Political News

స‌మ‌తామూర్తి విగ్ర‌హంపై కొత్త వివాదం రాజేసిన రాహుల్‌

Rahul Gandhi

ప్రధాన‌మంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ ముచ్చింతల్లో ఏర్పాటు చేసిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహంపై చేసిన ట్వీట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గత శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ విగ్ర‌హాన్ని జాతికి అంకితం చేసిన సంగ‌తి తెలిసిందే. రామానుజాచార్యుల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహాన్ని చైనాలో తయారుచేయడాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆత్మ‌నిర్భ‌ర్ భారత్ గురించి కామెంట్లు చేశారు. …

Read More »

అన్యాయం చేసిన వాళ్లే అన్యాయ‌మ‌ని అరుస్తున్నారు : ఉండ‌వ‌ల్లి

ఏపీకి అన్యాయం చేసిన బీజేపీని ఇప్పుడు అన్యాయం జ‌రిగింద‌ని అరుస్తుంద‌ని ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ విమ‌ర్శ‌లు కురిపించారు. పార్ల‌మెంట్‌లో మోడీ ప్ర‌సంగానికి కౌంట‌ర్‌గా ఆయ‌న విలేక‌ర్ల స‌మావేశం నిర్వ‌హించారు. “కాంగ్రెస్‌ను విమ‌ర్శించాలంటే మోడీ మొట్ట‌మొద‌టిగా ఆంధ్ర‌కు జ‌రిగిన అన్యాయ‌న్నే ఎత్తుకుంటారు. కానీ బీజేపీ కూడా చ‌ట్ట విరుద్ధంగా, ధ‌ర్మ విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తునిచ్చింది. మీ పార్టీకి చెందిన సుష్మాస్వ‌రాజే చెప్పారు.. ఈ చిన్న‌మ్మ స‌హ‌క‌రించింది కాబ‌ట్టే తెలంగాణ వ‌చ్చింద‌ని …

Read More »

అసలు విషయం చెప్పేసిన తలసాని

అవును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు ఉద్దేశ్యపూర్వకంగానే కేసీయార్ స్వాగతం పలకలేదు అయితే ఏమిటి ? అంటూ డైరెక్టుగానే మంత్రి తలసాని ప్రశ్నించారు.  ప్రధాని-కేసీయార్ వివాదంలో ముసుగులో గుద్దులాట ఎందుకు అనుకున్నారో ఏమో. అందుకనే మీడియా సమావేశంలో బహిరంగంగానే కేసీయార్ ఉద్దేశ్యాన్ని చెప్పేశారు. తెలంగాణాకు నరేంద్ర మోడీ సర్కార్ చేస్తున్న అన్యాయానికి నిరసనగానే ప్రధానమంత్రికి కేసీయార్ స్వాగతం పలకలేదని తలసాని కుండబద్దలు కొట్టకుండానే చెప్పేశారు. ప్రధానికి స్వాగతం పలకటానికి కేసీయార్ …

Read More »

ఎంఎల్ఏకే జగన్ అపాయిట్మెంట్ ఇవ్వలేదా ?

వినటానికే విచిత్రంగా ఉంది వ్యవహారం. సొంతపార్టీ ఎంఎల్ఏనే కలవటానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడటం లేదట. కారణం ఏమిటంటే జిల్లాల పునర్వ్యస్ధీకరణ నేపధ్యమే అని సమాచారం. విషయం ఏమిటంటే 13 జిల్లాలను ప్రభుత్వం 26 జిల్లాలుగా మారుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కడప జిల్లాని రెండుగా విభజించింది ప్రభుత్వం. కడప జిల్లా యథాతథంగా ఉండగా రెండోది రాయచోటి నియోజకవర్గం కేంద్రంగా ఏర్పాటయ్యింది. దీన్ని జనాలు వ్యతిరేకిస్తున్నారు. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం …

Read More »

PRC: చంద్రబాబే బెటర్… అని ఇపుడంటున్నారట

ఆంధ్రావ‌నిలో కొత్త పీఆర్సీకి సంబంధించి  వివాదం న‌డుస్తోంది.ఉద్యోగులు,ఉపాధ్యాయులు రెండు వ‌ర్గాలుగా విడిపోయి త‌మ వాద‌న వినిపిస్తున్నారు.మంత్రుల క‌మిటీతో చ‌ర్చ‌లు జ‌రిగిన అనంత‌రం ప‌ర‌స్ప‌ర ఒప్పందం మేర‌కు మినిట్స్ రూపొందించాక కూడా ఉపాధ్యాయులు శాంతించ‌డం లేదు..స‌రిక‌దా ఉద్య‌మ తీవ్ర‌త‌ను పెంచారు.తాము పీఆర్సీ సాధ‌న స‌మితి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశామ‌ని యూటీఎఫ్,ఎస్టీయూ,ఏపీటీఎఫ్ (1938) లాంటి ఉద్య‌మ సంఘాలు నిన్న‌టి వేళ ప్ర‌క‌టించాయి.ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ త‌ర‌ఫు పెద్ద‌లు మాత్రం ఇప్ప‌టికీ తాము ఆ …

Read More »

బీజేపీని వెన‌కేసుకు రావాలంటే జీవీఎల్ త‌ర్వాతే ఎవ‌రైనా!

జీవీఎల్ న‌ర‌సింహారావు… బీజేపీ ఏపీ నేత‌. పార్టీ త‌ర‌ఫున బ‌లంగా గ‌లం వినిపించ‌డంలో ఆయ‌న ముందుంటారు. కొన్ని సార్లు జీవీఎల్ తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారుతుంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇదే రీతిలో వైర‌ల్ అయ్యాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్‌గా ఎంపీ జీవీఎల్ స్పందిస్తూ ఏపీకి ప్ర‌త్యేక హోదా స‌రైన ప‌రిష్కారం కాద‌ని తెలిపారు. …

Read More »

27 వేల కోట్లు అప్పు.. ఢిల్లీ వెళ్లి జ‌గ‌న్ చేసిందిదే

ఏపీ సీఎం జ‌గ‌న్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా..అనేక సందేహాలు.. అనుమానాలు.. వ్యాఖ్యానాలు..చ‌ర్చ‌లు కామ‌న్‌. త‌న కేసుల ప‌రిష్కారం కోస‌మే ఆయ‌న వెళ్లాడ‌ని ఎక్కువ మంది అభిప్రాయ‌ప‌డుతుంటారు. లేదు.. కేంద్రంతో సంధిచేసుకునేందుకు వెళ్లార‌ని మ‌రికొంద‌రు అంటుంటారు. అయితే.. తాజాగా జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన విష‌యాల్లో కీల‌క మైన అంశాన్ని కేంద్ర‌మే ఇప్పుడు బ‌య‌ట పెట్టింది. గ‌త నెల‌లో ఢిల్లీ వెళ్లిన జ‌గ‌న్ ప్ర‌ధానిన‌రేంద్ర మోడీని, అమిత్‌షాను కూడా క‌లుసుకున్నారు. ఈ స‌మ‌యంలో …

Read More »

మోడీ కామెంట్ల‌కు హ‌రీష్‌ రావు కౌంట‌ర్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న స‌రైన రీతిలో జ‌ర‌గ‌లేద‌ని ప్రధాని మోడీ పార్ల‌మెంటులో చేసిన వ్యాఖలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్ర‌ధాని కామెంట్ల‌పై తెలంగాణ‌లో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ విరుచుకుప‌డుతోంది. ప్ర‌ధాని కామెంట్ల‌పై టీఆర్ఎస్ పార్టీ ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీష్‌ రావు త‌క్ష‌ణ‌మే స్పందించారు. రాజ్యసభలో ప్ర‌ధాని మాటలు తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచిందని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటును అయన ఎంత వ్యతిరేకిస్తున్నరో అర్థం అవుతున్నదని మండిప‌డ్డారు. తెలంగాణపై మోడీ …

Read More »

ఉచిత ప‌థ‌కాలలో.. విద్యుత్‌, పెట్రోల్‌, గ్యాస్‌

ఉచిత ప‌థ‌కాలతో పేరుతో ఇప్ప‌టికే అమ‌లు అవుతున్న వివిధ సంక్షేమ ప‌థ‌కాల‌పై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతుండ‌గా వాట‌న్నింటినీ త‌ల‌ద‌న్నేలా మ‌రో భారీ మేనిఫెస్టో విడుద‌ల అయింది. కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీ అయిన స‌మాజ్ వాదీ త‌ర‌ఫున సంచ‌ల‌న హామీలు ఇచ్చారు ఆ పార్టీ ర‌థ‌సార‌థి అఖిలేశ్ యాద‌వ్‌. విద్యుత్‌, పెట్రోల్‌, గ్యాస్‌, ఎరువులు ఇలా కీల‌క అవ‌స‌రాలు ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు అఖిలేశ్ ఆల్ ఫ్రీ మేనిఫెస్టోలో వెల్ల‌డించారు. …

Read More »

ఏపీ విభజనపై మోడీ సంచలన వ్యాఖ్యలు

ఎవరెన్ని చెప్పినా.. ఏపీ రాష్ట్ర విభజన చేసిన తీరుపై నెలకొన్న అభ్యంతరాలు అన్ని ఇన్ని కావు. విభజన జరిగిన తీరుపై మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారన్న జంకుతో రాజకీయ పార్టీలు మౌనంగా ఉండటం తెలిసిందే. అప్పుడప్పుడు కొందరు సీనియర్ రాజకీయ నేతలు విభజన జరిగిన తీరును తీవ్రంగా తప్పు పడుతూ.. నాడు కాంగ్రెస్ వ్యవహరించిన వైఖరిని విమర్శించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల వేళ.. …

Read More »

పార్లమెంటు వేదికగా ఏపీ పరువు తీసిన ఎంపీలు

రాష్ట్రంలో ప్రతి రోజు పడుతున్న గొడవలు సరిపోవన్నట్లు చివరకు పార్లమెంటును కూడా వైసీపీ, టీడీపీ ఎంపీలు వేదికగా చేసుకున్నారు. పార్లమెంటులో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దానికి కౌంటరుగా వైసీపీ ఎంపీలు చంద్రబాబు నాయుడుది చేతకానితనం అంటూ  ఎత్తిచూపారు. పైగా రాజ్యసభలో గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ హాలులో క్యాసినో జరిగినట్లు కనకమేడల ఆరోపించారు. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని …

Read More »

ఉద్యోగుల‌ను స‌జ్జ‌ల బెదిరించారు.. చంద్ర‌బాబు

రాష్ట్రంలో ఉద్యోగుల ఉద్య‌మం.. త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్పందించారు. ప్ర‌బుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌ను బెదిరించార‌ని.. అందుకే వారు లొంగిపోయార‌ని.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంకా.. అనేక అంశాల‌పై చంద్ర‌బాబు మాట్లాడారు. కరోనా దేశం మొత్తంలో ఉన్నా.. ఏ రాష్ట్రమూ ఉద్యోగుల వేతనాల్లో కోతలు పెట్టలేదన్నారు. మరి ఇక్కడ (ఏపీలో) ఎందుకు కోత విధించారు? అని  చంద్రబాబు నిలదీశారు. బాబు అధ్యక్షతన  పార్టీ …

Read More »