Political News

కావాలనే సంజయ్ ను బిగిస్తోందా ?

మహారాష్ట్రలో మొదలైన రాజకీయ సంక్షోభం నుండి ప్రభుత్వాన్ని బయటపడేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న సంజయ్ రౌత్ చుట్టూ కేంద్రప్రభుత్వం ఉచ్చు బిగిస్తున్నట్లే ఉంది. కష్టకాలంలో కావాలనే ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉథ్థవ్ థాక్రే నుండి రౌత్ ను దూరం చేసేందుకే కేంద్రం ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని వాడుకుంటుందోనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. నిజానికి సీఎంకు బదులు మొత్తం వ్యవహారాలను ఇపుడు రౌతే పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి సమయంలో రౌత్ గనుక అందుబాటులో లేకపోతే …

Read More »

రెండేళ్లే ఉంది.. ఏదైనా చేయండి సార్‌..

రాష్ట్రంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి.. మూడేళ్లు అయింది. ఇది ఏ ప్ర‌బుత్వానికైనా.. చాలా మెజారిటీ కాలం. అయితే.. అనూహ్యంగా జ‌గ‌న్‌కు ఇబ్బందిక‌ర ప‌రిణామం ఎదురైంది. క‌రోనా రావ‌డంతో రెండేళ్ల కాలం కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయింది. దీంతో అభివృద్ధి చేసేందుకు.. పెట్టుబ‌డులు తెచ్చేందుకు కొంత ఇబ్బందిక‌ర ప‌రిణామాలు ఎదుర‌య్యాయ‌నేది వాస్త‌వం. అయితే.. ఈ విష‌యాన్ని ప్రొజెక్టు చేసుకుని.. ప్ర‌జ‌ల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌డంలో వైసీపీ నాయ‌కులు విఫ‌ల‌మ‌య్యారు. ఎందుకంటే.. ఇప్పుడు …

Read More »

ఏపీకి త్వ‌ర‌లోనే మంచి రోజులు: కె. రాఘవేంద్రరావు

రాష్ట్రంలో ‘ఎలక్షన్లు రాబోతున్నాయి.. టీడీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి’ అని ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘవేంద్రరావు పిలుపునిచ్చారు. అన్నగారి(ఎన్టీఆర్) ఆశీస్సులతో మంచి రోజులు వస్తాయని ఆయన హితవు పలికారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో ‘వేటగాడు’ సినిమాను వీక్షించారు. ఎన్నికలు రాబోతున్నాయి.. కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయ‌న‌ సూచించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో ప్రదర్శించిన వేటగాడు …

Read More »

ఎన్టీఆర్ విగ్ర‌హానికి వైసీపీ రంగులు..

టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ పుట్టిన గ‌డ్డ‌పైనే ఆయ‌న‌కు ఘోర అవ‌మానం జ‌రిగింది. మ‌రో రెండు రోజుల్లో ఇక్క‌డ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న ఉన్న నేప‌థ్యంలో అధికార వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారు. టీడీపీ నేత‌ల‌ను రెచ్చ‌గొట్టి.. ఏదో ఒక విధంగా ఇక్క‌డ ర‌సాభాస సృష్టించాల‌నే వ్యూహాన్ని సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి కొంద‌రు వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. ఆ పార్టీ …

Read More »

మారీచుల‌తో యుద్ధం.. వెంట్రుక కూడా పీక‌లేరు..: జ‌గ‌న్

అమ్మఒడి పథకంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ పథకాన్ని విమర్శించే వారిలో ఒక్కరైనా.. పిల్లల్ని చదివించే తల్లులకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని ఏపీ సీఎం జగన్‌ ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అమ్మఒడి లాంటి పథకం తెచ్చారా? అని అన్నారు. విద్యారంగం సంక్షేమానికి ఏనాడైనా ఒక్క రూపాయి ఇచ్చారా?.. విమర్శించే దుష్టచతుష్టయానికి నిజాలు చెప్పే ధైర్యం ఉందా అని ముఖ్యమంత్రి నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో 95 శాతం …

Read More »

బాబుకు వార్నింగ్ బెల్స్‌..!

Chandrababu

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ త‌ర‌చుగా చెబుతున్న మాట‌.. త‌మ‌కు ఓటు బ్యాంకు పెరుగుతోంద‌ని. అంతేకాదు .. ఇంకేముంది.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. వైసీపీ ముఠా మొత్తం.. మునిగిపోతుంద‌ని.! ఇక‌, ప్ర‌జల్లోనూ చంద్ర‌బాబు చెబుతున్న మాట‌… ఈ ప్ర‌భుత్వంపై తిర‌గ‌బ‌డాల‌ని.. ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను అవలంబిస్తున్న జ‌గ‌న్‌ను ఇంటికి పంపించాల‌ని. అయితే.. ఈ విష‌యాలు ఎలా ఉన్నా.. టీడీపీ ఓటు బ్యాంకు కూడా వైసీపీ వైపు మ‌ళ్లుతున్న సంకేతాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. తాజాగా …

Read More »

దూకుడు మీదున్న రేవంత్

ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని చేర్చుకోవటంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంచి దూకుడు మీద ఉన్నాడు. వచ్చే ఏప్రిల్, మేనలలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని, జూన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవటం ఖాయమన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలను రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరటానికి చాలామంది నేతలు ఆసక్తిగా ఉన్నారన్నారు. ముఖ్యంగా కేసీయార్ ఒంటెత్తు పోకడలు నచ్చని చాలామంది టీఆర్ఎస్ …

Read More »

ఆప్ కు పెద్ద షాకిచ్చిన పంజాబ్

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి పంజాబ్ ఓటర్లు పెద్ద షాకే ఇచ్చారు. తాజగా సింగ్రూర్ పార్లమెంటుకు జరిగిన ఉపఎన్నికలో ఆప్ పార్టీ అభ్యర్ధి ఓడిపోయారు. నెలల క్రితమే పంజాబ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బాగానే పరిపాలిస్తున్నారు. ముఖ్యంగా అవినీతి నియంత్రణకు, డ్రగ్ మాఫియా, గ్యాంగస్టర్లను ఏరేయటానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రచారంలో …

Read More »

రాష్ట్రపతి పాలన తప్పదా ?

సంక్షోభంలో కూరుకుపోతున్న మహారాష్ట్ర రాజకీయాలకు రాష్ట్రపతి పాలన ఒకటే మార్గమా ? క్షేత్ర స్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మామూలుగా అయితే సంక్షోభంలో నుండి బయటపడేందుకు ముఖ్యమంత్రి ఉధ్థవ్ థాక్రే పార్టీపరంగా పావులు కదపాలి. ఒకవైపు ఆ ప్రయత్నాలు జరుగుతుండగానే గవర్నర్ భగత్ సింగ్ ఖోషియారీ యాక్టివ్ అయిపోయారు. ఖోషియారీకి ముఖ్యమంత్రికి మధ్య ఏ మాత్రం పడటంలేదు. థాక్రేని ఇబ్బందులు పెట్టడమే టార్గెట్ గా గతంలో కూడా …

Read More »

ఖ‌మ్మం కోట‌లో టీఆర్ ఎస్ ఖాళీ అవుతోందా?

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇక్క‌డి రాజకీయం రసవత్తరంగా మారుతోంది. టికెట్ల‌పై ఆశలు పెంచుకున్న నేతలు తమకు అనుకూలమైన దారుల‌ను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే అధికార టీఆర్ఎస్‌కు చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులతోపాటు అసంతృప్తివాదులు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్‌ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారు అధికంగా ఉండటం, ఇప్పటికే తమకే అభ్యర్థిత్వాలు ఖాయమని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు …

Read More »

జ‌గ‌న్ స‌ర్‌.. క‌డ‌ప కార్య‌క‌ర్త‌ల ఘోష‌.. వినిపిస్తోందా?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో కార్య‌క‌ర్త‌లు ఘోష పెడుతున్నారు. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని..వాడుకుని గాలికొదిలేశార‌ని వారు గ‌గ్గోలు పెడుతున్నారు. దీంతో వైసీపీలో కార్య‌క‌ర్త‌ల క‌ల్లోలం.. ఆక్రోశం.. స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అందునా.. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోనే ఈ ప‌రిస్థితి ఉండ‌డం మ‌రింత‌గా పార్టీని డోలాయ‌మానంలో ప‌డేస్తోంది. సీఎం జగన్‌ సొంత గడ్డ పులివెందులలో ఇటీవ‌ల జరిగిన ప్లీనరీలో కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. ఉత్సవ విగ్రహాల్లా ఉన్నాం. సీఎం సార్‌కు …

Read More »

గెలిచిన మేక‌పాటి సింప‌తీ.. విక్ర‌మ్ విజ‌యం!

నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో.. దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచీ.. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రత్యర్థులపై పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించారు. మొత్తంగా 20 రౌండ్లు లెక్కింపు కొనసాగగా.. ప్రతి రౌండ్‌లోనూ విక్రమ్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగారు. ఆది నుంచీ ఆధిక్యంలో …

Read More »