పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భామినిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులతో ముచ్చటించారు. విద్యార్ధులకు ఇచ్చిన లెర్నింగ్ టూల్స్ ను పరిశీలించారు. పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ సామర్ధ్యాలు పెంచేందుకు వీలుగా కార్యాచరణ చేపట్టాలని విద్యాశాఖను ఆదేశించారు. విద్యార్ధుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి, వారి తల్లిదండ్రులతో స్వయంగా మాట్లాడారు.
స్టెమ్ ల్యాబ్ పరిశీలించారు. ల్యాబ్ లో విద్యార్థినులు ప్రజెంటేషన్ ఇచ్చిన తీరును అభినందించారు. క్లాస్ రూంలో కూర్చొని క్లికర్ విధానాన్ని విద్యార్థులతో కలిసి పరిశీలించారు. రెయిన్ ఫాల్ పై వీడియో ప్రదర్శించి దాని ఆధారంగా ప్రశ్నలు అడిగారు. మంచి మార్కులు వచ్చిన వారికి సాటి విద్యార్ధులతో చప్పట్లు కొట్టించారు.
సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థులతో మమేకం కావడం, ముచ్చటించటం, వాళ్లతో కలిసి చప్పట్లు కొట్టడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాను నిరంతర విద్యార్థిని అని ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు చెబుతూ ఉంటారు. నూతన అంశాలను తెలుసుకోవడం తద్వారా పాలనలో సరికొత్త పంథాని ఆవిష్కరించడం అందరికీ తెలిసిందే.
భామినిలోని ఏపీ మోడల్ స్కూల్‌లో స్టెమ్ ల్యాబ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. పాఠశాలలోని ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ లో సీఎం ముందు విద్యార్థినులు ప్రజెంటేషన్ ఇవ్వగా, వారిని సీఎం అభినందించారు. ల్యాబ్ లో విద్యార్థులు చెబుతున్న వాటిని ఆసక్తిగా విన్నారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates