ఎన్నికలకు ఇంకా ఐదారు నెలల సమయం ఉండగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయం రంజుగా మారుతోంది. గత నెల రోజుల్లో ఎంత వేగంగా పరిణామాలు మారిపోయాయో తెలిసిందే. కొన్ని నెలల తర్వాత కానీ క్లారిటీ రాదనుకున్న తెలుగుదేశం-జనసేన పొత్తు విషయమై గత నెలలోనే స్పష్టత వచ్చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో చంద్రబాబు అరెస్టు అయిన కొన్ని రోజులకే పవన్ స్వయంగా పొత్తును అధికారికంగా ప్రకటించాడు. ఐతే పవన్ ప్రకటన అయితే చేశాడు …
Read More »జనసేన-టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు కసరత్తు జరుగుతోంది. రెండు పార్టీల నుంచి సీనియర్ నేతలు కూర్చుని ఇదే విషయమై కసరత్తు చేస్తున్నట్లు వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. కృష్ణాజిల్లాలోని పెడనలో మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా కష్టంగానే ఉన్న తప్పనిస్ధితిలో ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసినట్లు పవన్ చెప్పారు. టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు వీలుగా పవన్ ఎన్టీయేలో నుంచి …
Read More »కేటీఆర్ కు పెద్ద పరీక్షేనా ?
రాబోయే తెలంగాణా ఎన్నికలు కేసీయార్ సంగతేమో కానీ మంత్రి కేటీయార్ కు మాత్రం పెద్ద పరీక్షగా మారేట్లుంది. ఎందుకంటే కేసీయార్ దాకా వెళ్ళాలంటే ఎవరికీ సాధ్యంకావటంలేదు. టికెట్లు దక్కనివాళ్ళు, ఆశావహులు, అసంతృప్తులు, అభ్యర్దులు ఇలా ప్రతి ఒక్కళ్ళకి సమస్యలున్నాయి. టికెట్లు ఆశించి భంగపడిన వాళ్ళతో పాటు టికెట్లు దక్కించుకున్న వాళ్ళు కూడా సమస్యలతోనే ఉన్నారు. భంగపడిన వాళ్ళకేమో టికెట్లు రాలేదని అసంతృప్తిగా ఉంటే టికెట్లు దక్కించుకున్న వాళ్ళేమో తమకు నియోజకవర్గాల్లో …
Read More »బాలయ్య పొలిటికల్ యాక్టివ్ మోడ్ ?
తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురం నియోజకవర్గంలో పదేళ్ళుగా ఎంఎల్ఏగా పనిచేస్తున్నా పెద్దగా యాక్టివ్ గా ఉండరు. పార్టీ కార్యక్రమాల్లో తనకు వీలైనపుడు పాల్గొంటారు లేకపోతే లేదు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా వీలుంటేనే హాజరవుతారు. దీనికి కారణం ఏమిటంటే ఎక్కువ భాగం సినిమా షూటింగుల్లో ఉండటమే. సినిమాలే బాలయ్యకు ఫుల్ టైం, పాలిటిక్స్ కేవలం పార్ట్ టైమ్ మాత్రమే. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టు, రిమాండు నేపథ్యంలో మాత్రమే బాలకృష్ణ …
Read More »బీఆర్ఎస్ పై బీజేపీ మైండ్ గేమ్
గడచిన వారం రోజులుగా బీఆర్ఎస్ పై బీజేపీ నేతలు మైండ్ గేమ్ పెంచేస్తున్నారు. దీనికి అదనంగా నరేంద్రమోడి నిజామాబాద్ పర్యటనలో కేసీయార్ టార్గెట్ చేసిన వ్యాఖ్యలతో మైండ్ గేమ్ పరాకాష్టకు చేరుకుంది. తాజాగా కరీనంగర్ ఎంపీ బండి సంజయ్ ఏమంటారంటే తొందరలోనే బీఆర్ఎస్ లో చీలికవస్తుందట. కేసీయార్ గడచిన 15 రోజులుగా ఎక్కడా కనిపించటంలేదని, అధికారం విషయంలో కేటీయార్-హరీష్ రావు మధ్య విభేదాలు తీవ్రస్ధాయిలో ఉన్నాయని పదేపదే చెబుతున్నారు. ముఖ్యమంత్రి …
Read More »ఐ డోంట్ కేర్..జూ.ఎన్టీఆర్ పై బాలకృష్ణ కామెంట్స్
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తారక్ తో పాటు ఆయన సోదరుడు కల్యాణ్ రామ్ కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించకపోవడం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ మీట్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి బాలయ్యను మీడియా ప్రతినిధులు అడిగారు. దీంతో, …
Read More »టీడీపీతో ఎందుకు కలిశామో చెప్పిన పవన్
తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, హైడ్రామా మధ్య పెడనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రలో భాగంగా బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా తనకు పోలీసులు నోటీసులు ఇచ్చిన వ్యవహారంపై పవన్ తీవ్రంగా స్పందించారు. తాను జనసేన కార్యకర్తలను, టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టలేదని, తాను కేవలం ఆవేశంగా మాట్లాడానని చెప్పారు. తాను ఎప్పటికీ అలా చేసేవాడిని కాదని, కొట్టండి, తగలబెట్టండి అని చెప్పనని పవన్ అన్నారు. ఈ …
Read More »బాబు అరెస్టుతో బీజేపీకి సంబంధం లేదు: సుజనా చౌదరి
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉంది…లేదంటే జగన్ అంత ధైర్యంగా చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం లేదు…ఇటువంటి వ్యాఖ్యలు గ్రామాలలోని రచ్చబండలు మొదలు తలపండిన రాజకీయ నాయకులు సైతం చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి తోడు, చంద్రబాబు అరెస్టు విధానాన్ని మాత్రమే ఖండించిన ఏపీ బీజేపీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదన్న టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై …
Read More »ఏఏజీ పొన్నవోలుపై జడ్జి అసహనం
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఈ రోజు వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఆ పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 11 గంటలకు వాదనలు వింటామని చెప్పింది. మరోవైపు, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ …
Read More »బాబు అరెస్టు బాధాకరం.. వ్యక్తిగతంగా నన్ను కలచివేస్తోంది
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో మరో తెలంగాణ మంత్రి గొంతు ఎత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితుడనే ముద్ర ఉన్న తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా ఈ విషయంలో రియాక్టయ్యారు. చంద్రబాబు అరెస్ట్ చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 73 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడును అరెస్ట్ …
Read More »ప్రతిపక్షాల దిమ్మతిరిగే కేసీఆర్ మేనిఫెస్ట్ డిసైడయింది
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో…కీలక నిర్ణయాలతో కదనరంగంలోకి దిగేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సిద్ధమయ్యారు. ప్రభుత్వపరంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ గులాబీ దళపతి హోదాలో రాబోయే ఎన్నికలకు ఎలాంటి హామీలు ఇవ్వనున్నారనే ఆసక్తి సహజంగానే ఉంటుంది. ఆ ఉత్కంఠను బ్రేక్ చేసేందుకు డేట్ ఫిక్సయింది. ఈ నెల 16న వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి మేనిఫెస్టో ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని …
Read More »పవన్ కు పోలీసుల నోటీసులు
కృష్ణాజిల్లా పెడనలో బుధవారం జరగనున్న జనసేన బహిరంగ సభలో రాళ్ల దాడి జరిగే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రెండు మూడు వేల మంది వైసీపీ గూండాలు, క్రిమినల్స్ పెడన సభలోకి చొరబడి రాళ్లు, కత్తులతో దాడి చేసే ఛాన్స్ ఉందని పవన్ సంచలన ఆరోపణలు చేశారు. రేపు ఏం జరిగినా సీఎం జగన్, రాష్ట్ర డిజిపి, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates