Political News

త‌క్ష‌ణం.. 4 వేల పింఛ‌న్‌.. కాంగ్రెస్ హామీ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సామాజిక పింఛ‌న్ పెంపుద‌ల ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌చార అస్త్రంగా మారిపోయింది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌కు ముందే అధికార బీఆర్ ఎస్ పార్టీ దీనిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. తాము అధికారంలో మ‌ళ్లీ వ‌స్తే.. పింఛ‌నును ఏటా రూ.500 చొప్పున పెంచుకుంటూ.. ఐదేళ్లు పూర్త‌య్యేనాటికి రూ.5000 చేస్తామ‌ని బీఆర్ ఎస్ అధినేత ప్ర‌క‌టించారు. అయితే.. దీనిపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఏపీ సీఎం జ‌గ‌న్ ను ఆయ‌న అనుస‌రిస్తున్నార‌నే వాద‌న …

Read More »

‘జ‌గ‌న్‌పై ఈగ వాలినా ఊరుకోం.. ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం’

ఏపీ సీఐడీ.. ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా మీడియాలో ఉంటున్న పోలీసు విభాగం. మాజీ సీఎం చంద్ర‌బాబు అరెస్టు ద‌రిమిలా.. ఏపీ సీఐడీ చ‌ర్య‌లు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా ఏపీ సీఐడీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం జ‌గ‌న్‌పై ఈగ‌వాలినా ఊరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. ఎవ‌రైనా సాహ‌సించి ఆయ‌న‌పై పోస్టులు పెట్టినా.. వ్యాఖ్య‌లు చేసినా వారి ఆస్తుల‌ను స్వాధీనం చేసుకుని కేసులు పెడ‌తామ‌ని …

Read More »

కేసీఆర్ ను పీకే ఏం చేయలేరు: హరీష్ రావు

నిన్న మొన్నటి వరకు ఏపీ రాజకీయాలకే పరిమితమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా తెలంగాణ రాజకీయాలలో యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో నిన్న జరిగిన బీసీల ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్న పవన్ కల్యాణ్…బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కల్యాణ్ పై బీఆర్ఎస్ నేతలు కూడా ఎదురుదాడికి దిగారు. ఈ నేపథ్యంలోనే జనసేనాని పవన్ …

Read More »

ఇసుక కేసులో చంద్రబాబుకు ఊరట

ఇసుక కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ గతంలో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమా పేర్లను చేర్చారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోరుతూ చంద్రబాబు తరఫు లాయర్లు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు…ఈ …

Read More »

‘నాట్ బిఫోర్ మీ’.. జ‌గ‌న్ కేసులో ఏపీ హైకోర్టు

‘నాట్ బిఫోర్ మీ’- ఈ మాట ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా వినిపిస్తోంది. సుప్రీంకోర్టుల నుంచి హైకోర్టుల వ‌ర‌కు కూడా.. న్యాయ మూర్తులు ప‌లు కేసుల విచార‌ణ నుంచి దూరం జ‌రుగుతున్నారు. గ‌తంలో ఆయా కేసుల‌కు సంబందించిన పిటిష‌న‌ర్ల త‌ర‌ఫున వీరు న్యాయ వాదులుగా వాదించ‌డ‌మో.. లేక గ‌తంలో ఈ కేసుల‌ను న్యాయ‌మూర్తుల‌గా ఉండి విచార‌ణ చేయ‌డ‌మో.. నేప‌థ్యంలో న్యాయ‌మూర్తులు ఇలా నాట్ బిఫోర్ మీ అనే ఫార్ములాను వినియోగిస్తున్నార‌ని న్యాయ …

Read More »

పంతం నెగ్గించుకున్న ఈటల

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పంతం నెగ్గించుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఓ వైపు తన సిట్టింగ్ స్థానం హుజూరాబాద్ తో పాటు కేసీఆర్ కు పోటీ ఇచ్చేందుకు గజ్వేల్ బరిలో దిగుతున్న ఈటల.. ఇప్పుడు వేములవాడ విషయంలోనూ అనుకున్నది సాధించారు. తనను నమ్మి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన తుల ఉమకు వేములవాడ టికెట్ వచ్చేలా చూసుకున్నారు. ఈ టికెట్ ను తుల ఉమకు ఇప్పించడం కోసం పట్టుబట్టి మరీ …

Read More »

అప్ప‌ట్లో బాబు ఫైట్ చేశారు.. మ‌రి జ‌గ‌న్ ?

“మా ప‌థ‌కాల‌కు మీ బొమ్మలు.. మీ పేర్లు వేసుకుంటున్నారు. ఇలా కుద‌ర‌దు.”- అని కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు.. తాజాగా సీఎం జ‌గ‌న్‌కు తేల్చి చెప్పిన ఘ‌ట‌న చ‌ర్చనీయాంశం అయింది. రాష్ట్ర బీజేపీ నాయ‌కులు.. ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను కేంద్రానికి వివ‌రించ‌డం.. కేంద్రం నుంచి మంత్రి అధావ‌లే ఇటీవ‌ల వ‌చ్చి ఇక్క‌డి ప‌థ‌కాల పేర్లు ప‌రిశీలించ‌డం తెలిసిందే. ఆ వెంట‌నే కేంద్రం.. జ‌గ‌న్ స‌ర్కారుకు తాఖీదు పంపింది. ఇలా అయితే.. …

Read More »

సీఎం రేసు నుంచి బయటకు వచ్చేసిన కోమటిరెడ్డి

తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తుందన్న చర్చ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ విషయాన్ని అనధికారిక సమావేశాల్లో అధికార బీఆర్ఎస్ నేతలు సైతం ఒప్పుకోవటం కనిపిస్తోంది. పదేళ్ల కేసీఆర్ పాలనపై తెలియని అసంతృప్తి వ్యక్తమవుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ కు ఈసారి అధికారాన్ని అందించాలన్న అభిలాష పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. ఇలాంటి వేళలో.. కేసీఆర్ అండ్ …

Read More »

షర్మిలకు నేతల షాక్

వైఎస్సార్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పార్టీ నేతలు కొందరు పెద్ద షాకిచ్చారు. గట్టు రామచంద్రరావు నాయకత్వంలో కొందరు నేతలు పార్టీకి రాజీనామాలు చేశారు. తర్వాత పార్టీ ఆపీసు బయటే నిలబడి షర్మిల గో బ్యాక్ అంటు నినాదాలు చేయటం కలకలం సృష్టించింది. ఇప్పటివరకు పార్టీలో ఉండలేని నేతలు రాజీనామాలు చేసి బయటకు వెళ్ళిపోయారంతే. అంతేకానీ షర్మిలను ఉద్దేశించి తెలంగాణా నుండి గో బ్యాక్ అంటు నినాదాలు చేసింది లేదు. షర్మిల …

Read More »

ఎనిమిది మందితో జ‌న‌సేన అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ ఆమేర‌కు పొత్తులు ఫైన‌ల్ చేసుకున్న విష‌యం తెలిసిందే. మొత్తం 119 స్థానాల తెలంగాణ అసెంబ్లీలో జ‌న‌సేన‌కు బీజేపీ 9 స్థానాలు కేటాయించింది. వీటిపై తాజాగా ఓ క్లారిటీకి వ‌చ్చిన జ‌న‌సేన‌.. వెంట‌నే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. మొత్తం జ‌న‌సేన‌కు కేటాయించిన 9 స్థానాల‌కుగాను.. 8 చోట్ల అభ్య‌ర్థుల‌ను జ‌న‌సేన …

Read More »

బీజేపీ వస్తే బీసీ ముఖ్యమంత్రి: మోడీ

హైదరాబాద్ లో జరిగిన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు కే లక్ష్మణ్, ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితర నేతలు హాజరయ్యారు. నా కుటుంబ సభ్యులారా అంటూ తన ప్రసంగాన్ని ప్రధాని మోడీ తెలుగులో ప్రారంభించారు. సభలో …

Read More »

వైసీపీ వ్యూహానికి సుప్రీంకోర్టు బ్రేకేస్తుందా?

కొన్ని కొన్ని విష‌యాలు చిన్న‌వే అయినా.. నాగ‌రిక స‌మాజానికి సంబంధం లేద‌ని అనుకున్నా.. విష‌య ప్రాధాన్యాన్ని బ‌ట్టి వాటికి ప్రాధాన్యం వ‌చ్చేస్తుంది. ఆయా విష‌యాలు అత్యంత వేగంగా ప్ర‌చారంలోకి వ‌చ్చేస్తాయి. చ‌ర్చ‌లుగా రూపాంత‌రం కూడా చెందుతా యి. దీనిపై ఏం జ‌రుగుతుందో? ఏం చేస్తారో? అనే ఉత్కంఠ కూడా తెర‌మీదికి వ‌స్తుంది. ప్ర‌స్తుతం ఇలాంటి ఓ విష‌య‌మే ఏపీలో గుప్పు మంది! నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌శాంతంగా.. ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం …

Read More »