Political News

సీఎం జ‌గ‌న్‌కు పేరొస్తోంది.. మాకు రావ‌ట్లేదు.. : వైసీపీలో కొత్త ర‌గ‌డ‌

ఏపీ అధికార పార్టీ వైసీపీలో కొత్త ర‌గ‌డ తెర‌మీదికి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌-ఆయ‌న పార్టీ ఎమ్మెల్యేలు.. నేత‌లు.. అంటే అంతా ఒకే కుటుంబం అని అంద‌రూ అనుకుంటున్నారు. సీఎం జ‌గ‌న్ కూడా అలానే భావిస్తున్నారు. ఇది మ‌న ప్ర‌భుత్వం అనే మాటే ఆయ‌న నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది. అయితే.. ఇప్పుడు కొత్త వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. “ముఖ్య మంత్రికే పేరు వ‌స్తోంది.. మాకు …

Read More »

ఏపీ ఉద్యోగుల‌కు షాక్‌.. రేపటిలోగా ఫ్లాట్లు ఖాళీ చేయండి..

మూలిగే న‌క్క‌మీద తాడిపండు ప‌డిన చందంగా మారిపోయింది ఏపీ ఉద్యోగుల ప‌రిస్థితి. పీఆర్సీ స‌రిగా లేద‌ని.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో ఇచ్చిన సీపీఎస్ పింఛ‌న్ ర‌ద్దు హామీని నెర‌వేర్చ‌డం లేద‌ని.. తాము భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం.. దాచుకున్న జీపీఎఫ్ నిధుల‌ను రూ.800 కోట్ల‌ను కూడా స‌ర్కారు సొంతానికి వాడేసుకుంద‌ని ల‌బోదిబోమంటున్న ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ పై స‌ర్కారు మ‌రో పిడుగు వేసింది. వారి పై కొర‌డా ఝ‌ళిపించింది. త‌క్ష‌ణం వెళ్లిపోవాలి.. …

Read More »

ఆదాయం వ‌స్తోంది.. అప్పులూ చేస్తున్నారు.. కానీ.. ఖ‌జానా ఖాళీ

ఏపీ స‌ర్కారు ఆర్థిక మాయాజాలం ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేదు. ఒక‌వైపు ఆదాయం వ‌స్తోంది. మ‌రోవైపు.. కేంద్రం చ‌ల్ల‌ని చూపుతో అప్పులు కూడా చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఖ‌జానాలో చిల్లిగ‌వ్వ ఉండ‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు వెతుకులాటే. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? డ‌బ్బులు ఎటు పోతున్నాయి? ఇదో విక్ర‌మార్క విన్యాసంగా మారిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్రస్తుతం ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి నెలకు సగటున రూ.12వేల కోట్ల వరకు ఆదాయం వస్తోంది. అలాగే… …

Read More »

ఉద్యోగుల సొమ్ము జ‌గ‌న్ పాలు.. 800 కోట్లు హుష్‌!!

ఎక్క‌డైనా.. ఏదైనా ప్ర‌భుత్వం ఉద్యోగుల‌తో ప‌నిచేయించుకుని.. వారికి జీతాలు.. భ‌త్యాల రూపంలో సొమ్ములు ఇస్తుంది. కానీ, ఏపీలో మాత్రం రివ‌ర్స్ జ‌రుగుతోంద‌ని.. ఇక్క‌డి ఉద్యోగులు గ‌గ్గోలు పెడుతున్నా రు. ప్ర‌భుత్వం త‌మ‌ను మరోమారు నమ్మించి, మోసం చేసిందనే వాద‌న ఉద్యోగ సంఘాల నుంచి వినిపి స్తోంది. డీఏ బకాయిలను జీపీఎఫ్‌ ఖాతాలకు జమ చేసినట్లే చేసి, వెనక్కి తీసుకుందని చెబుతున్నారు. వ్యక్తిగత జీపీఎఫ్‌ ఖాతాల నుంచి తమ అనుమతి లేకుండా …

Read More »

వైసీపీ సీనియ‌ర్ల.. రాజ‌కీయం గ‌రంగ‌రం

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు, పైగా.. సీఎం జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులుగా పేరున్న‌వారు.. ఇప్పుడు రోడ్డున ప‌డ్డారు. ముఖ్యంగా జ‌గ‌న్ ఈ ఏడాది ఏప్రిల్‌లో చేప‌ట్టిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ త‌ర్వాత‌.. ఈ అసంతృప్తి మ‌రింత పెరిగిపోయింది. వీరిలో జ‌గ‌న్‌కు మామ వ‌ర‌స అయ్యే.. ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి తెర‌మీదికి రాగా.. 24 గంట‌లు గ‌డ‌వ‌క ముందే.. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే, జ‌గ‌న్‌కు మిత్రుడు కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి …

Read More »

ఇదేంది థాక్రేకి మరో గట్టి దెబ్బ ?

మహారాష్ట్రలో సంకీర్ణప్రభుత్వ సంక్షోభం నానాటికీ పెద్దదయిపోతోంది. ఇప్పటికే మంత్రి ఏక్ నాధ్ షిండే నాయకత్వంలో మంత్రులు, ఎంఎల్ఏలు అంతా కలిపి సుమారు 40 మంది తిరుగుబాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. తిరుగుబాటు లేవదీసిన ఎంఎల్ఏల సంఖ్య ఎంతన్నది కచ్చితంగా తెలియకపోయినా షిండే వర్గానిదే మెజారిటి అని తెలుస్తోంది. తిరుగుబాటు లేవదీసిన ఎంఎల్ఏలను ఎలా దారికితెచ్చుకోవాలో అర్ధంకాక సీఎం థాక్రే బుర్రగోక్కుకుంటున్నాడు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎంపీల్లో కూడా తిరుగుబాటు …

Read More »

సాయిరెడ్డీ.. ఎంత కోప‌ముంటే మాత్రం ఇలా రాయుడేంది?

వైసీపీ కీల‌క నాయ‌కుడు.. ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తాజాగా పార్ల‌మెంటు స్పీక‌ర్ ఓం బిర్లాకు రాసిన లేఖ వివాదానికి దారితీసింది. రాజ‌కీయంగా ఎంతో ప‌రిపక్వ‌త సాధించాన‌ని.. చెప్పుకొనే సాయిరెడ్డి ఏమాత్రం ప‌ర‌ప‌క్వ‌త లేకుండా వ్య‌వ‌హ‌రించార‌నే వాద‌న వినిపిస్తోంది. దీనికి కార‌ణం.. తాజాగా సాయిరెడ్డి రాసిన లేఖే. విష‌యం ఏంటంటే.. వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు పార్టీ అధిష్టానానికి మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న నిత్యం ర‌చ్చ‌బండ‌ను వేదిక‌గా …

Read More »

అమ‌రావ‌తి భూములు ఎక‌రం 10 కోట్లు.. జ‌గ‌న్ వ్యూహం ఏంటి?

ఏపీ క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్ ఏం చేస్తున్నారు. ఆయ‌న ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతున్నారు..? ఇదీ..ఇప్ప‌డు జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఎందుకంటే.. తాను ప‌ట్టిన కుందేలుకు మూడేకాళ్ల‌న‌ట్టుగా.. ఏపీలో మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేసి తీరుతామ‌ని.. ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గేదిలేద‌ని.. ప‌దే ప‌దే చెప్పారు. ఈ విష‌యంలో ఏకంగా.. శాస‌న మండ‌లిని ర‌ద్దు చేసేందుకు కూడా వెనుకంజ వేయ‌లేదు. రాత్రికి రాత్రి.. మండ‌లి ర‌ద్దుకు …

Read More »

‘మొగుళ్లు వద్దన్నా వారి పెళ్లాలే మాకు ఓటేస్తారు’

నోటికి ఎంత మాట వ‌స్తే.. అంత అనేస్తున్న వైసీపీ నాయ‌కులు. నాలుగు గోడ‌ల మ‌ధ్య‌మాట్లాడుకోవాల్సిన వ్యాఖ్య‌లను కూడా బ‌హిరంగ వేదిక‌ల‌పై నోరు జారేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, సీనియ‌ర్ నాయకుడు చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర సంచ‌ల‌నంగా మారాయి. మొగుళ్లు వద్దన్నా వారి పెళ్లాలే మాకు ఓటేస్తారు. సంక్షేమ ప‌థ‌కాల కింద వేల‌కు వేలు ఇస్తున్నాం.. మాకు కాకుండా ఎవ‌రికి ఓటేస్తారు. అస‌లు అంత ద‌మ్ము ఎవ‌రికి ఉంది! అని స‌ద‌రు …

Read More »

ఏబీవీని వీడ‌ని ఏపీ స‌ర్కారు.. మ‌రోసారి స‌స్పెన్ష‌న్ వేటు

ఏపీ స‌ర్కారు.. సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును వెంటాడుతూనే ఉంది. ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సస్పెన్షన్ తొలగించిన ఏపీ ప్రభుత్వం ఇటీవల పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా వైసీపీ ప్రభుత్వం ఆయనను నియమించింది. అయితే ఇప్పుడు సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఏబీ వెంకటేశ్వరరావు క్రమశిక్షణారహిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ప్రభుత్వ సీఎస్ సమీర్ శర్మ మరోసారి సస్పెన్షన్ ఉత్తర్వులు …

Read More »

వైసీపీ కార్యకర్తల పిల్లలకే వలంటీర్ పదవులు ఇచ్చాం

రాజ‌కీయాల్లో ఒక విష‌యాన్ని సూటిగా చెప్ప‌డం నాయ‌కుల‌కు చాలా క‌ష్టంతో కూడిన ప‌ని. ఏం డ్యామేజీ వ‌స్తుందో.. ఏం జ‌రు గుతుందో అనే భావ‌న వారిలో ఉంటుంది. అందుకే విష‌యం క‌నుక కొంత సంక్లిష్టం అయిన‌ప్పుడు దానిని అటు తిప్పి.. ఇటు తిప్పి.. క‌వ‌ర్ చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. కొన్ని కొన్ని సార్లు దాట‌వేత వైఖ‌రి కూడా అవ‌లంభిస్తారు. అయితే.. ఇలాంటి ప‌రిణామం.. ఎక్క‌డైనా ఉంటుందేమో కానీ.. వైసీపీలో మాత్రం …

Read More »

కిల్లి స్టేచర్ ఇంతేనా ?

జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. జగన్ దిగిన హెలిప్యాడ్ దగ్గరకు మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలు వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. కొందరు చోటా మోటా నేతలు కూడా వెళ్ళారు. అయితే కేంద్ర మాజీమంత్రిగా పనిచేసిన డాక్టర్ కిల్లి కృపారాణి పేరు మాత్రం ప్రోటోకాల్ జాబితాలో నుండి మయమైపోయిందట. అందుకనే హెలిప్యాడ్ దగ్గరకు వెళ్ళేందుకు అనుమతిలేదని పోలీసులు స్పష్టంగా చెప్పేశారు. తనకు అవమానం జరిగిందని మండిపోయిన కిల్లి …

Read More »