గత 2019 ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని భుజాలపైకి ఎత్తుకున్న కీలక నాయకుడు.. తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడంతోపాటు.. ఆయన విజయానికి కీలక పాత్ర పోషించిన యువ నాయకుడు.. తాజాగా టీడీపీకి జైకొట్టారు. ఆయనే ఉమ్మడి కృష్నాజిల్లాలోని అవనిగడ్డకు చెందిన పరుచూరి సుభాష్ చంద్రబోస్. కమ్మ సామాజిక వర్గానికి చెందిన బోస్.. 2019 ఎన్నికల్లో ఇక్కడ అన్నీ తానై వ్యవహరించారు. ఫలితంగా …
Read More »నేను ప్యాకేజీ స్టార్ అయితే.. : పవన్ హాట్ కామెంట్స్
“వైసీపీ మంత్రులు, నాయకులు.. నను ప్యాకేజీ స్టార్ అంటున్నారు. నేను అమ్ముడు పోయానని చెబుతున్నారు. నేను ఇలా చేయాలని అనుకుంటే.. చాలా తేలికైన పని. ఇదే జరిగి ఉంటే.. వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు” అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. లక్ష్యం పెద్దదైనప్పుడు.. భయపడాల్సిన అవసరం లేదని.. దాని కోసం పనిచేస్తే సరిపోతుందని అన్నారు. అందరం కలిసి కష్టపడి.. పెట్టుకున్న లక్ష్యాన్ని సాధిద్దామని ఆయన కార్యకర్తలు, …
Read More »ఏపీలో మద్య నిషేధం సాధ్యం కాదు : పవన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో మద్య నిషేధం సాధ్యం కాదని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. మద్యాన్ని నిషేధించకపోయినా.. మద్యం ధరలను మాత్రం తగ్గిస్తామన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఉన్న ధరలను రాష్ట్రంలో అమలు చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. వారాహి యాత్రలో భాగంగా గత ఎన్నికల్లో తాను పోటీ చేసి ఓడిపోయిన భీమవరం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగాశుక్రవారం రాత్రి నిర్వహించిన సభలో పవన్ మాట్లాడారు. …
Read More »‘హనీరోజ్’ మీటింగ్ పెడితే.. పవన్ సభలను మించి జనం వస్తారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలపై తరచుగా విమర్శలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల సంగతి తెలిసిందే. సాక్షాత్తూ.. సీఎం జగనే వారాహి యాత్రపై పవన్ ఊగుతాడని.. గంతులేస్తాడని.. తొడలు కొడుతున్నాడని వ్యాఖ్యానించారు. ఇక, అధినేతే.. అలా వ్యాఖ్యానిస్తే.. తాము మాత్రం తక్కువ తిన్నామా.. అంటూ.. ఇతర నాయకులు కూడా ఇదే తరహాలో పవన్‌పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా పవన్ వారాహి యాత్ర, ఆయన సభలకు వస్తున్న జనాలు.. …
Read More »రాష్ట్ర పంట గంజాయి… రాష్ట్ర ఆయుధంగా గొడ్డలి
ఏపీలోని వైసీపీ పాలన పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకువెళ్తానని 2019లో రోడ్లవెంట తిరిగి.. ఓట్లు గుంజుకున్న సీఎం జగన్.. రాష్ట్రాన్ని నిజంగానే ఎక్కడికో తీసుకువెళ్లారని.. ఎవరూ ఇలా ఊహించలేదని కూడా వ్యాఖ్యానించారు. రాష్ట్ర పంటగా గంజాయిని.. రాష్ట్ర ఆయుధంగా గొడ్డలిని.. ఆయన పరిచయం చేశారని పవన్ సటైర్లు వేశారు. రాష్ట్ర గుర్తుల గురించి.. నేటి యువతకు, పిల్లలకు ఇదే …
Read More »ఖమ్మం జనగర్జన… భట్టికి అరుదైన గుర్తింపు
తెలంగాణపైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో రాజకీయాల పైన ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటున్నారు. ఆ నివేదికల ఆధారంగా మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ యాత్ర గురించి తాజాగా రాహుల్ గాంధీ ఆరా తీసారు. రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రేతో పాటుగా ముఖ్య నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. సుదీర్ఘంగా యాత్ర కొనసాగిస్తున్న భట్టి ప్రధానంగా పేద ప్రజలతో …
Read More »ఈటలపై ప్రేమ వెనుక.. కేసీఆర్ వ్యూహం ఏంటి?
మాజీ మంత్రి.. ప్రస్తుతం బీజేపీ నాయకుడిగా ఉన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విషయంలో తెలంగాణ సర్కారు నాలుగు మాసాల కిందటికి.. ఇప్పటికి.. భిన్నంగా రియాక్ట్ అయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. నాలుగైదు నెలల కిందట.. ఈటలపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ అధినేత నుంచి మంత్రుల వరకు.. రాజకీయాలను వేడెక్కించారు. అంతేకాదు.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆయనను ఓడించేందు కు గట్టి ప్రయత్నమే చేశారు. ఇక, ఈటల కూడా.. అధికార …
Read More »బెజవాడ పై కేసీఆర్ నజర్
సోలాపూర్ ట్రిప్‌తో జోష్ నింపుకున్న గులాబీ బాస్ ఇప్పుడు ఏపీలోనూ అడుగులు వేయడానికి రెడీ అవుతున్నారు. ఇంతకుముందు మహారాష్ట్రలో మూడు సభలు పెట్టినప్పటికీ ఈసారి భారీ వాహన శ్రేణితో బల ప్రదర్శనలా ఆ రాష్ట్రానికి వెళ్లడంతో కేసీఆర్ అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా మహారాష్ట్ర పార్టీలు ఆయనపై మాటల దాడి ప్రారంభించాయి. శివసేన ఉద్దవ్ వర్గం నేతలు ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్‌లు కేసీఆర్ తెలంగాణ వ్యవహారాలు చూసుకుంటే చాలు, …
Read More »జగన్‌కు మామూలు వాయింపుడు కాదు
దత్తపుత్రుడు.. ప్యాకేజీ స్టార్.. మూణ్నాలుగు పెళ్లిళ్లు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు చేయాల్సి వస్తే.. వైసీపీ వాళ్లు ఎంచుకునే అస్త్రాలు ఇవి. ఆయన నిజానికి చేసుకున్నది మూడు పెళ్ళిళ్ళే అయినా.. జగన్ అండ్ కో మాత్రం ఒకటి యాడ్ చేసి నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నట్లుగా విమర్శలు చేస్తుంటారు. నాలుగు కాదు మూడే అని జనసేన మద్దతుదారులు ఖండిస్తే.. మరి మూడు పెళ్లిళ్లు చేసుకోవడం న్యాయమా అని కౌంటర్ …
Read More »నాన్నకు ప్రేమతో.. ఢిల్లీ లో కేటీఆర్ ప్రదక్షిణలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి.. మంత్రి కేటీఆర్ పై సటైర్లు రువ్వారు. ఇటీవల కేటీఆర్ ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి అమిత్‌షాతో భేటీ అవుతారనే ప్రచారం జరిగింది. అయితే.. ఆయన పీయూష్ గోయల్‌ను కలిసి.. వినతి పత్రం ఇచ్చి వచ్చారు. ఇక, ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ, తాజాగా రేవంత్‌రెడ్డి కేటీఆర్ ఢిల్లీ టూర్‌పై సటైర్లు రువ్వారు. నాన్నకు ప్రేమతో.. …
Read More »నా ప్రాణం పోయినా ఆ పని చెయ్యను: కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్యాగం చేశారా? కేంద్రం ప్రతిపాదించిన.. విద్యుత్ సంస్కరణలను అమలు చేసేది లేదని ఆయన తెగేసి చెప్పారా? అంటే.. ఔననే అంటున్నారు అధికారులు.. ప్రజా ప్రతినిధులు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే ఇన్సెంటివ్స్‌కు .. సంస్కరణలకు ముడి పెట్టిన విషయం తెలిసిందే. వివిధ రూపాల్లో తెచ్చిన సంస్కరణలు అమలు చేస్తే.. అదనంగా రుణాలు.. నిధులు ఇచ్చి ప్రోత్సహిస్తామని.. గత రెండేళ్లుగా చెబుతున్న విషయం తెలిసిందే. గతంలో ఒకసారి.. …
Read More »బీజేపీ నేతలకు ‘డొక్కలో తన్ని’ ట్రీట్‌మెంట్ ఇవ్వాలి – బీజేపీ నేత
తెలంగాణలో బలపడాలని.. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పదే పదే చెబుతున్న కమల నాథులకు.. స్థానిక నేతల మధ్య పెరుగుతున్న అంతరం కలవర పరుస్తోంది. ఒకవైపు పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్‌కు వ్యతిరేకంగా కొందరు చక్రం తిప్పుతున్నారు. మరికొందరు.. పార్టీకి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్‌ను వీడి వచ్చిన ఈటల రాజేందర్, కాంగ్రెస్‌కు దూరమైన కోమటిరెడ్డి రాజగోపాల్ వంటివారు బీజేపీలో ఉన్నా.. ఎప్పుడు కాడి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates