జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. నటుడు నాగబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్లేస్ మారుతుందా? ఆయనను ఏకంగా జిల్లా నుంచి మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే.. జనసేన నేతల మధ్య జరుగుతున్న టాక్ వింటే ఔననే అంటు న్నారు పరిశీలకులు. గత 2019 ఎన్నికల్లో తొలిసారి నాగబాబు రాజకీయంగా ఎన్నికల్లో పోటీ చేశారు. వాస్తవానికి 2007లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినా.. ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే.. పార్టీలో …
Read More »శపథం వదిలేస్తే.. సీటు రెడీ..
రాజకీయాల్లో నాయకులు చేసే శపథాలు ఎన్నాళ్లు ఉంటాయి? అప్పటి పరిస్థితులను బట్టి..చేసే శపథాలే. అంటే ఒకరకంగా.. పిల్లి శపథాలే! దీంతో నాయకులు తాము చేసిన శపథాలపై నిలబడే నాయకులు పెద్దగా ఉండరు. అందుకే నాయకులు చేసే శపథాలకు పెద్దగా వాల్యూ కూడా ఉండదు. అయితే.. ఒకరిద్దరు మాత్రం శపథం కోసం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వీరిలో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఒకరు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో …
Read More »62కు సర్వీసు పొడిగింపు వదులుకుంటారా ?
ఉద్యోగులకు ప్రభుత్వం పొడిగించిన రిటైర్మెంట్ వయసు ఉద్యోగులు వద్దంటున్నారా ? ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న వాదన చూస్తుంటే సర్వీసు పొడిగింపును వదులుకున్నట్లే కనబడుతున్నది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2 ఏళ్ళు పెంచింది. అంటే ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు ప్రస్తుతం 62 సంవత్సరాలన్నమాట. ఇదే విషయమై ఉద్యోగ నేతలు మాట్లాడుతూ సర్వీసు పరిమితిని పెంచమని తాము ప్రభుత్వాన్ని అడగలేదు కదా అంటున్నారు. …
Read More »ఛాలెంజ్ విసిరి.. అడ్డంగా బుక్కైన నాని!
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే.. నోటికేది వస్తే అది మాట్లాడితే చెల్లదు. హవా సాగినంత కాలం ఓకే కానీ.. పరిస్థితులు తిరగబడినపుడు సీన్ రివర్సయిపోతుంది. కింద పడ్డా నాదే పైచేయి అడ్డంగా వాదిస్తే అందరిలో అల్లరిపాలు కాక తప్పదు. ఇప్పుడు ఏపీ మంత్రి కొడాలి నాని పరిస్థితి ఇలాగే తయారైనట్లు కనిపిస్తోంది. మూడేళ్ల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి …
Read More »రాయలసీమ క్వీన్ మళ్లీ పార్టీ మారుతోందా?
ఎటు గాలి వీస్తే అటు వెళ్లిపోవడం రాజకీయ నాయకులకు అలవాటే. తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు మారడం సాధారణమే. అలా ఎన్నిసార్లయినా చేయడానికి వెనుకాడరు. తాజాగా ఏపీలో మాజీ ఎంపీ బుట్టా రేణుక కూడా మరోసారి జంప్ చేసేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. మళ్లీ తట్టా బుట్టా సర్దుకుని వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లేందుకు ఆమె సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకు తాజా రాజకీయ పరిణామాలే కారణమని …
Read More »పీకే కాంగ్రెస్‌లో ఎందుకు చేరలేదంటే: ప్రియాంక
ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌కు దేశ రాజకీయాల్లో మంచి పేరుంది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్, తమిళనాడులో స్టాలిన్, పశ్చిమ బెంగాల్‌లో మూడోసారి మమత బెనర్జీని సీఎం చేయడంలో ఆయనది కీలక పాత్ర. రాజకీయాలపై అంతటి అవగాహన ఉన్న పీకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నాలు చేశారు. కొంతకాలంగా తెరవెనక ఉండి వివిధ పార్టీలను నడిపించిన ఆయన.. నేరుగా ముందుకు వచ్చి కాంగ్రెస్‌లో చేరాలనే ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ, …
Read More »క్యాసినోతో కొడాలని కొట్టాలని!
కొడాలి నాని.. తన మాటలతో, విమర్శలతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడే నాయకుడు. ఏపీ సీఎం జగన్‌పై ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే నాని రంగంలోకి దిగిపోయి ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చేస్తుంటారు. ఇక ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు నాని అంటే ఓ కొరుకుడు పడని నేత. విపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా నాని టార్గెట్ అంతా చంద్రబాబే అనడంలో సందేహం లేదు. తన మాటల దాడితో …
Read More »నారాయణ బాధేమిటో ?
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెగ బాధ పడిపోతున్నారు. ఇంతకీ ఈయన బాధేమిటయ్యా అంటే పీఆర్సీ సాధన సమితి ఉద్యమంలోకి రాజకీయ పార్టీలకు అనుమతి లేదని చెప్పినందుకు. ఉద్యోగులు ఎవరు రాజకీయపార్టీల ఉచ్చులో పడవద్దని, ప్రభుత్వంపై అనవసరంగా ఆరోపణలు, వ్యాఖ్యలు చేయవద్దని ఉద్యోగసంఘాల నేతలు బహిరంగంగా ఉద్యోగులందరికీ అప్పీల్ చేశారు. ఆ అప్పీలునే నారాయణ తప్పు పడుతున్నారు. ఉద్యోగుల సమ్మెలోకి రాజకీయ పార్టీలకు అనుమతి లేదని చెప్పడం ఏమిటంటు బాధపడిపోయారు. …
Read More »వణికించేస్తున్న ఎంఐఎం
ఒక్క సీటులో కూడా గెలుస్తుందో లేదో తెలీని ఎంఐఎం పెద్ద పార్టీలను కూడా వణికించేస్తోంది. కారణం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో ప్రతి సామాజిక వర్గం ఓట్లు అత్యంత కీలకం కాబట్టే. ఇంతకీ విషయం ఏమిటంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించే ఇదంతా. ఎంఐఎం 100 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. మొదటి జాబితాలో 25 మంది అభ్యర్థులను కూడా ప్రకటించారు పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. మిగిలిన పార్టీ అధినేతలు గెలుపు …
Read More »జగన్ మొండితనం.. రెండు విధాలా చేటేనా?
ఏ ప్రభుత్వానికైనా.. ఏ పాలకుడికైనా పట్టు విడుపులు ఉండాలి. లేకపోతే.. మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఈ మాట ఏపీ సీఎం జగన్ విషయంలో అధికార పార్టీ వైసీపీలోని సీనియర్ నేతల నుంచే వినిపిస్తుండడం గమనార్హం. ఉద్యోగులతో ఏపీ ప్రభుత్వం తెగేదాకా లాగుతున్న పరిణామాలు.. వారి పీఆర్సీ విషయంలో అనుసరిస్తున్న ధోరణి.. ఒకరకంగా..సీఎంకు ఆయనకు మద్దతిచ్చే కొందరికి నచ్చిందేమో కానీ.. చాలా మంది సీనియర్లకు నచ్చడం లేదు. దీనికి కారణం.. …
Read More »పాత ట్రిక్కునే వాడుతున్న మోడీ సర్కారు
సరిగ్గా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ సర్కార్ ఓటర్లకు తాయిలాల లీకులను వదులుతోంది. ఎప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నా ఆర్థిక అంశాలకు సంబంధించి లీకులివ్వటం అలవాటుగా మారింది. ఎన్నికల్లో లబ్ది దొరికిందా సరే లేకపోతే మళ్ళీ ఆ ఊసును కూడా కేంద్రం పట్టించుకోవటం లేదు. ఆ మధ్య బీహార్ ఎన్నికల్లో గెలుపు కోసం, తర్వాత పశ్చిమబెంగాల్లో విజయం కోసం, ఇపుడు ఐదు రాష్ట్రాల్లో గెలుపు కోసం ఇలాంటి …
Read More »బీజేపీకి వరుస షాక్‌లు
గోవాలో ఎన్నికలకు ముందు అధికార బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఎన్నికల బరిలో దిగేందుకు టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు. దీంతో కీలక సమయంలో పార్టీకి దెబ్బ పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రాజీనామాలు, చేరికలతో గోవా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే తనకు టికెట్ ఇవ్వకపోవడంతో దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ పార్టీకి రాజీనామా చేసిన …
Read More »