Political News

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఆ రెండు సీట్లే 175 సీట్లకు ప్రీఫైనలా?

ఏపీలో రెండు టీచర్ల ఎమ్మెల్సీ స్థానాల్లో జరగుతున్న ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రెండు స్థానాల్లోనూ బహుముఖ పోటీ కనిపిస్తోంది. ఉమ్మడి కర్నూల్‌, కడప, అనంతపురం జిల్లాలను కలిపి పశ్చిమ రాయలసీమలో… ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను కలిపి తూర్పు రాయలసీమ స్థానంలో పోటీ జరుగుతోంది. మార్చ్ 13వ తేదీన ఓటింగ్‌ జరగనుండగా, 16వ తేదీ నుండి ఓట్ల లెక్కింపు జరగనుంది. టీచర్లలో ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం ఉందన్న మాట …

Read More »

న‌లుగుతున్నారా.. న‌ష్ట‌పోతున్నారా.. ప‌వ‌న్

ఏపీలో జ‌రుగుతున్న ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప్రాణ‌సంక‌టంగా ప‌రిణ‌మించాయ‌నే వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇటు బీజేపీ.. అటు టీడీపీ రెండూ కూడా.. జ‌న‌సేన త‌మ‌కంటే త‌మ‌కే మ‌ద్ద‌తు ఇస్తోంద‌ని చెబుతున్నాయి. తాజాగా పార్టీ నాయ‌కుల‌తో మాట్లాడిన చంద్ర‌బాబు.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను, నేత‌ల‌ను క‌లుపుకొని ముందుకు సాగాల‌ని పార్టీ నేత‌ల‌కు సూచించారు. అంతేకాదు.. అవ‌స‌ర‌మైతే.. జ‌న‌సేన నేత‌ల ఇళ్ల‌కు వెళ్లి వారిని క‌లుపుకొని ముందుకు సాగాల‌ని …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. ఇంత హాటా.. గురూ!

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. మ‌రో నాలుగు రోజుల్లో పోలింగ్ కూడా జ‌రుగుతోంది. ఎమ్మెల్యే కోటా, ఉపాధ్యాయ‌, గ్రాడ్యుయేట్ కోటాల్లో మొత్తం 9 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అయితే.. వీటిలో ఎమ్మెల్యే కోటాను ప‌క్క‌న పెడితే.. ఉపాధ్యాయ‌, గ్రాడ్యుయేట్ కోటాలో ఎన్నిక‌లు మాత్రం చాలా హాట్ హాట్‌గా సాగుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే 2024 ఎన్నిక‌లకు.. సెమీ ఫైన‌ల్‌గా భావిస్తున్న ఈ ఎన్నిక‌ల‌ను వైసీపీ, టీడీపీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఈ …

Read More »

కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే.. త‌ర్వాత తుఫానే?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే.. త‌ర్వాత ఏదో తుఫాను వ‌స్తుంద‌న్న‌మాటే. గ‌తం లో జ‌రిగిన ప‌రిణామాలు.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలు గ‌మ‌నిస్తే.. కేసీఆర్ మౌనం.. చాలా కీల‌కమనే భావ‌న రాజ‌కీయాల్లో వినిపిస్తూ ఉంటుంది. ప్ర‌స్తుతం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌విత చుట్టూ.. ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణం చుట్టుకుంది. ఆమెను కూడా అరెస్టు చేసి.. తీహార్ జైలుకు త‌ర‌లిస్తార‌నే చ‌ర్చ కూడా సాగుతోంది. గ‌తంలో 2జీ స్పెక్ట్ర‌మ్ కుంభకోణం జ‌రిగిన‌ప్పుడు.. …

Read More »

కవితది బలప్రదర్శనేనా ?

మహిళా రిజర్వేషన్ పేరుతో శుక్రవారం ఢిల్లీలో కల్వకుంట్ల కవిత బలప్రదర్శనకు దిగుతున్నారా ? క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే అవుననే అంటున్నారు అందరు. ఇంతకీ విషయం ఏమిటంటే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించి చట్టం చేయాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఈ డిమాండ్ దశాబ్దాలుగా వినబడుతునే ఉంది. అధికారంలో ఎవరున్నా మహిళా రిజర్వేషన్ బిల్లును పట్టించుకోవటంలేదు. మళ్ళీ ప్రతిపక్షంలోకి మారగానే అందరికీ మహిళా రిజర్వేషన్ బిల్లు గుర్తుకొస్తుంది. …

Read More »

లోకేష్ ఇన్నన్నా.. కిక్కురుమ‌న‌లేదే..!!

రాజ‌కీయాల్లో నేత‌లు ఒక‌రి పై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం.. ఒకరి పై ఒక‌రు దుమ్మెత్తి పోసుకోవ‌డం కామ‌నే. పైగా వైసీపీ-టీడీపీ నేత‌ల మ‌ధ్య ఈ వివాదాలు.. కౌంట‌ర్లు లెక్క‌కు మిక్కిలిగా ఉన్నాయి. ఇక‌, తాజాగా టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో చిత్తూరు జిల్లాలో న‌డుస్తున్నారు. అయితే.. ఆయ‌న ఏ నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్తే.. అక్క‌డి ఎమ్మెల్యేను టార్గెట్ చేసుకుంటున్నారు. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. …

Read More »

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌.. క‌విత చేసిన త‌ప్పేంటి?

ప్ర‌స్తుతం తెలంగాణ‌కు చెందిన రాజ‌కీయ నాయ‌కురాలు, ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె క‌విత పేరు ఊరూ వాడా మార్మోగుతోంది. ఢిల్లీలో వెలుగు చూసిన‌.. లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఆమె పాత్ర ఉంద‌ని.. పేర్కొంటూ.. ఈడీ ఇప్ప‌టికే ఆమెను ఒక‌సారి విచారించింది. ఇప్పుడుమ‌రోసారి విచార‌ణ‌కు రావాల‌ని పిలిచింది. ఈ విచార‌ణ త‌ర్వాత‌.. ఏం జ‌రుగుతుంది? అనేది ఉత్కంఠ‌గా మారింది. దీంతో అస‌లు క‌విత కు ఈ కేసుకు సంబంధం ఏంటి? అనేది సామాన్యుల ప్ర‌శ్న‌. …

Read More »

అమరావతి భూములు అమ్మేస్తోందా ?

రాజధానిగా అమరావతి పనికి రాదు కానీ అమ్మకానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భూములు మాత్రం కావాలా ? ఇపుడిదే ప్రశ్న అమరావతి ప్రాంతం రైతుల నుండి ఎదురువుతోంది. వివిధ అవసరాల కోసం అమరావతి ప్రాంతంలోని 14 ఎకరాలను అమ్మేందుకు ప్రభుత్వం ఫైల్ సిద్ధం చేసింది. అమరావతి ప్రాంతంలోని రెండు గ్రామాల్లో 14 ఎకరాలను ఈ వేలం పద్దతిలో అమ్మేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ వేలం ద్వారా సుమారు రు. …

Read More »

ప్రతీ అడుగు, ప్రతీ మాట వ్యూహాత్మకమే…

ఆయన పార్టీ అధినేత కొడుకు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన యువ నాయకుడు. ఇంతకాలం తండ్రి చాటు బిడ్డడిగానే కనిపించారు. తండ్రి పై కోపంతో ప్రత్యర్థులు ఆయనకు పెట్టిన పేరు పప్పు. ఎవరెన్ని మాట్లాడినా, ఎవరేం చేసినా సహనమే సొంత ఆయుధంగా ఆయన ముందుకు సాగారు. ఇప్పుడు యువగళం పాదయాత్ర ప్రారంభించి నెల దాటిన నేపథ్యంలో నారా లోకేష్ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలా కనిపిస్తున్నారు. పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి …

Read More »

చేసిన మంచి పనులే చిరస్థాయిగా….

పార్టీలు వస్తాయి..పోతాయి…సీఎంలు వస్తారు..పోతారు.. చాలా మంది కాలగర్భంలో కలిసిపోతారు. కొందరు మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతారు. మన తన అన్న భేదం లేకుండా సహాయం చేసే వారే ఎక్కువ కాలం ప్రజల నోళ్లలో నలుగుతారు… అలాంటి వారిలో చంద్రబాబు ఒకరిని ఇటీవల జరిగిన ఘటన నిరూపిస్తోంది.. పీలేరు నియోజకవర్గం చింతలవారిపల్లి మాజీ సర్పంచ్ అశోక్ ఒకప్పుడు వైసీపీకి కొమ్ముకాశారు. టీడీపీని అనరాని మాటలు అన్నారు. జగన్ పాదయాత్ర సందర్భంగా బ్యానర్లు తెస్తూ …

Read More »

‘ఎమ్మెల్సీ’ ఎన్నిక‌లు జ‌గ‌న్ ఫ్యూచ‌ర్ తేల్చేస్తాయా?

ఏపీలో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు సెమీఫైన‌ల్‌గా భావిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌ధానంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోలింగ్‌ను ప‌క్క‌న పెడితే.. ప‌ట్ట‌భ‌ద్రులు, టీచ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఇప్పుడు వైసీపీకి ప్రాణ‌సంక‌టంగా మారాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఇలాంటి ఎన్నిక‌ల్లో ఆయా వ‌ర్గాలు.. అంటే టీచ‌ర్లు, ప‌ట్ట‌భ‌ద్రులు మాత్ర‌మే ప్ర‌చారం చేస్తారు. పోటీలోనూ వారే ఉంటారు. అయితే.. ఇప్పుడు దీనికి భిన్నంగా అటు వైసీపీ, ఇటు టీడీపీ కూడా …

Read More »

రాధాకు హామీ లభించిందా ?

వంగవీటి రాధాకృష్ణకు హామీ లభించిందా ? పార్టీవర్గాల్లో ఇపుడీ విషయమీదే చర్చ జరుగుతోంది. ఈనెల 14వ తేదీన జనసేనలో చేరటానికి రాధా ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అలాంటిది హఠాత్తుగా మంగళవారం ఉదయం పాదయాత్రలో ఉన్న నారాలోకేష్ ను రాధా కలిశారు. ముందు పాదయాత్రలో పాల్గొన్న రాధా తర్వాత భోజన విరామ సమయంలో లోకేష్ తో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. పార్టీవర్గాల …

Read More »