ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. వైసీపీ లెక్క‌లు ఇవే!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము టీడీపీతో క‌లిసి వెళ్తామంటూ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న చేసిన దాదా పు వారం అవుతోంది. ఈ వారం రోజుల్లో జ‌న‌సేన‌లో వ‌చ్చిన మార్పు కంటే.. జ‌న‌సేన నాయ‌కులు చేస్తున్న చ‌ర్చ‌లకంటే కూడా వైసీపీ నాయ‌కులు చేస్తున్న చ‌ర్చ‌లు, వారిలో వ‌చ్చిన మార్పు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింపాల‌ని అనుకుంటున్న‌వారు.. కొత్త‌గా సీట్లు ద‌క్కించుకుని విజ‌యం సాధించాల‌ని భావిస్తున్న‌వారు.. వైసీపీలో ఎక్కువ మందే ఉన్నారు.

అయితే.. ఇప్పటి వ‌ర‌కు ఉన్న రాజ‌కీయం వేరు. ఇప్పుడు మారిన రాజ‌కీయ ముఖ చిత్రం వేరుగా ఉండ‌డం తో వీరంతా కూడా డోలాయ‌మానంలో ప‌డ్డారు. అనేక‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి స‌త్తా ఉంది. బ‌ల‌మైన నియోజక‌వ‌ర్గాలు దాదాపు 80 వ‌ర‌కు టీడీపీ ఖాతాలో ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో వీటిలో వైసీపీ స్వ‌ల్ప మెజారిటీతోనే విజ‌యం ద‌క్కించుకుంది. దీనికి కార‌ణం.. ఏ పార్టీకి ఆ పార్టీ వేర్వేరుగా పోటీ చేయ‌డ‌మే. అయితే..ఇప్పుడు టీడీపీ, జ‌న‌సేన చేతులు క‌లిపిన త‌ర్వాత‌.. ఈ ప‌రిస్థితి మారుతుంద‌ని వైసీపీ నాయ‌కులు లెక్క‌లు వేసుకుంటున్నారు.

ఎంత కాద‌న్నా.. దాదాపు 70 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ-జ‌న‌సేన పొత్తు ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌న్న‌ది వైసీపీ నేత‌ల అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో క‌నిపిస్తున్న, వినిపిస్తున్న‌ విష‌యం. గ‌త ఎన్నిక‌ల్లో ఏదో కొట్టుకు వ‌చ్చినా.. ఇప్పుడు మాత్రం ప‌రిస్థితి అంత ఈజీకాద‌నేది నిర్మొహ‌మాటంగా వైసీపీ నాయ‌కులు అంగీక‌రిస్తున్న విష‌యంకూడా. ఇక‌, ప‌థ‌కాలు త‌మ‌ను ర‌క్షిస్తాయ‌ని.. ఇన్నాళ్లుగా వైసీపీ నాయ‌కులు ఆశ‌లు పెట్టుకున్నా.. ఇప్పుడు వైసీపీని మించిన ప‌థ‌కాల‌ను టీడీపీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించ‌డం.. గ్రామీణ స్థాయిలో ప్ర‌చారం చేయ‌డంతో త‌మ ప‌థ‌కాలు కూడా త‌మ‌ను కాపాడే ప‌రిస్థితి లేద‌ని వైసీపీ నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు.

పొత్తుల‌ను సాధార‌ణంగా తీసుకునే ప‌రిస్థితి లేద‌ని ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు ఒక‌రు వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుల ప్ర‌భావం ఉంటుంది. దీనిని దీటుగా ఎదుర్కొనేందుకు మాకు కూడా వ్యూహాలు కావాలి. ప‌థ‌కాలు, నేత‌ల చ‌రిష్మా.. వంటివి ఈ ద‌ఫా కొంత ప‌నికి వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంది. దీనికి మించి ఏం చేయాల‌నేది ఇప్పుడు పార్టీ ఆలోచ‌న చేయాలి. కేవ‌లం ప‌థ‌కాలు మాత్ర‌మే కాపాడ‌తాయ‌ని అనుకుంటే.. టీడీపీ కూడా ప‌థ‌కాలు ప్ర‌క‌టించింది. సో.. ఇవి కాదు.. ఏదో చేయాలి. అంత‌కు మించి ప్ర‌జ‌ల‌కు చేరువ కావాలి“ అని ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి కి చెందిన మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. సో.. దీనిని బ‌ట్టి ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. నియోజ‌క‌వ‌ర్గాల్లో పరిస్థితి.. వైసీపీ నేత‌ల‌ను గుంజాట‌న‌కు దింపింద‌నే చెబుతున్నారు ప‌రిశీల‌కులు.