పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. అందులో సుస్వాగతం సినిమా ఒకటి. ఈ సినిమా తర్వాత పవన్ తో సినిమా చేయాలని మాజీ మంత్రి ఒకరు భావించారు. కొన్ని కారణాలతో అది ఆచరణలోకి రాలేదు.. ఆ విషయాన్ని స్వయంగా ఆ మాజా మంత్రి ఈ రోజు వెల్లడించారు. విషయం ఏంటంటే.. ఈ రోజు చిలకలూరిపేటలో మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ జరిగింది. ఆ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అదే కార్యక్రమంలో మాజీ మంత్రి, ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు.
‘1998లో సుస్వాగతం ప్రివ్యూ షో చూశాను. అప్పటికి నేను రాజకీయాల్లోకి రాలేదు. పవన్ కళ్యాణ్ కు నేను ఫ్యాన్ ని. నేను పవన్కల్యాణ్ తో ఒక సినిమా తియ్యాలని అని అనుకున్నాను. భీమినేని శ్రీనివాసరావు, పవన్కల్యాన్, నేను ముగ్గురం కలిసి సుస్వాగతం ప్రివ్యూ షో చూసి సినిమాకు కమిట్మెంట్అయ్యాం. నేను సినిమా తియ్యాలని అడగగానే ఆయన వెంటనే ఒప్పుకున్నారు. భీమినేని శ్రీనివాసరావుది మా ఊరి పక్కనే బేతపూడి. ఆ తర్వాత అనుకోకుండా నేను రాజకీయాల్లోకి వచ్చాను. లేకుంటే పవన్ గారితో సినిమా తీసి ఒక సంచలనం సృష్టించేవాడిని..’ అని ప్రత్తిపాటి పుల్లారావు సభాముఖంగా వివరించారు.
ఆయన మాట్లాడుతుండగా వేదికపై ఉన్న పవన్ కళ్యాణ్ , విన్నారు. కోట్లాదిమంది అభిమానుల గుండె గుడిలో ఆరడుగుల బుల్లెట్ ఉందన్నారు. ఒక అంకిత భావం కలిగిన నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్ అని అన్నారు. ఆత్మవిశ్వాసం + ఆత్మగౌరవం + ఆత్మీయత – అహంకారం = పవన్ కల్యాణ్ అంటూ ఆయన అభివర్ణించారు. పవన్ తో తాను సినిమా నిర్మించాలని అనుకున్నాను అని ప్రత్తిపాటి తెలపగానే పవన్ కళ్యాణ్ తో సహా అక్కడున్న వారంతా ఆసక్తిగా విన్నారు. పవన్ఆరోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నట్లు చిరునవ్వులు నవ్వారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates