ఇపుడిదే అంశం రాజకీయ పార్టీల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో జనాలకు ఎలాంటి హామీలివ్వాలనేది పూర్తిగా రాజకీయ పార్టీ ఇష్టమే. అయితే ఎన్నికల సమయంలో ఇస్తున్న హామీల అమలు అధికారంలోకి వచ్చేసరికి చాలా కష్టమవుతోంది. జనాలను ఆకర్షించటమే టార్గెట్ గా చాలా పార్టీలు బుర్రకు తోచిన హామీలిచ్చేస్తున్నాయి. చాలా పార్టీలు అధికారంలోకి రాగానే అంతకుముందిచ్చిన హామీలను గాలికొదిలేస్తున్నాయి. ఈ అంశంపై ఇపుడు సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. బీజేపీ నేత, …
Read More »ఉద్యోగులకు అస్సలు నచ్చని పని చేస్తున్న జగన్
వైసీపీలో తీవ్ర సంచలనంగా మారిన ఈ నినాదం.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. ఇదే నిజమైతే.. మనం ఇంటకే జగనన్నా.. అంటూ.. నాయకులు లబోదిబోమంటున్నారు. ఇంతకీ.. ఏం జరిగింది? ఎందుకు? అంటే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సీపీఎస్ రద్దును తొక్కి పెట్టి..రాష్ట్ర ప్రభుత్వం మరో 4200 కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోదన్న వ్యాఖ్యలు.. మీడియాలో జోరందుకు న్నాయి. బుధవారం ఈ వార్తలు.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. …
Read More »పోలవరం కోసం కేంద్రంతో యుద్ధాలు చేస్తున్నాం: జగన్
ఏపీ సీఎం జగన్.. పోలవరం ప్రాజెక్టుపై సంచలన, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం నిర్మాణం పూర్తి చేసేందుకు తాముకేంద్రంతో యుద్ధాలు.. ఫైటింగులు చేస్తున్నామని చెప్పారు. కొన్ని కొన్ని సార్లు బ్రతిమాలుతున్నట్టు చెప్పారు. అయితే.. కేంద్రం నుంచి నిధులు రావడం లేదన్నారు. ఇక, పోలవరం కట్టినా.. నీళ్లు పూర్తిగా నింపేది ఉండదని.. దీనికి కేంద్ర ప్రబుత్వం ఒప్పుకోదని చెప్పారు. నిధుల విడుదల కోసం తరచూ కేంద్రానికి వినతిపత్రాలు పంపిస్తున్నామని.. సెప్టెంబర్ లోగా …
Read More »కొవ్వూరు వైసీపీలో ఏం జరుగుతోంది ?
హోంశాఖ మంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గం సహకార బ్యాంకు ఎన్నికల ఫలితం రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులోని 11 డైరెక్టర్ పోస్టులకు జరిగిన ఎన్నికలో టీడీపీ గెలవటమే ఆశ్చర్యంగా ఉంది. మొత్తం అన్ని స్దానాలను ప్రతిపక్ష టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్న విషయంపైనే అందరి దృష్టి పడింది. ఒక పార్టీ ఏకగ్రీవంగా అన్నీ స్ధానాలు గెలిచిందంటేనే ప్రతిపక్షం లేదనే కదా అర్ధం. …
Read More »ముద్రగడ.. రూటు మారుతోందా?
కాపు ఉద్యమ నాయకుడు.. ముద్రగడ పద్మనాభం రూటు మార్చారా? టీడీపీవైపు చూస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజకీయ పరిశీలకులు. గత ఎన్నికలకు ముందు ఆయన టీడీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు గుప్పించారు. నిరసన వ్యక్తం చేశారు. దీంతో ముద్రగడ అనుకూల వర్గం.. టీడీపీని వ్యతిరేకించింది. ఇది అప్పట్లో వైసీపీకి మేలుచేసిందనే విశ్లేషణలు వచ్చాయి. పైగా.. ముద్రగడ కూడా.. వైసీపీని కాపుల రిజర్వేషన్ విషయంలో బలవంతం చేయలేదు. దీంతో …
Read More »102 స్థానాలు టీడీపీకి అనుకూలమా… తమ్ముళ్ల చర్చ..!
టీడీపీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? గతానికి భిన్నంగా పార్టీ పుంజుకుందా? వచ్చే ఎన్నికల్లో దూకుడు చూపించి.. అధికారం కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ తమ్ముళ్లు. మహానాడు తర్వాత… పార్టీ పుంజుకుందని చెబుతున్నారు. ఎక్కడికి వెళ్లినా.. చంద్రబాబు పేరు వినిపిస్తోందని అంటున్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకత, వివిధ కారణాల వల్ల తమ గ్రాఫ్ పెరుగుతోందని అంటున్నారు. అదేసమయంలో ఎస్సీలు, …
Read More »పశువులు సైతం మెచ్చుకునేలా వరద సాయం: జగన్
వరద నష్టంపై వెంటనే అంచనాలు పూర్తి చేసి.. ఈ సీజన్లోనే పరిహారం చెల్లిస్తామని సీఎం జగన్ కోనసీమలోని బాధితులకు హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. జి.పెదపూడిలంక వద్ద వంతెన నిర్మిస్తామన్నారు. వరద సాయం అందని ఒక్కరిని కూడా చంద్రబాబు చూపించలేకపోయారని, ఈ విషయంలో ఆయన విఫలమయ్యారని సీఎం జగన్ విమర్శించారు. కోనసీమ జిల్లాలోని గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. హెలికాప్టర్లో తాడేపల్లి …
Read More »సీఎం జగన్ పెన్ను విలువ ఎంతో తెలుసా?
ఏపీ సీఎం జగన్ కు చిత్రమైన అనుభవం ఎదురైంది. మంగళవారం ఆయన వరద ప్రభావితం ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఇళ్లకు వెళ్లి బాధితులను కలిశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వారితో కలివిడిగా వ్యవహరించి.. ఓదార్చారు. ఈ సందర్భంగా ఓ మహిళ ఎత్తుకున్న తన చిన్నారిని సీఎం జగన్ ముద్దాడారు. అక్కడితో ఆగకుండా.. ఆయన ఆ చిన్నారిని తన ఒళ్లోకి తీసుకుని ఎత్తుకున్నారు. చాలా సేపు ఎత్తుకున్నారు. …
Read More »అక్కడ ఎంపీ అభ్యర్థి ఎవరు? రెండు పార్టీల్లోనూ కలవరం
వచ్చే ఎన్నికలు ఎంత హాట్ గా ఉంటాయో.. ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. గెలుపు కోసం.. అధికార వైసీపీ. టీడీపీలు ఢీ.. అంటే ఢీ.. అనే ముందుకు సాగుతున్నాయి. అయితే.. ఎక్కడ ఎలా ఉన్నా.. విజయవాడ, గుంటూరు నగరాలు అత్యంత కీలకం. ఈ రెండు చోట్లా తమ తమ పార్టీలు గెలుపు గుర్రం ఎక్కితే.. ఆ లెక్కే వేరు! అనే విధంగా పార్టీలు భావిస్తాయి. అయితే.. ఇప్పుడు ఈ రెండు ఎంపీ …
Read More »జనం లేని.. జగనన్న పర్యటనలు
ఏపీ సీఎం జగన్ గురించి ఆయన పార్టీ వైసీపీనాయకులు చాలా గొప్పగా చెబుతారు. జగన్ ఎక్కడ అడుగు పెట్టినా.. భారీ సంఖ్యలో జనాలు వస్తారని.. ఇసుక వేసినప్పటికీ రాలదని.. చాలా చాలా వర్ణిస్తారు. అయితే .. ఇది ఎన్నికలకు ముందు. ఇప్పుడు సీఎం అయ్యాక మాత్రం ఎక్కడా అలాంటి జోష్ కనిపించడం లేదు. ఇటీవల చాలా చోట్ల జగన్ నిర్వహించిన సభలకు డ్వాక్రా మహిళా సంఘాలను తరలించాల్సి వచ్చింది. ఎందుకంటే.. …
Read More »మరీ ఇంత వైరాగ్యమా ? గుడ్ బై చెప్పేస్తారా ?
ఎవరికి కూడా వైరాగ్యం అంత తొందరగా రాదు. అందులోను రాజకీయాల్లో దశాబ్దాలుగా పదవుల్లో ఉంటున్నవారికి అసలు రాదు. దీర్ఘకాలంపాటు ప్రతిపక్షంలోనే ఉన్నవారిలో కొందరు నేతలకు వైరాగ్యం వచ్చినా అదోలెక్క. ఎందుకంటే ఎంతకాలమున్నా ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సిందే అని ఫిక్సయిపోయిన కొందరికి వైరాగ్యం రావటంలో తప్పుకూడాలేదు. కానీ అధికారంలో ఉంటు మంత్రిగా పనిచేస్తున్న సీనియర్ నేతకు కూడా వైరాగ్యం వచ్చిందంటే ఏమిటర్ధం ? ఇపుడిదంతా ఎవరి విషయంలో అంటారా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ …
Read More »మమత.. మమతే! ఫైర్.. ఫైరే..!!
దేశంలోని 28 మంది ముఖ్యమంత్రుల్లో బెంగాల్ సీఎం మమతకు ఉన్న పేరు.. బ్రాండ్ సపరేటు. ఆమె నోరు విప్పితే.. నిప్పులు రాలాల్సిందే. ప్రతిపక్షంపై విమర్శల జడివాన కురవాల్సిందే. అంతేకాదు.. ఒక్కొక్కసారి తన వారైనా సరే.. మమత ఫైర్ మామూలుగా ఉండదు. ఇప్పుడు అదే దూకుడు.. తన సొంత కేబినెట్ మంత్రి.. ఆమెకు అత్యంత ప్రియమైన నేత పార్థా ఛటర్జీపై చూపించారు. ఆయనకు జీవిత ఖైదు విధించినా సంతోషమేనని చెప్పారు. అంతేకాదు.. …
Read More »