మంచు మోహన్ బాబు రాజకీయాల్లో ఉన్నారంటే ఉన్నారు. లేరు అంటే లేరు. ఆయన గతంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల్లో ఉండి వాటికి ప్రచారం చేయడం.. ఒక పర్యాయం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగడం తెలిసిందే. ఐతే ఎంపీగా పదవీ కాలం ముగిశాక ఆయన క్రమంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. కొన్నేళ్ల పాటు రాజకీయాల జోలికే వెళ్లలేదు. మళ్లీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ …
Read More »అక్కడ అమ్మకం.. ఇక్కడ తాకట్టు
రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర సర్కారుకు కానీ పాలన వ్యవహారాలు చక్కబెట్టేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తడం సహజమే. ఆదాయం గురించి పట్టించుకోకుండా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల కోసం నిధులు కేటాయించడం ఆ సమస్యకు ప్రధాన కారణమని రాజకీయ నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ ఓట్ల కోసం నేతలు ఎంతకైనా వెనకాడడం లేదు. హామీలు గుప్పిస్తూ పథకాలు అమలు చేస్తూనే ఉన్నారు. అభివృద్ధి పనులు ఆగినా.. పథకాలను మాత్రం ఆపడం …
Read More »కేంద్రం ఎందుకు ప్లేటు ఫిరాయించింది ?
ఇపుడిదే విషయమై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతోంది. రాష్ట్ర విభజన అంశాలపై ఈనెల 17వ తేదీన చర్చించేందుకు ఒక కమిటీని నియమించినట్లు స్వయంగా ఉదయం 11 గంటల ప్రాంతంలో కేంద్రం ప్రకటించింది. దాంతో ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేసినట్లే అన్నంతగా జనాలంతా చాలా హ్యాపీగా ఫీలయిపోయారు. ఇంత కాలానికైనా రాష్ట్రానికి న్యాయం జరుగుతోందని సంబరపడ్డారు. అయితే రాత్రి 7 గంటలకు మళ్ళీ కేంద్రం చేసిన ప్రకటనతో జనాలకు మండిపోయింది. …
Read More »మోడీ.. దేశం నీ అబ్బ సొత్తా: నిప్పులు చెరిగిన కేసీఆర్
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి రెచ్చిపోయారు. మోడీ అవినీతి పరుడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అవినీతి చిట్టా తన దగ్గర ఉందని చెప్పారు. ప్రధాని మోడీ ప్రభుత్వానికి పిచ్చి ముదురుతోందని సీఎం దుయ్యబట్టారు. యాదాద్రి జిల్లాలో కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పిచ్చి పిచ్చి పాలసీలు తీసుకొస్తున్నారని తప్పుబట్టారు. ‘‘మోడీ దేశం నీ అబ్బ సొత్తు కాదు. లాఠీ, లూటీ, …
Read More »ప్రత్యేక హోదా టాపిక్ ఔట్… ఏపీకి షాకిచ్చిన కేంద్రం
నవ్యాంధ్రప్రదేశ్‌కు ఒక్క రోజులోనే.. చెప్పాలంటే కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్రం ఊహించని షాకిచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై చర్చించేందుకు తేదీ, సమయం నిర్ణయించిన కేంద్రం.. ఎజెండాలో తొలుత పెట్టిన ప్రత్యేక హోదా అంశాన్ని తర్వాత తొలగించిందని తెలుస్తోంది. సహజంగానే, ఈ కీలక అంశం తొలగించడంతో ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ ప్రభుత్వానికి మింగుడు పడటం లేదని చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉండిపోయిన …
Read More »మేధావుల సాయం కోరుతున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ నేతలకు నిత్యం క్లాస్ ఇస్తున్నారు. ఏపీ ప్రబుత్వంపై విరుచుకుపడం డి.. ప్రభుత్వం చేస్తున్న పనులను ఎండగట్టండి.. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ననిలదీయండి.. అని చెబుతున్నారు. అయితే.. పెద్దగా ఎవరూ స్పందించడం లేదు. ఒకవేళ స్పందించినా.. పోలీసులు ఎంట్రీ ఇస్తున్నారు.. ప్రభుత్వం స్పందించేలోగా.. పోలీసులు స్పందిం చేస్తున్నారు. దీంతో నాయకులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో చంద్రబాబు రూటు మార్చారు. …
Read More »ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం పరిశీలిస్తోందా?
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ ను కేంద్రం పరిశీలిస్తోందా? నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడి ఏడు సంవత్సరాలు అయినప్పటికీ బీజేపీ మినహా ఇతర పార్టీలన్నీ చేస్తున్న ప్రధాన డిమాండ్లలో ఒకటైన ఈ అంశాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. దీనికి కారణం…రాష్ట్ర విభజన అనంతరం పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలపై కేంద్ర హోంశాఖ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయగా అందులో ప్రత్యేక హోదాకు స్థానం కల్పించడం ద్వారా ఈ …
Read More »చిన్న పార్టీలే అనుకుంటే.. కొంప ముంచుతాయ్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టి అయిదు రాష్ట్రాల ఎన్నికలపై ఉంది. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే అక్కడ తొలి దశ పోలింగ్ కూడా పూర్తయింది. అధికారం నిలబెట్టుకోవడం కోసం బీజేపీ, గద్దెనెక్కడం కోసం కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ హోరాహోరీగా పోరాడుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పార్టీల విజయ సమీకరణాలు మార్చేంతలా చిన్నపార్టీలు ప్రభావం చూపే అవకాశం ఉంది. చిన్న పార్టీలే …
Read More »బీజేపీ కంచుకోటలో పవర్ఫుల్ మహిళ
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో గోరఖ్ పూర్ కూడా ఒకటి. ఎందుకంటే గోరఖ్ పూర్ అనేది యోగి కంచుకోట. ఇక్కడి నుండే యోగి ఐదు సార్లు వరుసగా ఎంపీగా గెలిచారు. అలాంటిది మొదటిసారి యోగి గోరఖ్ పూర్ అర్బన్ నుంచి పోటీ చేస్తున్నారు. యోగి అంటే బీజేపీ తరపున ఎంతటి బలమైన అభ్యర్ధో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటి యోగిపై ఎస్పీ ఒక మహిళను వ్యూహాత్మకంగా పోటీలోకి దింపింది. …
Read More »కేసీఆర్ పెద్ద స్కెచ్ వేశారే!
రాజకీయ చణక్యుడిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పేరుంది. ఆయన వ్యూహాలు, ప్రణాళికలు ఆ స్థాయిలో ఉంటాయి మరి. ఆయన ఏం చేసినా అందులో కచ్చితంగా రాజకీయ ప్రయోజనాలు ఉంటాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ప్రధాని మోడీపై యుద్ధం చేస్తున్నారు. ఏదేమైనా సరే తగ్గేదేలే అంటూ తీవ్ర వ్యాఖ్యలతో కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇలా కేంద్రంపై కేసీఆర్ …
Read More »మనసులో మాట బయటపెట్టారా?
జనగామ బహిరంగ సభలో కేసీయార్ తన మనసులోని మాటను బయట పెట్టేసినట్లేనా ? ఇపుడిదే చర్చ జరుగుతోంది. ఎప్పటినుండో కేసీయార్ కు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే కోరిక బలంగా ఉంది. అందుకనే ఇతర ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడుతున్నది. ఎప్పటికప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా నరేంద్ర మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా పావులు కదపటానికి ప్రయత్నిస్తునే ఉన్నారు. కేసీయార్ వేసే అడుగులు, మాటలు చూస్తుంటే జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలనే బలమైన కోరిక …
Read More »ఉగాదికి కొత్త జిల్లాలు రెడీయా ?
రాబోయే ఉగాది నాటికి కొత్త జిల్లాల ప్రక్రియ పూర్తి కావాలనే పట్టుదల ఏపీ ప్రభుత్వంలో కనిపిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచుతూ ప్రభుత్వం ఈ మధ్యనే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కొన్నిచోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హిందుపురం, రాజంపేట, ధర్మవరం, విజయవాడ లాంటి చోట్ల జిల్లాల కేంద్రాలను మార్చాలని, పేర్లను మార్చాలనే డిమాండ్లు వినబడుతున్నాయి. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీలోనే అభ్యంతరాలు, సూచనలు, సలహాలు …
Read More »