Political News

హుజూరాబాద్‌లో గెల‌వ‌క‌పోతే.. ద‌ళిత బంధు ఉండ‌దా?

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఎలాగైనా గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న కేసీఆర్‌.. అక్క‌డ అధికంగానే ఉన్న ద‌ళితుల ఓట్ల‌ను పొంద‌డానికి ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని రాష్ట్రంలో మొట్ట‌మొద‌టిగా ఆ నియోజ‌క‌వ‌ర్గంలోనే ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ద‌ళిత బంధు లాంటి ప‌థ‌కం దేశంలో లేద‌ని.. ఎన్నిక‌ల కోసం కాకుండా ప్ర‌జ‌ల సంక్షేమం కోస‌మే ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించామ‌ని టీఆర్ఎస్ నాయ‌కులు ఎంత మొత్తుకున్నా.. ఆ ప‌థ‌కాన్ని హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో పైల‌ట్ ప్రాజెక్టుగా ఎందుకు …

Read More »

తెలంగాణ వాకౌట్

కృష్ణా జలాల వినియోగంపై ఇంతకాలం తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న వాదనల్లోని పసలేదని బయటపడింది. తన వాదనలో లాజిక్ లేదని తేలిపోయాక, అడ్డుగోలు వాదన సాధ్యం కాదని అర్ధమైపోయాక సింపుల్ గా సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్ చేసేసింది. రెండు రాష్ట్రాల మధ్య మొదలైన జలవివాదాలపై చర్చించేందుకు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబి) సమావేశం జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల్లోని జలవనరుల శాఖల్లోని …

Read More »

‘వైయస్ ఆత్మీయ సమ్మేళనం’లో వైఎస్ ఆత్మ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా వైఎస్ కుటుంబంతోపాటు ఆయన అభిమానులు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఇడుపులపాయలో వైఎస్ జగన్, షర్మిలతో కలిసి వైఎస్ఆర్ కు నివాళులర్పించిన వైయస్ విజయమ్మ…ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో జరగనున్న ‘వైయస్ ఆత్మీయ సమ్మేళనం’ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ కు సన్నిహితంగా ఉన్న పలువురు రాజకీయ నేతలతో పాటు పలువురు అధికారులను విజయమ్మ …

Read More »

జ‌గ‌న్‌ కి ఇది కత్తి మీద సామే !

ఇప్పుడు.. ఈ ప్ర‌శ్న మేధావుల‌ను కూడా తిక‌మ‌క పెడుతోంది. క‌ర‌డు గ‌ట్టిన వైసీపీ అభిమానుల‌ను కూడా క‌ల‌చి వేస్తోంది. ఎందుకంటే.. ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ ఇచ్చిన అనేక హామీల్లో ఒక‌టి అత్యంత క్లిష్ట మైన హామీ. ఇప్పుడు ఈ హామీని నిల‌బెట్టుకోవ‌డం అనేది జ‌గ‌న్‌కు క‌త్తిమీద సాముగా మారింది. అయితే.. అమ‌లు చేయ‌క‌పోతే.. వ‌చ్చె ఎన్నిక‌ల్లో ఈ హామీ పెద్ద మైన‌స్‌గా మారిపోవ‌డం ఖాయం. దీంతో ఇప్పుడు జ‌గ‌న్ మ‌డ‌మ …

Read More »

పవన్ ఆ పని చేశాకైనా ప్రభుత్వం కదులుతుందా !

రాబోయే గాంధీ జయంతి రోజున శ్రమదానంతో రోడ్లు బాగు చేయడానికి రెడీగా ఉన్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. అంతేకాకుండా జనసైనికులు శ్రమదానం చేసి రోడ్లను బాగు చేయడానికి రెడీగా ఉండాలని జనసేన నేతలు, యువ సైనికులతో పాటు వీర మహిళలకు పవన్ పిలుపిచ్చారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందనడంలో సందేహం లేదు. అయితే ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు తలెత్తింది కాదని గ్రహించాలి. రాత్రికి రాత్రి ఏ …

Read More »

టచ్ మీ నాట్ అంటున్న గంటా… ?

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఒకసారి రాజకీయాల్లోకి వచ్చాక జనాలు హడావుడి చూసాక ఎవరూ ఇంటి పట్టున ఉండాలనుకోరు. ఓడినా సరే ఏదో రకంగా మీడియాలో జనాలలో నలగాలని చూస్తారు. కానీ గంటా మాత్రం తన రూటే సెపరేట్ అంటున్నారు. ఆయన మిగిలిన నాయకుల మాదిరిగా అసలు ఆయాసం పడకుండా ఇంటి వద్దనే రెండేళ్ళుగా గడిపేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ …

Read More »

స్టాలిన్ జపంలో మెగా ఫ్యామిలీ..!

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై మెగా ఫ్యామిలీ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. మొన్నటికి మొన్న చిరంజీవి.. స్టాలిన్ ని ప్రత్యేకంగా కలవగా.. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. బుధవారం చెన్నై వెళ్లిన చిరు.. సీఎం స్టాలిన్‌ను ఆయన ఆఫీస్‌లో కలిశారు. ఆయనతోపాటు స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నారు. చిరంజీవి కుటుంబానికి స్టాలిన్ ఫ్యామిలీకి మొదటి నుంచి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. …

Read More »

మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులపై ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సీబీఐ మంత్రి సురేష్ తో పాటు ఆయన భార్య విజయలక్ష్మి పై ఎఫ్ఐఆర్ నమోదు కు రెడీ అయ్యింది. మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదవుతున్న ఘటన చాలా ఆసక్తిగా మారింది. గడచిన రెండున్నరేళ్లలో ఓ మంత్రిపై ఏకంగా ఎఫ్ఐఆర్ నమోదవ్వటం ఇదే మొదలు. అది కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతో …

Read More »

వైఎస్సార్ వర్థంతి.. ఒక్కటైన జగన్, షర్మిల..!

వైఎస్సార్ అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల కలిశారు. తండ్రి వర్థంతి కార్యక్రమంలో వీరు కలుసుకోవడం గమనార్హం. ఇడుపులపాయ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్దంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్దంతి కార్యక్రమాల్లో సీఎం జగన్, షర్మిల ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సీఎం జగన్, షర్మిల …

Read More »

కేటీఆర్ ఇలాకాలో.. సంజ‌య్ స‌వాల్‌

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను మార్పులే ల‌క్ష్యంగా ప్ర‌జా సంగ్రామ యాత్ర పేరుతో పాద‌యాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ దూకుడు కొన‌సాగిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోపు పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా త‌న పాద‌యాత్ర‌ను పూర్తిస్థాయిలో ఉప‌యోగించుకోవాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. దీంతో పాటు అధికార టీఆర్ఎస్‌ను స‌వాల్ చేసే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. కొద్దిరోజుల క్రిత‌మే మొద‌లైన ఆయ‌న పాద‌యాత్ర ఇప్పుడు ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాలో కొన‌సాగుతోంది. …

Read More »

అయ్య‌న్న ఔట్‌.. మారుతున్న న‌ర్సీప‌ట్నం రాజ‌కీయం..!

మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు.. చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు రిటైర్ కానున్నారా? ఆయన‌ను ప‌క్క‌న పెట్టేందుకు పార్టీ అధిష్టానం ప్ర‌తిపాద‌న సిద్ధం చేస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు త‌మ్ముళ్లు. విశాఖ జిల్లా న‌ర్సీప‌ట్నం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అయ్య‌న్న‌కు పార్టీలో మంచి ప‌ట్టుంది. పార్టీ ఆవిర్భ‌వించిన 1982 నుంచి ఆయ‌న టీడీపీలోనే కొన‌సాగుతున్నారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014 ఎన్నిక‌ల్లోనూ.. అయ్య‌న్న దిగ్విజ‌యం …

Read More »

ఆకాశ రామ‌న్న విరాళాలు.. అక్ష‌రాల రూ.14 వేల కోట్లు

ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయాలు చాలా కాస్ట్లీ అయిపోయాయ‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో ఉంది. నాయ‌కులు ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ‌డం ద‌గ్గ‌ర నుంచి గెలిచి పార్టీని అధికారంలోకి తెచ్చేంత వ‌ర‌కూ చాలా డ‌బ్బు ఖ‌ర్చువుతోంది. అస‌లు ఎంత ధ‌నం వెచ్చిస్తున్నారో కూడా అంచ‌నాల‌కు అంద‌ట్లేదు. ప్ర‌చారాల కోస‌మ‌ని ఓట‌ర్ల‌ను కొన‌డం కోస‌మ‌ని ఇలా ఎన్నిక‌లు వ‌స్తే చాలు డ‌బ్బు ప్ర‌వాహం కొన‌సాగుతుంది. మ‌రి ఇంత మొత్తంలో ఖ‌ర్చు పెట్టేందుకు పార్టీల‌కు ఇన్ని కోట్ల రూపాయాల …

Read More »