ఆ జిల్లా పేరేమో తన మామది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం అక్కడ తలనొప్పి తప్పడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం బాబు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఎలాగైనా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి మాత్రం ఏ మాత్రం ఆశాజనకంగా లేదని తెలిసింది.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో టీడీపీకి సరైన అభ్యర్థి దొరకడం లేదని టాక్. అక్కడ టీడీపీకి క్యాడర్ ఉన్నా.. నడిపించే నాయకుడు లేడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్ డైన ఈ నియోజకవర్గంలో గతంలో టీడీపీ హవా కొనసాగించింది. 1994, 1999 ఎన్నికల్లో వరుసగా ఎన్.స్వామిదాసు టీడీపీ నుంచి వరుసగా విజయాలు సాధించారు. ఆ తర్వాత రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. 2014 నుంచి ఇక్కడ వైసీపీ నాయకుడు కొక్కిలిగడ్డ రక్షణనిధి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2004 నుంచి ఇక్కడ టీడీపీ తరపున పోటీ చేసిన స్వామిదాసు వరుస పరాజయాలు చవిచూశారు. గత ఎన్నికల్లో జవహర్ ను నిలబెట్టినా బాబు ఫలితం రాబట్టలేకపోయారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి జవహర్ మరోసారి పోటీ చేసేందుకు సిద్ధంగా లేరని తెలిసింది. గతంలో పోటీ చేసి విజయం సాధించిన కొవ్వూరుకే తిరిగి వెళ్లాలని జవహర్ అనుకుంటున్నట్లు టాక్. దీంతో బాబు ఏం చేస్తారన్నది చూడాలి. ఇక్కడ ప్రస్తుతం టీడీపీ ఇంఛార్జీగా శావల దేవదత్ ఉన్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ కూడా యాక్టివ్ అవుతున్నారు. మరి ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గంలో టీడీపీ టికెట్కు బాబు ఎవరికిస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates