పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఆవేశానికి మారుపేరులా ఉండేవాడు. ప్రజారాజ్యం తరఫున రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో చాలా దూకుడుగా వ్యవహరించేవాడు. కానీ సొంతంగా పార్టీ పెట్టాక ఆయన ఆవేశం, దూకుడు చాలా వరకు తగ్గింది. ఊరికే ఆవేశపడిపోకుండా ఆచితూచి మాట్లాడ్డం వరకు ఓకే కానీ.. ప్రత్యర్థులు ఎలా పడితే అలా తిడుతుంటే, లేనిపోని ఆరోపణలు చేస్తుంటే పవన్ వారిని దీటుగా ఎదుర్కోకుండా.. మర్యాదపూర్వకంగా వ్యవహరించడం ఏంటి.. సైలెంటుగా ఉండటం …
Read More »పశ్చిమలో కొత్త మంత్రులు ఇద్దరా.. ఒక్కరా ?
ఏపీ మంత్రి వర్గ విస్తరణ ఖరారైంది. ఇప్పటికే మంత్రి వర్గంలో బెర్త్‌లను ఆశిస్తున్నవారి జాబితాతోపాటు.. పార్టీలో కీలకంగా ఉన్న నాయకుల జాబితా కూడా సీఎం జగన్ చెంతకు చేరిందని.. దీనిపై కసరత్తు ప్రారంభించారని అంటున్నారు. ఈ క్రమంలో ఉభయ గోదావరుల్లో కీలకమైన పశ్చిమ గోదావరి నుంచి ఎవరికి ఛాన్స్ దక్కుతుంది? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి టీడీపీ కంచుకోట వంటి ఈ జిల్లాలో వైసీపీ జెండా ఎగరేయడంలో అనేక మంది …
Read More »అక్టోబరు 2 ముహూర్తం: జగన్ సర్కారుపై పవన్ నిరసన
జనసేనాని పవన్ కళ్యాణ్.. మళ్లీ తన పాతరూట్‌లోకి వచ్చేశారా? కూర్చున్నా.. నిల్చున్నా.. ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారా? ఇక, వైసీపీ సర్కారుకు చుక్కలు చూపించాలని నిర్ణయించుకున్నారా? వచ్చే ఎన్నికల వరకు ఇదే పంథాను కొనసాగించనున్నారా? అంటే.. తాజా పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. అక్టోబరు 2న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర సర్కారుపై నిరసన తెలిపేందుకు పవన్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. తనే దిగితే.. ఇక, …
Read More »వంగవీటి రాధాకు కొడాలి నాని బంపర్ ఆఫర్
వారిద్దరూ ప్రాణ స్నేహితులు.. పార్టీలు వేరైనా వారి స్నేహానికి ఆ పార్టీలు అడ్డురాలేదు. ఏ చిన్న కార్యక్రమైనా ఆ నేతలు చెట్టాపట్టాలేసుకుని ఆ ఫంక్షన్‌లో సందడి చేసేవారు. స్నేహం ఇలా ఉండాలనే వారిద్దనీ చూసిన వారు ముచ్చటపడేవారు. స్నేహానికి చిహ్నంగా ఉన్న వారి మధ్య విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగింది. కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. వారి మధ్య చిక్కుకు కారణం ఇప్పటికీ ఎవరికీ అంతుతెలియని ప్రశ్న. ఇప్పుడు ఇద్దరూ …
Read More »కమలానికి ఫ్యాన్ గాలి దూరమవుతోందా?
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా రెండో సారి అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి జగన్ ఆ దిశగా ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారా? అందులో భాగంగానే తనకు తలనొప్పిగా మారిన బీజేపీతో పూర్తి దూరమవాలని నిర్ణయించుకున్నారా? ఇక కమలానికి ఫ్యాన్ గాలి తగలదా? అనే ప్రశ్నలకు రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాల్లో రాటు దేలిన జగన్ వచ్చే ఎన్నికల కోసం …
Read More »ఏపీ-తెలంగాణ.. కేంద్రానికి ఇస్తున్న సంకేతాలేంటి?
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం, తెలంగాణలోని టీఆర్ ఎస్ సర్కారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ముఖ్యం గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఇస్తున్న సంకేతాలు ఏమిటి? ఏం చెప్పదలుచుకున్నాయి? ఇలా చేయ డం ద్వారా.. బీజేపీకి అనుకూలమనా?. లేక వ్యతిరేకమనా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో హల్ చల్ చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం.. ప్రస్తుతం జరుగుతున్న భారత్ బంద్ విషయంలో ఏపీ, తెలం గాణ ప్రభుత్వాలు భిన్నమైన మార్గాలను …
Read More »బంగారం లాంటి అవకాశం… గుర్తించని చంద్రబాబు
రాజకీయ రాజధానిగా పేరున్న విజయవాడలో టీడీపీ పుంజుకునేందుకు ఎంతో ఎడ్జ్ ఉంది. అంతేకాదు.. విజయవాడకు సమీపంలోనే పార్టీ అధినేత చంద్రబాబు నివాసం కూడా ఉంటున్నారు. అయితే.. ఇక్కడ జరుగుతున్న రాజకీయాలను ఆయన లైట్ తీసుకుంటున్నారో.. లేక .. మీడియా ముందుకు వచ్చి హడావుడి చేసే వారితోనే పార్టీ మనుగడ సాగిస్తుందని అనుకుంటున్నారో.. ఎవరికీ తెలియడం లేదు. దీంతో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఒకప్పుడు విజయవాడలో టీడీపీ పుంజుకునే …
Read More »జగన్‌పై ఆ స్వామి ఫైర్.. రీజనేంటి?
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కారుపై విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తొలిసారి నిరసన గళం వినిపించారు. వాస్తవానికి ఏపీలో జగన్ సర్కారు ఏర్పడేందుకు తాము అనేక యజ్ఞాలు, యాగాలుచేశామని చెప్పిన స్వరూపానందేంద్ర.. ఇప్పటివరకు అనేక ఘటనలు జరిగాన.. అన్ని వర్గాల నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. అంతేకాదు.. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరిగి..పక్కనే ఉన్న విజయనగరంలోని రామతీర్థంలో రాముడి విగ్రహం శిరస్సును దుండగులు ఛేదించినా.. …
Read More »‘కొండా’ వారి రక్తచరిత్ర
సెన్సేషనలిషజమే ఊపిరిగా బతికే రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఏ సినిమా ప్రకటిస్తాడో తెలీదు. ఎలాంటి కాన్సెప్ట్ను ఎంచుకుని ఎవరిని కంగారు పెడతాడో అర్థం కాదు. ఆల్రెడీ ఎన్టీఆర్, జగన్‌ల జీవితాలను తెరకెక్కించాడు. తర్వాత శశికళ లాంటి కొందరిపై సినిమాలను ప్రకటించాడు. ఇప్పుడు కొండా వారి ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. వరంగల్ రాజకీయాల్లో అత్యంత కీలక వ్యక్తులైన కొండా మురళి, సురేఖల ప్రేమకథని, వారి రాజకీయ జీవితాన్ని చూపిస్తానంటూ ‘కొండా’ …
Read More »నేటి నవరత్నాలు.. భావితరాలకు నవ కష్టాలు
‘రిపబ్లిక్’ మూవీ ప్రీరిలీజ్ సందర్భంగా వైసీపీ నేతలపై ఓ రేంజ్లో విరుచుకుపడిన పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యల ప్రకంపనలు.. ఏపీ అధికారపార్టీ నేతలంతా ఒక్కసారిగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిట్ల దండకాన్ని మొదలు పెట్టారు. సన్నాసి అంటూ మంత్రి పేర్ని నానిపై ఫైర్ అయిన పవన్ ను.. మంత్రులు పలువురు అంతే ఘాటుగా రియాక్టు అయ్యారు. శనివారం రాత్రి పవన్ విమర్శల ప్రకంపనలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ …
Read More »పవన్ వ్యూహం ఇదేనా ?
విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుపెట్టుకుని జనసేన చేస్తున్న హడావుడి వెనక పెద్ద వ్యూహమే ఉన్నట్లుంది. ఇపుడు కాకపోయినా కొద్దిరోజుల తర్వాతైనా పాలనా రాజధానిగా విశాఖకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవటం ఖాయమని జనసేన అధినేత పవన్ కల్యాన్ గ్రహించినట్లున్నారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో ఈ జిల్లా నుండే మళ్ళీ పోటీ చేయాలని డిసైడ్ అయ్యారట. పవన్ దృష్టిలో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన గాజువాక తో పాటు భీమిలీ నియోజకవర్గం కూడా …
Read More »నొప్పించుకోకుండా.. ఒప్పించకున్న ఆర్కే – షర్మిల ‘ఓపెన్ హార్ట్’
రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలు.. పాలిటిక్స్ మీద ఆసక్తి ఉన్న వారు.. న్యూస్ ను ఎక్కువగా ఫాలో అయ్యే వారంతా గడిచిన రెండు.. మూడు రోజులుగా ఒక ఆసక్తికర అంశం మీద విపరీతంగా మాట్లాడుకోవటమే కాదు.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెర తీసింది ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే అలియాస్ రాధాకృష్ణ తన చానల్ లో తాను నిర్వహించే ‘ఓపెన్ హార్ట్’ సీజన్ 3 ను వైఎస్ …
Read More »