వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తానని చెబుతున్నటువంటి జనసేన పరిస్థితి ఏంటి? అసలు జనసేన వ్యూహం ఏంటి? ఇప్పుడు ఆసక్తిగా మారిన అత్యంత కీలకమైన విషయం ఇదే. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అధికారంలోకి వస్తావని జనసేన చెబుతూ వచ్చింది. అయితే గత కొన్నాళ్లుగా పొత్తులు పెట్టుకుంటామని పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వస్తామని, వైసిపి వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చూస్తామని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతూ వచ్చారు.
అయితే ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య మారుతున్నటువంటి వ్యూహాలు, రాజకీయాల నేపథ్యంలో జనసేన అనుసరించేటటువంటి వైఖరి ఏంటి అనేది ఆసక్తిగా మారింది. జనసేన ఏవిధంగా ముందుకు వెళుతుంది? జనసేన ఏ విధంగా అడుగులు వేస్తుంది? అనేది చర్చనీయాంశంగా మారింది. మహానాడులో చంద్రబాబు నాయుడు పొత్తుల విషయాన్ని ప్రస్తావించ లేదు. పైగా తాను ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధం అనేటటువంటి సంకేతాలను స్పష్టంగా పంపించారనే చర్చ జరుగుతోంది. దీంతో రాష్ట్రంలో వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా టిడిపి ఒంటరిగా పోటీ చేసేందుకు రెడీగా ఉందనే సంకేతాలు ఇచ్చారు.
పైగా జనసేన విధానాలు వేరుగా ఉన్నాయి. జనసేన ఉచితలకు చాలా వ్యతిరేకం అని చెప్పి ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. కొన్ని వర్గాలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చి అన్ని వర్గాలకు భారం వేసేదానికి జనసేన వ్యతిరేకమని ఆయన పార్టీ ఆవిర్భావ సభలో గత ఏడాది జూన్ లోనే ప్రకటించారు. అయితే ఇప్పుడు టిడిపి ప్రకటించినటువంటి మినీ మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే పొత్తులు పెట్టుకుంటే సంయుక్తంగా అన్ని పార్టీలు కలిపి ఒక మేనిఫెస్టోని విడుదల చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి మేనిఫెస్టో పూర్తిగా టిడిపికి మాత్రమే సొంతమైనటువంటి మేనిఫెస్టో. కాబట్టి దీన్నిబట్టి జనసేనకి ఇందులో ప్రమేయం లేదు. మరి జనసేన పొత్తులు పెట్టుకోవాలి అని అనుకున్నట్టయితే ఈ మేనిఫెస్టోను అంగీకరిస్తుందా? ఈ ఉచితలను అంగీకరిస్తుందా? వేలాది కోట్ల రూపాయలు అవసరం అయ్యేటటువంటి అప్పులు చేయడానికి సిద్ధంగా ఉంటుందా? అనేది కూడా ఆసక్తిగా మారింది. ఎందుకంటే జగన్ ప్రభుత్వం పై జనసేన అధినేత తరచుగా విమర్శలు చేస్తున్నారు.
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని యువతను సక్రమంగా వినియోగించడం లేదని యువశక్తిని వృధా చేస్తున్నారని, కేంద్ర పథకాలను తన పథకాలుగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ఆయన పదేపదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన వ్యూహం ఏంటి అసలు జనసేన ఏం చేయాలనుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. చూడాలి మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో.