అవినాష్‌రెడ్డి విష‌యంలో భారీ ట్విస్ట్

రాజ‌కీయాల్లో జ‌రిగే కొన్ని కొన్ని ఘ‌ట‌న‌లు చాలా చిత్రంగా ఉంటాయి. ఇవి న‌మ్మేందుకు కూడా అతిశ‌యంగానే అనిపిస్తాయి. కానీ, ఏం చేస్తాం.. న‌మ్మితీరాలి.. అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హత్య వ్య‌వ‌హారంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి వ్య‌వ‌హారంలో తెలంగాణ హైకోర్టు ముంద‌స్తు బెయిల్ అయితే.. ఇచ్చింది.

కొన్ని ష‌ర‌తులు విధించింది. ప్ర‌తి శ‌నివారం.. సీబీఐ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని.. ఇది కూడా కాకుండా.. ఎప్పుడు పిలిస్తే..అప్పుడు అధికారుల‌కు అందుబాటులో ఉండాల‌ని కూడా ఆదేశించింది. స‌రే..మొత్తానికి ఎంపీ అవినాష్ కోరుకున్న‌ట్టు ముంద‌స్తు బెయిల్ అయితే.. వ‌చ్చేసింది. అయితే.. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే..(నెటిజ‌న్లు చెప్పుకొనేది)  ఇలా బెయిల్ ఉత్త‌ర్వులు.. రాగానే.. అలా అవినాష్‌రెడ్డి మాతృమూర్తిని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్న‌ట్టు వైద్యులు ప్ర‌క‌టించారు.

దీనిపై నెటిజ‌న్లు అనేక కామెంట్లు చేస్తున్నారు. స‌రే.. ఇదిలావుంటే..ఈ నెల 19న సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిన ఎంపీ అవినాష్‌రెడ్డి.. పులివెందుల నుంచి బ‌య‌లు దేరారు. అయితే.. మ‌ధ్యంలో త‌న మాతృమూ ర్తి శ్రీల‌క్ష్మికి అనారోగ్యం అనితెలియ‌డంతో ఆయ‌న అక్క‌డ నుంచి వెనుదిరిగి.. క‌ర్నూలు చేరుకున్నారు. దాదాపు 9 రోజులు క‌ర్నూలులోని విశ్వ‌భార‌తి వైద్య శాల‌లో శ్రీల‌క్ష్మికి వైద్యం అందించారు. ఇక‌, ఇటీవ‌ల ఆమెను హైద‌రాబాద్‌లోని ఏఐజీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఇక్క‌డ కొన్నాళ్లు ఉంచుతామ‌ని వైద్యులు చెప్పారు. అయితే.. అనూహ్యంగా బుధ‌వారం ఉద‌యం ఎంపీ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వ‌డం.. ఆవెంట‌నే నిముషాల వ్య‌వ‌ధిలోనే శ్రీల‌క్ష్మిని డిశ్చార్జ్ చేస్తున్నట్టు వైద్యులు ప్ర‌క‌టించ‌డం.. సంచ‌ల‌నంగా మారింది. దీంతో ఎంపీ అవినాష్‌రెడ్డి త‌న త‌ల్లిని ప్ర‌త్యేక వాహనంలో తీసుకుని పులివెందుల వెళ్లనున్న‌ట్టు ఆయ‌ననుచ‌రులు చెప్పారు.