స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిమాండ్ మీద జైలుకు వెళ్లి నెల గడిచిపోయింది. ఆయన అరెస్టు అక్రమమని బయట టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. కానీ బాబు లేని టీడీపీ ఎలా ఉందనే ప్రశ్న ఉత్పన్నమైతే మాత్రం పూర్తిగా పడకేసిందనే సమాధానం వినిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాబు లేకపోవడంతో నాయకులు పార్టీని పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికల …
Read More »ఎవరిది అహంకారం..ఎవరిది ఆత్మ గౌరవం?
అహంకారం వల్లే గత ఎన్నికల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓడిపోయారని, ఈ సారి ఎన్నికల్లో టికెట్ వచ్చిన అభ్యర్థులు ఎవరూ అలా అహంకారంతో ఉండొద్దని సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలకు జూపల్లి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ చెప్పింది వినలేదనే తనకు అహంకారం అంటున్నాడని షాకింగ్ కామెంట్లు చేశారు. తనది అహంకారం కాదని.. ఆత్మగౌరవం అని జూపల్లి …
Read More »అటు కాంగ్రెస్.. ఇటు కేసీఆర్.. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది?
తెలంగాణ ఎన్నికల రేసులో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్ ముందంజలో ఉండగా.. ఇప్పుడు విడతల వారీగా కాంగ్రెస్ జాబితాలు వెల్లడిస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మేనిఫెస్టో ప్రకటించారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్యే ఢీ అంటే ఢీ అన్నట్లు పరిస్థితి మారింది. మరి బీజేపీ ఏం చేస్తోందనే …
Read More »విపక్షాలకు సైతం రాజుగారు.. వైసీపీలో మాత్రం పేదవారు
వైసీపీ నుంచి గెలిచిన ఎంపీలలో రఘురామకృష్ణం రాజు రూటే వేరు. అందుకే ఆయనంటే వైసీపీ అధ్యక్షుడు జగన్ సహా జగన్ బ్యాచ్ అందరికీ మంట. రఘురామకృష్ణంరాజు నిత్యం సొంత పార్టీ చేసే తప్పులను ఎండగడుతూ వారికి మంచిమాటలు చెప్తుంటారు. అయినా, వినకపోతే మీ ఖర్మ అంటూ.. రాష్ట్రానికి మంచి చేసేది చంద్రబాబేనంటూ ఆయన్ను గౌరవిస్తుంటారు. ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటూ అక్కడున్న తెలుగువారికి ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ సాయపడుతుంటారు. చంద్రబాబు …
Read More »చంద్రబాబుకు ఊరట..బెయిల్ పొడిగింపు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఆ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ ను ఈ నెల 18 వరకు ఏపీ హైకోర్టు పొడిగించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను కూడా ఈ నెల 18కి వాయిదా వేసింది. విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై కూడా ఈ నెల 18 వరకు వరకూ విచారణ జరపవద్దని ఆదేశాలు జారీ చేసింది. …
Read More »కొత్తవాళ్లకు పండగ.. హామీ మేరకు కాంగ్రెస్ టికెట్లు
తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. అందుకు అవసరమైన కసరత్తుల్లో పార్టీ ముగినిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. ఇందులో చాలా వరకు కొత్తవాళ్ల పేర్లు ఉండటం విశేషం. ఈ సారి బీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా చేరికలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్.. బీఆర్ఎస్, బీజేపీ నుంచి నాయకులను పార్టీలో చేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. కీలక నాయకులకు, ఎన్నికల్లో …
Read More »మేనిఫెస్టో..జగన్ ను కాపీ కొట్టిన కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో నెలన్నర గడువు మాత్రమే ఉండడంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే తొలి విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించగా…బీజేపీ ఫస్ట్ లిస్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉంది. ఇక, ఆల్రెడీ నెలన్నర క్రితమే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన కేసీీఆర్..తాజాగా ఈ రోజు మేనిఫెస్టోను ప్రకటించారు. మేనిఫెస్టోలోని కొన్ని అంశాలను ఏపీ సీఎం జగన్ నుంచి కేసీఆర్ …
Read More »మైనంపల్లి.. పంతం నెగ్గింది కానీ పరీక్ష మిగిలింది
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పంతం నెగ్గించుకున్నారు. కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం పదవిని కూడా పణంగా పెట్టి.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన మైనంపల్లి పంతం నెగ్గించుకున్నారు. తన కొడుకుతో పాటు తనకు కాంగ్రెస్ టికెట్లు వచ్చేలా చూసుకుని ఎన్నికల సమరానికి సై అంటున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో మైనంపల్లితో పాటు ఆయన తనయుడు రోహిత్ రావుకు టికెట్లు దక్కాయి. మైనంపల్లికి సిట్టింగ్ స్థానం మల్కాజిగిరి, …
Read More »టిక్కెట్లు రాని వారికోసం పోరాడతా: కోమటిరెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయనకు పార్టీ అసెంబ్లీ టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకటించిన తొలి జాబితాలో కోమటి రెడ్డికి పార్టీ సీటు ప్రకటించింది. అయితే.. కొందరు ఆశావహులు, ముఖ్యంగా కీలక నేతల వారసులకు పార్టీ టికెట్లు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టిక్కెట్లు రాని వారి తరఫున తాను అధిష్టానం వద్ద …
Read More »మనదే గెలుపు… తొందర పడొద్దు: కేసీఆర్
“మనదే గెలుపు.. ఎవరూ తొందర పడొద్దు.. యాగీ చేయొద్దు” అంటూ.. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. తాజాగా ప్రగతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 51 మందికి ఆయన స్వయంగా బీఫాంలు పంపిణీ చేశారు. మిగిలిన బీఫాంలు కూడా సిద్ధమవుతున్నాయని తెలిపారు. నామినేషన్లకు ఇంకా సమయం ఉందని ఎవరూ ఖంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. అభ్యర్థులు కోపతాపాలు పక్కన పెట్టాలని సీఎం కేసీఆర్ …
Read More »బీసీలకు జై కొట్టిన కాంగ్రెస్.. మెజారిటీ సీట్లు వారికే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని మార్చుకుంది. అధికార పార్టీకి షాక్ ఇస్తూ.. అదేసమయంలో తాను అధికారంలోకి వచ్చేందుకు ఉన్న మార్గాలను సుగమం చేసుకుంటూ.. కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 28 శాతం సీట్లను బీసీలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన.. జాబితాలో మెజారిటీ సీట్లను వారికే కేటాయించడం గమనార్హం. తాజాగా కాంగ్రెస్ పార్టీ 32 స్థానాలకు …
Read More »బాబు విషయంలో వైసీపీ వైఖరి అమానుషం: పవన్
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానుషంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. తాజాగా మంగళగిరి వచ్చిన పవన్.. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. సీనియర్ నాయకుడు, ఈ దేశంలోనే ఎన్నదగిన నేత అయిన చంద్రబాబును ఓ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates