖపై లేఖ రాసిన కేటీఆర్ ఇప్పుడు తానే నేరుగా వెళ్లి బీజేపీ పెద్దలను కలవడం చర్చనీయమవుతోంది. అది కూడా.. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ పట్నాలో భేటీ అయిన రోజునే కేటీఆర్ దిల్లీ వెళ్లి అమిత్ షాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ కలవడంలేదనే ఇండికేషన్ ఇవ్వడానికేనని.. రాష్ట్రంలో మాకు సహకరించండి.. కేంద్రంలో …
Read More »పవన్‌ను జోగయ్య ముంచుతారా? విజయంలో ముంచెత్తుతారా
ఏపీ పాలిటిక్స్ పవన్ కల్యాణ్ వేడి పెంచుతున్నారు. తన వారాహి రథంపై కాపు కోటల్లో దూసుకెళ్తున్నారు. నేనే సీఎం అంటూ జబ్బులు చరుస్తున్నారు. పాలక వైసీపీపై పదునైన విమర్శలు చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనంటూ చెప్పుకొచ్చిన పవన్ ఎందుకో సొంతంగా ఎన్నికలు వెళ్లాలనుకుంటున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాపుల ఓట్లు లక్ష్యంగా చురుగ్గా రాజకీయం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో పాటు కాపుల్లో ఊపు తేవడానికి ట్రై చేస్తున్నారు. …
Read More »‘జగనన్న సురక్ష’: టీడీపీ ఎందుకు కంగారు పడుతుంది
ఏపీలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.. పథకాలకు అర్హులై ఉండి కూడా.. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పథకాలు అందని వారు.. ఇప్పటికీ కొన్ని పథకాల గురించి తెలియనివారికి వాటిని తెలియజేసి.. వాటి దిశగా లబ్ధిపొందని వారికి అవగాహన కల్పించి.. తిరిగి వారికి పథకాలు అందించాలనేది ప్రధాన ఉద్దేశం. దీనికి సంబంధించి సీఎం జగన్ అధికారులకు కూడా దిశానిర్దేశం …
Read More »పవన్ సీఎం కావాలని నేనూ కోరుకుంటున్నా.. వైసీపీ మంత్రి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ముఖ్యమంత్రి కావాలన్నది తన ఆకాంక్ష కూడా అని ఏపీ అధికార పార్టీ వైసీపీ కీలక నాయకుడు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం శాసన సభ్యుడు పినిపే విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆయన వ్యంగ్యాస్త్రం సంధించారో.. లేక నిజంగానే అన్నారో.. ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉన్నా.. ఆయన మాత్రం సీరియస్‌గానే వ్యాఖ్యానించారు. తాజాగా తిరుమల శ్రీవారం దర్శనం చేసుకున్న మంత్రి పినిపే… కొండ …
Read More »కేసీయార్ ఒంటరైపోతున్నారా ?
రాజకీయ పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జాతీయ రాజకీయాల్లో వెలిగిపోవాలని కలలుకంటున్న కేసీఆర్ తన వైఖరి వల్లే ఇపుడు ఒంటరైపోతున్నట్లున్నారు. నిలకడలేనితనం, మాట స్ధిరత్వం లేకపోవటం హోలు మొత్తంమీద క్రెడిబులిటి పోగుట్టుకున్నారు. దాంతో కేసీయార్ ను ఇపుడు ఎవరూ నమ్మడం లేదు. ఒకసారి ఎన్డీయే మీద యుద్ధమంటారు. మరోసారి బీజేపీని అడ్డుకుంటానని ప్రకటిస్తారు. తర్వాత నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అందరూ జట్టుకట్టాలంటారు. ఇపుడేమో కేంద్ర ప్రభుత్వం మీద …
Read More »టీడీపీ సైలెంట్.. వైసీపీ టెన్షన్.. జనసేన హుషార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న జనాకర్షణ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆకర్షణను రాజకీయంగా సరిగా ఉపయోగించుకోలేదనే విమర్శ ఆయనపై ఉంది. జనసేన పెట్టి పదేళ్లు కావస్తున్నా.. పార్టీ నిర్మాణం సరిగా జరగకపోవడం, పవన్ అనుకున్న స్థాయిలో జనాల్లో తిరగపోవడం పట్ల విమర్శలు అన్నీ ఇన్నీ కావు. పార్ట్ టైం పొలిటీషియన్ అనే విమర్శలకు పవన్ దీటుగా సమాధానం చెప్పలేకపోయాడనే అభిప్రాయం జనాల్లో కూడా బలంగా …
Read More »‘మాటలు రాని పప్పును సీఎం చెయ్యడానికి చంద్రబాబు అవస్థలు’
పొలిటికల్ క్యామెడీ కింగ్ కేఏ పాల్ తాజాగా అనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణకాష్టంగా మారిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఏపీలో ఉన్న పరిస్థితులు చూసిన తర్వాత.. శాంతిదూతనైన తననే సీఎం చేయాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోందో కూడా తెలియడం లేదని అన్నారు. శుక్రవారం అనంతలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. …
Read More »ముద్రగడకు కన్ఫర్మ్ అయిపోయిందా ?
రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పోటీచేయటం కన్ఫర్మ్ అయిపోయిందా ? తాజా పరిణామాలు చూస్తుంటే అలాగే అనుమానంగా ఉంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు ముద్రగడ రాసిన లేఖలో వచ్చేఎన్నికల్లో కాకినాడలో కానీ కుదరదంటే పిఠాపురంలో కానీ పోటీచేయాలని చాలెంజ్ చేశారు. పిఠాపురంలో పోటీచేసి తనను ఓడించాలని సవాలు విసరటంలోనే ముద్రగడ పోటీపై ఒక్కసారిగా రాజకీయం వేడెక్కిపోయింది. ముద్రగడ వైసీపీలో చేరి …
Read More »‘మా మాట విను. పెళ్లి చేసుకో రాహుల్..’
కాంగ్రెస్ ముఖ్య నేతల్లో ఒకరైన రాహుల్ గాంధీ ఇప్పటికీ బ్యాచిలరే. మోడీని ప్రధానమంత్రి పదవి నుంచి దించేసే భారీ కార్యక్రమానికి తెర తీసిన విపక్ష పార్టీలు నిర్వహించిన సమావేశంలోనూ రాహుల్ పెళ్లి మాట రావటం ఆసక్తికరంగా మారింది. యాభై దాటేసినప్పటికీ.. ఇప్పటికి రాహుల్ ను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఖాతాలో వేయటం తెలిసిందే. సీరియస్ గా సాగిన విపక్షాల బేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు పలువురు నేతలు. ఈ సందర్భంగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates