కాబోయే సీఎం చంద్రబాబే..సంచలన సర్వే

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికలకు 6 నెలల ముందు చంద్రబాబును అరెస్టు చేసి జగన్ తప్పు చేశారని చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ అరెస్టు జగన్ పతనానికి నాంది అని, చంద్రబాబుకు సింపతీ వచ్చి రాబోయే ఎన్నికల్లో తప్పక టీడీపీ విజయం సాధిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆల్రెడీ సింపతీ యూనివర్సిటీలో జగన్ పీహెచ్ డీ చేశారని, ఆ సింపతీ రాజకీయాలతోనే ముఖ్యమంత్రి అయ్యారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. జగన్ వ్యూహాత్మకంగానే చంద్రబాబును అరెస్టు చేయించారని, త్వరలోనే లోకేష్ ను కూడా అరెస్టు చేయిస్తారని అంటున్నారు.

టీడీపీకి అనూహ్యంగా అరెస్టులతో షాకిచ్చి కేడర్ నైతిక స్థైర్యాన్ని దెబ్బకొట్టాలన్నదే జగన్ వ్యూహమని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై సి ఓటర్ నిర్వహించిన సర్వేలో సంచలన ఫలితాలు వచ్చాయి. చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీకి విపరీతమైన సానుభూతి వచ్చిందని ఆ సర్వేలో వెల్లడైంది. సి ఓటర్ సర్వేను ఐఏఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ ట్వీట్ చేయడంతో అది ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.

రాజకీయ కుట్రతోనే చంద్రబాబును అరెస్టు చేశారని ఏపీ ప్రజలు భావిస్తున్నారని సర్వేలో వెల్లడైంది. చంద్రబాటు అరెస్ట్‌తో జగన్‌లో అభద్రతాభావం పెరిగిపోయిందని పేర్కొంది. చంద్రబాబు అరెస్ట్ రాబోయే ఎన్నికలపై తప్పక చూపుతుందని వెల్లడించింది. జనసేన పొత్తుతో చంద్రబాబు సీఎం కావడం ఖాయమని తేల్చింది. అయితే, చంద్రబాబు అరెస్ట్‌తో పెద్దగా నష్టం లేదని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారని కూడా సర్వేలో వెల్లడైంది.