కాంగ్రెస్ హయాంలో దాదాపు పదేళ్ళపాటు ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరారెడ్డి యాదవ్ టీడీపీలో చేరబోతున్నారా ? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. చాలాకాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న రఘువీరారెడ్డి ఈమధ్యనే కాస్త యాక్టివ్ అయ్యారు. ఒకటి రెండుసార్లు అధిష్టానం పిలుపుమేరకు ఢిల్లీకి కూడా వెళ్ళివచ్చినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ లో మళ్ళీ క్రియాశీలకపాత్ర పోషించే ఉద్దేశ్యం ఈ సీనియర్ నేతకు లేదంటున్నారు. మరి యాక్టివ్ అవ్వాలని …
Read More »సంబరాలకు సై.. ఏపీలో అధికారిక ప్రకటన
ఈ నెల 21న(మంగళవారం) ముఖ్యమంత్రి జగన్ 49వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలకు చేసుకునేందుకు వీలుగా.. ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నిజానికి ఇప్పటి వరకు ఈ విషయంపై తర్జన భర్జన పడిన ప్రబుత్వం.. ఎట్టకేలకు సుదీర్ఘ చర్చల అనంతరం.. పార్టీ శ్రేణులు.. జగన్‌పుట్టిన రోజును ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చింది. దీంతో పార్టీ శ్రేణులు సంబరాలకు సన్నాహాలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం దగ్గర …
Read More »జూనియర్ కిమ్ లా జగన్ పరిపాలన: CBN
తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటీఎస్ వసూళ్ల పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారని అన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అంటూ ప్రకటనలతో జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని వ్యాఖ్యానించారు. “జూనియర్ కిమ్ మాదిరిగా జగన్ వ్యవహరిస్తున్నారు“ అని నిప్పులు చెరిగారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. …
Read More »జగన్ పుట్టిన రోజు.. రిటర్న్ గిఫ్ట్
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంలో ఏటా అత్యంత ఆడంబరంగా నిర్వహించుకుం టున్న కార్యక్రమం జగన్ పుట్టిన రోజు వేడుక. ముఖ్యంగా జగన్ సీఎం అయిన తర్వాత.. ఈ వేడుకలకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన ఇద్దరు కుమార్తెలు ఎక్కడ ఉన్నా.. ఆ రోజు మాత్రం తండ్రి సమక్షంలో ఉండాల్సిందే. ఇక, గత ఏడాది తల్లి విజయమ్మ కూడా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఇక, ఇప్పుడు ఏడాది పుట్టిన …
Read More »ప్రభుత్వం కంటే ఫాస్ట్ – బాధితులకు అండగా భువనేశ్వరి
ఈమధ్యనే గ్రేటర్ రాయలసీమ ప్రాంతమంతా భారీగా కురిసిన వర్షాలు, వరదల కారణంగా పెద్దఎత్తున ప్రాణ, ఆస్తినష్టం జరిగిన విషయం తెలిసిందే. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. అప్పట్లో భారీ వర్షాలకు, వరదల కారణంగా నష్టపోయిన బాధితుల దగ్గరకు భువనేశ్వరి సోమవారం వెళ్ళబోతున్నట్లు ఎన్టీయార్ ట్రస్టు వర్గాలు చెప్పాయి. బాధిత కుటుంబాలకు ఎన్టీయార్ మెమోరియల్ ట్రస్టు తరపున తలా లక్ష రూపాయలను భువనేశ్వరి అందించబోతున్నారట. మొత్తం 48 కుటుంబాలకు …
Read More »తల్లీ, కొడుకులు పోటీచేయటం ఖాయమేనా ?
తెలుగుదేశం పార్టీకి సంబంధించి క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే ఉంది. తాజాగా పరిటాల శ్రీరామ్ చేసిన హెచ్చరికలు విన్న తర్వాత పార్టీలో అందరూ ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఇంతకీ శ్రీరామ్ చేసిన హెచ్చరిక ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో ధర్మవరంలో పోటీ చేయటానికి తనకు టికెట్ ఇవ్వకపోతే రాజకీయాల నుండే శాశ్వతంగా తప్పుకుంటానని ఏకంగా చంద్రబాబునాయుడుకే అల్టిమేటం జారీ చేయటమే ఆశ్చర్యంగా ఉంది. శ్రీరామ్ ఎక్కడా చంద్రబాబు పేరెత్తలేదు. కానీ …
Read More »రేవంత్ వల్ల ప్రక్షాళన సాధ్యమేనా ?
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టిగానే కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రమంతా విస్తృతంగా తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ సభలు నిర్వహిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీని వదిలేసిన మాజీలందరితోను భేటీ అవుతూ వాళ్ళని మళ్లీ పార్టీలోకి లాక్కొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు ఈ పనులు చేస్తూనే మరోవైపు తనంటే మండిపోతున్న సీనియర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. …
Read More »నా మాటే శాసనం : పరిటాల శ్రీరామ్
పరిటాల శ్రీరామ్. టీడీపీ యువ నాయకుడు. మంచి ఫైర్ ఉన్న నాయకుడు కూడా! అనంతపురం జిల్లాలో ఒకప్పుడు.. రాజకీయాలను శాసించిన పరిటాల రవి వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన శ్రీరాం.. గత ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పటి వరకు మంత్రిగా సున్న పరిటాల సునీత తన కుమారుడికి సీటు ఇప్పించుకునేందుకు ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. పరిటాల రవి వారసుడిగా భారీ అంచనాలతో ఆయన రంగంలోకి …
Read More »లోక్ సభకు జీవీఎల్ పోటీ చేస్తారా?
బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయాలని అనుకుంటున్నారా ? అందుకు నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకున్నారా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్ నరసింహారావు సొంత జిల్లా ప్రకాశం. జీవీఎల్ రాజ్యసభ ఎంపీ అయ్యేంతవరకు చాలామందికి అసలాయన ఏపీ వ్యక్తే అన్న విషయం కూడా తెలీదు.ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి గుంటూరు …
Read More »లాక్ డౌన్ దిశగా సంపన్న దేశం.. మన పరిస్థితేంటి?
అక్కడెక్కడో సౌతాఫిక్రాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగిపోతున్న వార్తలు రావటం.. ఆ వెంటనే మొదలైన కలకలం.. కొద్దిరోజులకే ప్రపంచంలోని దాదాపు పాతిక దేశాలకు పైనే ఈ మాయదారి మహమ్మారి విస్తరించటం తెలిసిందే. పక్కా జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నప్పటికి.. మన దేశంలోనూ ఒమిక్రాన్ కేసులు వచ్చేశాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. సింగిల్ డిజిట్ లో మొదలైన కేసులు.. చూస్తుండగానే …
Read More »మందు బాబులకు గుడ్ న్యూస్
ఏపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. మద్య నిషేధం అంటూనే.. మరోసారి.. మందు బాబులకు మరింత కిక్కు ఇచ్చే నిర్ణయం తీసుకుంది. మద్యం ప్రియులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న ప్రముఖ బ్రాండ్ల మద్యాన్ని వచ్చే వారం నుంచి తీసుకురానున్నారు. దీంతో ఇంపీరియల్ బ్లూ, మెక్‌డోల్ విస్కీ, బ్రాందీ, రాయల్ స్టాగ్ సహా అనేక ప్రముఖ బ్రాండ్లు ప్రభుత్వ రిటైల్ దుకాణాల్లోకి వచ్చేస్తాయి. అదేసమయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం …
Read More »ఆ పంటను కొనేది లేదు: KCR
నిన్న మొన్నటి వరకు యాసంగి ధాన్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించి కేంద్రం ఎందుకు కొనదని ప్రశ్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజాగా ఈ విషయంపై చేతులు ఎత్తేశారు. యాసంగిలో పంటల సాగు, ఉద్యోగ విభజన, కల్పన లాంటి అంశాలపై కలెక్టర్లకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లతో ప్రగతి భవన్‌లో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ భేటీలో రైతులను లాభసాటి పంటలవైపు మళ్లించే బాధ్యత అధికారులదేనని కేసీఆర్ …
Read More »