ముంద‌స్తుపై వైసీపీ నేత‌ల టాక్ ఇదే!

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌నే చ‌ర్చ మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌గ‌న్ అనూహ్యంగా కేబినెట్ స‌మావేశం ఏర్పాటు చేయ‌డం.. దీనిలో ఒక తీర్మానం చేసి.. గ‌వ‌ర్న‌ర్‌కు పంపి.. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయ‌డం.. ఆ వెంట‌నే తెలంగాణ‌తో స‌మానంగా ఎన్నిక‌లకు వెళ్ల‌డం చేస్తార‌ని అంటున్నారు. అయితే.. దీనిలో నిజం ఎంతో తెలియ‌దు కానీ.. ఇప్ప‌టికిప్పుడు మాత్రం ఈ విష‌యం హాట్‌గా మారింది.

అయితే.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే.. వైసీపీ తీవ్రంగా న‌ష్ట‌పోతుంద‌ని.. వైసీపీ నాయ‌కులు చెబుతు న్నారు. దీనికి ప్ర‌ధానంగా నాలుగు కార‌ణాలు చెబుతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల‌ను 98.44 శాతం అమ‌లు చేశామ‌ని పార్టీ చెబుతున్నా.. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌డం లేద‌న్న‌ది మెజారిటీ ఎమ్మెల్యేల మాట‌గా ఉంది. ముఖ్యంగా సీపీఎస్ ర‌ద్దు విష‌యంలో ఉద్యోగులు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని.. వీరిని ఏదో ఒక ర‌కంగా శాంతింప‌చేయ‌కుండా వెళ్తే.. ప్ర‌మాద‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ఇక‌, పింఛ‌న్ల‌ను రూ.3000 చేస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చామ‌ని.. ఇది కూడా అమ‌లు చేయ‌లేదని.. ఇప్ప‌టికిప్పుడు.. ఈ హామీని నెర‌వేర్చ‌కుండా.. ముందుకు సాగితే.. ఎలా? అనేది ఎమ్మెల్యేల మాట‌. మ‌రో కీల‌క‌మైన విష‌యంపోల‌వ‌రం. దీనిని అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోనే పూర్తి చేస్తామ‌ని హామీ ఇచ్చామ‌ని.. కానీ, నాలుగేళ్లు గ‌డిచినా.. ఇప్ప‌టికీ అమ‌లు చేయ‌లేక‌పోయామ‌ని చెబుతున్నారు.

అదేస‌మ‌యంలో జిల్లాల‌ను ఏర్పాటు చేసినా.. దీనికి రాష్ట్ర‌ప‌తి నుంచి ఆమోదం పొంద‌లేక పోయారు. దిశ చ‌ట్టాన్ని చేసినా.. కేంద్రం నుంచి అనుమ‌తి తెచ్చుకోలేక పోయారు. ఈ రెండు విష‌యాలు కూడా.. ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు వున్నాయ‌ని.. కాబ‌ట్టి.. ఇలాంటి కీల‌క‌మైన హామీల విష‌యంలో ఆచి తూచి ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర మార్కులు వేయించుకోకుండా.. ముందుకు సాగితే ప్ర‌మాద‌మేన‌ని.. ముంద‌స్తు ముంచేస్తుంద‌ని చాలా మంది గుస‌గుస‌లాడుతున్నారు.