కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా.. రైతు సంఘాలు.. కార్మిక సంఘాలు.. ఇతర ప్రజా సంఘాలు.. ఈ నెల 27న దేశవ్యాప్తంగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌ను బీజేపీ పాలిత రాష్ట్రాలు.. పాటించకపోగా.. బంద్ పాటించే వారిపై కేసులు నమోదు చేయనున్నట్టు.. యూపీ సర్కారు ప్రకటించింది. ఇక, బీజేపీని సమర్ధించే ప్రాంతీయ పార్టీలు, మోడీ కూటమిలోని పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు …
Read More »షాక్ : ఆయన వ్యూహాలకు బాబు గుడ్‌బై
రాజకీయాల్లో ప్రత్యర్థిని దెబ్బ కొట్టి విజయం సాధించాలంటే ఎన్నో వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందిస్తూ ముందకు సాగాల్సి ఉంటుంది. ప్రజల ఆదరణ దక్కించుకోవడంతో పాటు ప్రత్యర్థి నాయకులకు చెక్ పెట్టేలా ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. అందుకే ప్రజల మద్దతు తమకు దక్కేలా.. ప్రత్యర్థి నేతలపై పైచేయి సాధించేందుకు వీలుగా రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా వ్యూహకర్తలను నియమించుకోవడం తెలిసిన సంగతే. దేశంలో ప్రముఖ …
Read More »షాక్ : గుర్తింపు కోల్పోయిన జనసేన !
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఈ వార్త నిజంగా ఇబ్బందికరమైనదే. ఎందుకంటే జాతీయ పార్టీలేవి, ప్రాంతీయ పార్టీలేవి, గుర్తింపు కోల్పోయిన పార్టీలేవి అనే విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఓ జాబితాను విడుదల చేసింది. ఇందులో జనసేన పార్టీని గుర్తింపు లేని రాజకీయ పార్టీగా ప్రకటించింది. పైగా ఫ్రీ సింబల్స్ లో జనసేన క్లైం చేసుకుంటున్న గాజు గ్లాసు గుర్తు ఉందని మరో ప్రకటన చేసింది. అంటే …
Read More »పవన్‌లో కొత్త ఉత్సాహం
ఇటీవల ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఫలితాలు ఆ పార్టీ అధినాయకుడు పవన్ కల్యాణ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాయా? ఆయనలో వచ్చిన మార్పుతో పార్టీ తిరిగి పుంజుకోనుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజా పరిషత్ ఎన్నికల ఫలితాలు ఆయనతో కొత్త రాజకీయ ఆశలను చిగురింపచేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫలితాలను ఆయన సానుకూలంగా మలుచుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించి …
Read More »‘జగన్ పాలనలో డ్రగ్గాంధ్రప్రదేశ్’
టీడీపీ శ్రీకాకుళం ఎంపీ.. యువ నాయకుడు.. కింజరాపు రామ్మోహన్ నాయుడు.. ఏపీ ప్రభుత్వంపైనా.. సీఎం జగన్‌పైనా నిప్పులు చెరిగారు. ఏపీని డ్రగ్గాంధ్రప్రదేశ్‌గా మార్చారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఎంపీ రామ్మోహన్.. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై నిప్పులు చెరిగారు. సీఎం జగన్ వైఖరితో .. యువత మత్తు పదార్థాలకు బానిసయ్యే ప్రమాదం పొంచిఉందని.. ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మాఫియాకు రాష్ట్రం.. కేంద్ర బిందువుగా మారడం బాధాకరమమని …
Read More »దుమ్ము రేపుతున్న ‘షర్మిల – ఆర్కే’ టీజర్
ఆంధ్రజ్యోతి ఆర్కేను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. దమ్మున్న చానల్ ట్యాగ్ తో.. చానల్.. సంచలన కథనాలతో దినపత్రికను నడిపే ఆయన.. సొంతంగా ప్రతి వారం తన పేపర్లో ‘కొత్త పలుకు’ పేరుతో పొలిటికల్ కాలమ్ ఒకటి రాస్తుంటారు. ఇదే కాకుండా.. చానల్ వరకు వస్తే.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే పేరుతో సెలబ్రిటీలను కాస్త భిన్నమైన కోణంలో ఇంటర్వ్యూలు చేస్తుంటారు. ఇప్పటికే ఈ ప్రోగ్రాంకు ఆదరణ ఎక్కువే. …
Read More »టీడీపీలో మొదలైన డిమాండ్లు
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండు పార్టీలు పొత్తులు పెట్టుకోవాలంటూ టీడీపీ నేతల నుంచి డిమాండ్లు మొదలైపోయాయి. తాజాగా వెల్లడైన పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని మండలాల్లో టీడీపీ-జనసేన కలుస్తున్న విషయం తెలిసిందే. స్ధానికంగా ఎదురైన పరిస్థితుల కారణంగా రెండు పార్టీలు అవగాహనతో సర్దుబాట్లు చేసుకుంటే మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవిని ఈ రెండు పార్టీలు తమ ఖాతాలో వేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు స్థానిక …
Read More »వైసీపీ ఎంపీలు రెంటికీ చెడ్డారా….?
ఔను! ఇప్పుడు ఈ మాటే వైసీపీలో వినిపిస్తోంది. ఒక ఎంపీ అంటే.. దాదాపు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రజాప్రతినిధి. ఆ దర్పమే వేరు. ఎక్కడికి వెళ్లినా.. అధికారుల రాచమర్యాదలు.. గౌరవాలు.. ప్రొటోకాల్.. ఇవన్నీ.. ఎంపీలకు సహజంగా దక్కేవే. వీటికి అదనంగా.. సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి కూడా అంతే రేంజ్‌లో గౌరవ మర్యాదలు దక్కుతాయి. అయితే ఇది గతం. ఇప్పుడు వైసీపీలో అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఎవరూ …
Read More »ఎన్నికల్లో పోటీ చేయను.. కానీ టీడీపీలో కొనసాగుతా.. నాని!
టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇక నుంచి ఎన్నికల్లో పోటీ చేరనే చర్చ బెజవాడలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో ఇదే విషయాన్ని చెప్పారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో పాటు ఆయన కుమార్తె శ్వేత కూడా ఎన్నికల్లో పోటీ చేయబోమని అధినేతకు చెప్పారట. ఎన్నికల్లో పోటీ చేయనంత మాత్రాన పార్టీకి దూరంగా ఉంటానని అనుకోవద్దని, పార్టీతోనే కొనసాగుతానని చెప్పారని సమాచారం. ఇప్పటికే తన కుమార్తె …
Read More »సీఎం జగన్‌కు అస్వస్థత.. ఢిల్లీ టూర్ క్యాన్సిల్
ఏపీ ముఖ్యమంత్రి.. జగన్‌మోహన్ రెడ్డి శనివారం తలపెట్టిన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. గురువారం రాత్రికే ఢిల్లీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. దీనిని మీడియాకు కూడా విడుదల చేశారు. అయితే.. అనూహ్యంగా ఆయన శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం రోజు వారీ వ్యాయామంలో భాగంగా.. జగన్ వ్యాయామానికి దిగారు. అయతే.. ఆయన కుడి పాదం అనూహ్యంగా మెలిదిరగడంతో బెణికింది. దీంతో ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు. ఈ క్రమంలో …
Read More »పీఎం కేర్స్ వివాదాస్పదం !
కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవడం కోసం విరాళాల సేకరణకు ప్రధాని నరేంద్ర మోడీ 2020 మార్చి 27న పీఎం కేర్స్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా వచ్చిన విరాళాలను కరోనాపై పోరాటంలో ఖర్చు చేస్తామని ప్రకటించారు. ప్రధాని పిలుపునకు స్పందించిన ఎంతో మంది బడా వ్యాపారవేత్తలు సినీ రాజకీయ ప్రముఖులు మొదలు సాధారణ ప్రజల వరకూ డబ్బులు డొనేట్ చేశారు. దీంతో అసలు పీఎం కేర్స్‌కు ఎంత విరాళాలు వచ్చాయి? …
Read More »పవన్ వల్ల జరిగేపనేనా ఇది ?
వైసీపీ దాష్టీకపు పాలనకు వ్యతిరేకంగా జనసేన క్షేత్రస్ధాయిలో పోరాటాలు చేస్తుందని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాజాగా ప్రకటించారు. ప్రతిపక్షమన్నాక యాక్టివ్ గా ఉండాల్సిందే. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను, అధికార పార్టీ నేతల ధౌర్జన్యాలను ఎదుర్కోవాల్సిందే అనడంలో సందేహం లేదు. కానీ ఈ పని జనసేన అధినేత వల్ల అవుతుందా అనేదే పెద్ద సందేహం. ఎందుకంటే గతంలో కూడా పవన్ చాలాసార్లు పిలుపిచ్చినా అమల్లోకి వచ్చింది లేదన్న విషయం …
Read More »